అన్వేషించండి

Best Cars: టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?

Auto News in Telugu | టాటా సీఎన్‌జీ వెర్షన్ మార్కెట్‌లో విడుదలైంది. ఈ సరికొత్త కారు మారుతి సుజుకి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. వీటి మైలేజీ స్పెసిఫికేషన్స్‌ మధ్య తేడాలివే

Tata Nexon vs Maruti Brezza vs Fronx CNG: గత రెండు సంవత్సరాలుగా మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం, ఇంకా వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉండటం, మౌలిక సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో జనాలు కాస్త వెనుకడుగు వేస్తున్నారు. ఇంధన ఖర్చులను మరింత తగ్గించుకునే విషయంలో డీజిల్, పెట్రోల్‌ కార్లతో పోల్చితే సీఎన్‌జీ కార్లు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా సీఎన్‌జీ కార్లను ఎక్కువగా కొంటున్నట్లు నివేదికలు కూడా అవే చెబుతున్నాయి.

సీఎన్‌జీ కార్లలో ఎక్కువగా ఎస్‌యూవీలను కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు కూడా వీటి ఉత్పత్తిపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నాయి. తాజాగా నెక్సాన్ సీఎన్‌జీ వెర్షన్‌ విడుదల అయ్యింది. ఇది దేశంలోనే మొదటి టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్ సీఎన్‌జీగా మార్కెట్‌లో  అడుగుపెట్టింది. ఈ నెక్సాన్‌ సీఎన్‌జీ(Tata Nexon CNG), మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki CNG), మారుతి ఫ్రాంక్స్ సీఎన్‌జీ (Maruti Fronx CNG)లకు గట్టి పోటీని ఇస్తుంది. వీటి మధ్య ధరలు, ఫీచర్లు, మైలేజీ తదితర అంశాలు మీ కోసం..

మైలేజీ
ఈ మూడింట్లో మారుతి ఫ్రాంక్స్ సీఎన్‌జీ ఎక్కువ మైలేజీని అందిస్తుంది. ఇది కిలో సీఎన్‌జీకి 28.51 కిమీ మైలేజీని ఇస్తుంది. అలాగే బ్రెజా సీఎన్‌జీ 25.51 కిమీ, నెక్సాన్ సీఎన్‌జీ 24 కిమీ మైలేజీలు ఇస్తాయి. ఈ మూడు వేర్వేరు టార్క్‌ అవుట్‌పుట్‌ని కలిగి ఉన్నాయి. ఫ్రాంక్స్ 77.5 bhp 98.5 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. బ్రెజా 87 bhp, 121 nm టార్క్‌ని, నెక్సాన్ ఇక్కడ 98 bhp, 170 nm టార్క్‌ని విడుదల చేస్తాయి. ఇందులో నెక్సాన్‌ సీఎన్‌జీ అత్యంత శక్తివంతమైన కారుగా ఉంది. ఫ్రాంక్స్, బ్రెజా స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ని కలిగి ఉండగా.. నెక్సాన్ సీఎన్‌జీ మాత్రం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 

బూట్‌ స్పేస్‌
నెక్సాన్ సీఎన్‌జీ ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో వస్తుండటంతో ఇందులో భారీ బూట్ స్పేస్ కలిగి ఉంది. ఇందులో 321 లీటర్ల భారీ బూట్‌ స్పేస్‌ ఉంటుంది. దీంతో ఈ కారులో లాంగ్‌ జర్నీ, వీకెండ్స్‌లో ఎక్కువ లగేజీని క్యారీ చేయవచ్చు. ఇది అదనపు సౌలభ్యం అని చెప్పవచ్చు. ఇక ఫ్రాంక్స్, బ్రెజాలు సింగిల్‌ సిలిండర్‌ టెక్నాలజీ కావడం వల్ల బూట్‌ స్పేస్ తక్కువగా ఉంటుంది.

ధర
నెక్సాన్ సీఎన్‌జీ ప్రారంభ ధర రూ .8.99 లక్షల నుంచి రూ .14.59 లక్షల మధ్య ఉంది. బ్రెజా సీఎన్‌జీ ధర రూ.9.14 లక్షల నుంచి రూ.11.9 లక్షల మధ్యలో ఉంది. ఫ్రాంక్స్‌ సీఎన్‌జీ ధర రూ.8.4 లక్షల నుంచి రూ.9.2 లక్షల మధ్యలో ఉంది. వీటిలో ఫ్రాంక్స్ సీఎన్‌జీ తక్కువ ధరలో లభిస్తుంది. ఆ తర్వాత బ్రెజా ఉంది. అయితే నెక్సాన్ ఎక్కువ వేరియంట్లు, భారీ ఫీచర్లు, ఎక్కువ బూట్ స్పేస్‌ని కలిగి ఉంటుంది. వీటిన్నంటిలో టాటా నెక్సాన్‌ బెస్ట్‌ అని చెప్పవచ్చు. మైలేజీలో మారుతి సీఎన్‌జీ కార్లు సరిపోతాయి. కావున మీ అవసరాలకు తగినట్లుగా సీఎన్‌జీ కార్లను ఎంచుకోండి. 

Also Read: Toyota Glanza 2024 Car Review: టయోటా గ్లాంజా 2024 రివ్యూ - చవకైన ఆటోమేటిక్ కార్లలో బెస్ట్!

టాప్ హెడ్ లైన్స్

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget