అన్వేషించండి

Toyota Innova Crysta Launched: టయోటా ఇన్నోవా క్రిస్టా లాంచ్:  సరికొత్త అప్‌డేట్స్ తో వచ్చిన ప్రీమియం ఎమ్‌పీవీ కార్.. లుక్స్ తో పాటు అదిరిపోయే ఇంటీరియర్ ఫీచర్లు

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా మార్కెట్ లో మోస్ట్ పాపులర్ అప్‌డేటెడ్ ఇన్నోవా క్రిస్టా కార్ ను రూ. 19.72 లక్షల బేస్ ప్రైస్ తో అధికారికంగా రిలీజ్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా మెరుగుపర్చిన ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చింది.
  • బోల్డర్ గ్రిల్, లగ్జరీ క్యాబిన్ తో ఆధునిక రూపం సంతరించుకుంది.
  • నమ్మకమైన 2.4L డీజిల్ ఇంజిన్, అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
  • ఈ మోడల్ ధర రూ. 19.72 లక్షల నుండి ప్రారంభమైంది.

Toyota Innova Crysta Launched In India: ఇండియాలో ఫ్యామిలీ కార్ గా ఎంతో సక్సెస్ సాధించిన టయోటా ఇన్నోవా క్రిస్టా సరికొత్త మార్పులతో మార్కెట్ లోకి వచ్చింది. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు ఈ ఎమ్‌పీవీ (MPV) లో కొన్ని కాస్మెటిక్ డిజైన్ చేంజెస్ తో పాటు కొత్త కంఫర్ట్ ఫీచర్లను కంపెనీ యాడ్ చేసింది. రెండు దశాబ్దాలుగా దేశంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్ గా ఉన్న ఈ కార్ ను మరింత ప్రీమియం లుక్ లోకి మార్చారు. నమ్మకమైన డీజిల్ పవర్‌ట్రెయిన్ తో నడిచే ఈ కొత్త వెర్షన్ ప్రాక్టికల్ ఫ్యామిలీ వెహికల్ కోరుకునే బైయర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.

Read Also: First Flex Fuel Motorcycles: హీరో నుంచి మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు లాంచ్: స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ వెర్షన్లు రెడీ.. గడ్కరీ చేతుల మీదుగా ఆవిష్కరణ

బోల్డర్ లుక్ లో ఫ్రంట్ గ్రిల్.. 

ఈ 2026 టయోటా ఇన్నోవా క్రిస్టా ఓవరాల్ సిల్హౌట్ పాత మోడల్ లాగే ఉన్నప్పటికీ దీని లుక్ ను మరింత మోడ్రన్ గా మార్చడానికి కొన్ని మార్పులు చేశారు. ఫ్రంట్ సైడ్ రీడిజైన్ చేసిన సరికొత్త బోల్డర్ ఫ్రంట్ గ్రిల్ ను అమర్చారు. దీనితో పాటు కార్ కు రోడ్ ప్రెజెన్స్ ను పెంచేలా ఫ్రంట్, రియర్ బంపర్ గార్నిష్ లను రివైజ్ చేశారు. ఈ కాస్మెటిక్ అప్‌డేట్స్ వల్ల కారుకు మరింత మస్కులర్, సోఫిస్టికేటెడ్ అప్పీయరెన్స్ లభిస్తోంది. ప్రీమియం స్టైల్ తో పాటు ప్రాక్టికాలిటీని ఇష్టపడే కస్టమర్లను టార్గెట్ చేస్తూ దీనిని డిజైన్ చేశారు.

Read Also: Top Automatic Cars Under 6 Lakhs: 6 లక్షల బడ్జెట్ లో టాప్ ఆటోమేటిక్ కార్లు: సిటీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ ఇక చాలా ఈజీ.. బెస్ట్ మైలేజ్, మోస్ట్ ఎఫోర్డబుల్

లగ్జరీ క్యాబిన్ ఎక్స్ పీరియన్స్..

క్యాబిన్ లోపల ఎక్స్ పీరియన్స్ ను ఇంప్రూవ్ చేయడానికి టొయోటా చాలా అప్‌డేట్స్ ఇచ్చింది. ఇందులో కొత్త గ్రేస్ కాపర్ ట్రిమ్ యాక్సెంట్స్ తో పాటు డ్యాష్ బోర్డ్, డోర్ ప్యానెల్స్ పై ఉడెన్ ప్యాటర్న్ ఇన్సర్ట్స్ ఇచ్చారు. సీట్ల కోసం డ్యూయల్ టోన్ లెదర్ అప్‌హోల్‌స్టరీని ఉపయోగించారు. కొన్ని సెలెక్టెడ్ వేరియంట్లలో వైర్ లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) లాంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ లాంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్.. 

ఈ కొత్త ఇన్నోవా క్రిస్టా లో నమ్మకమైన 2.4 లీటర్ల డీజిల్ ఇంజిన్ ను కంటిన్యూ చేశారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో వస్తూ 148 బీహెచ్‌పీ పవర్, 343 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. లీటరుకు 15 కిమీ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. స్మూత్ పర్ఫార్మెన్స్ వల్ల ప్రైవేట్, కమర్షియల్ బైయర్స్ కు ఇది బెస్ట్ ఆప్షన్ గా మారింది. ధరల విషయానికి వస్తే 7 సీటర్ జిఎక్స్ (GX) వేరియంట్ రూ. 19.72 లక్షలు, జిఎక్స్ ప్లస్ రూ. 21.15 లక్షలు, విఎక్స్ రూ. 24.93 లక్షలుగా ఉన్నాయి. టాప్ ఎండ్ జెడ్ ఎక్స్ (ZX) 7 సీటర్ వేరియంట్ ధర రూ. 26.63 లక్షలుగా ఫిక్స్ చేశారు. 8 సీటర్ ఆప్షన్లు రూ. 5,000 అదనపు ధరతో లభిస్తున్నాయి.

Frequently Asked Questions

కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టాలో ముఖ్యమైన మార్పులు ఏమిటి?

ఇది ఫ్యామిలీ కార్ గా సక్సెస్ సాధించింది. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు కాస్మెటిక్ డిజైన్ చేంజెస్ తో పాటు కొత్త కంఫర్ట్ ఫీచర్లను యాడ్ చేశారు. దీనికి మరింత ప్రీమియం లుక్ ఇచ్చారు.

కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా ఏ ఇంజిన్ తో వస్తుంది?

కొత్త ఇన్నోవా క్రిస్టాలో నమ్మకమైన 2.4 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో వస్తూ 148 బీహెచ్‌పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటరుకు 15 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.

ఇన్నోవా క్రిస్టాలోని ప్రధాన భద్రత, అంతర్గత ఫీచర్లు ఏమిటి?

ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. లోపల డ్యూయల్ టోన్ లెదర్ అప్‌హోల్‌స్టరీ, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ లభిస్తాయి.

కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు ఎలా ఉన్నాయి?

7 సీటర్ జిఎక్స్ వేరియంట్ ధర రూ. 19.72 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ జెడ్ ఎక్స్ 7 సీటర్ వేరియంట్ ధర రూ. 26.63 లక్షలుగా ఉంది. 8 సీటర్ ఆప్షన్లు రూ. 5,000 అదనపు ధరతో లభిస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Mahela Jayawardene Steps Down: 3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget