అన్వేషించండి

Tata Curvv EV Vs Nexon EV: టాటా కర్వ్ ఈవీ వర్సెస్ నెక్సాన్ ఈవీ - రెండిటి మధ్య తేడాలేంటి? ఏది బెస్ట్?

Curvv EV Vs Nexon EV: ఎన్నో నాళ్ల ఎదురు చూపుల తర్వాత టాటా కర్వ్ ఈవీ భారతీయ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ కారు టాటాకే చెందిన నెక్సాన్ ఈవీకి డైరెక్ట్ కాంపిటీషన్ ఇవ్వనుంది. మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్?

Electric Cars in India: టాటా కర్వ్ ఈవీ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ధర పరంగా ఈ కారు తన ప్రత్యర్థి కార్లకు గట్టి పోటీనిస్తోంది. టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీకి కూడా కర్వ్ ఈవీ డైరెక్ట్‌గా కాంపిటీషన్ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు వాహనం రేంజ్, ధర గురించి తెలుసుకోవాలి. కర్వ్ ఈవీ మనదేశంలో లాంచ్ అయిన తర్వాత దాని రేంజ్, ధర వివరాలు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి టాటా కంపెనీ నుంచే వచ్చిన రెండు ఎలక్ట్రిక్ కార్లు కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.

దేని రేంజ్ ఎంత?
టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఈ కారులోని 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జింగ్‌తో 502 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అదే సమయంలో టాటా కర్వ్ ఈవీ 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 585 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. నిజానికి టాటా లాంచ్ చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 400 నుంచి 450 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ఆశించవచ్చు.

Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి

ఇక టాటా నెక్సాన్ ఈవీ 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్‌తో టాటా నెక్సాన్ ఈవీ సింగిల్ ఛార్జింగ్‌తో 325 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీలో మరో పవర్ ఫుల్ 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌తో 465 కిమీల రేంజ్‌ను డెలివర్ చేస్తుంది.

దేని ధర తక్కువ?
టాటా కర్వ్ 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ధర రూ. 17.49 లక్షల నుంచి మొదలై రూ. 19.29 లక్షల వరకు ఉంటుంది. ఈ కారుకు సంబంధఇంచిన 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ధర 19.25 లక్షల నుంచి 21.99 లక్షల మధ్య ఉంచారు. టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.4 లక్షల నుంచి మొదలై రూ. 19.4 లక్షల వరకు ఉంటుంది.

దేని ఫీచర్లు ఎలా ఉన్నాయి?
టాటా రెండు ఎలక్ట్రిక్ వాహనాలు కర్వ్, నెక్సాన్ మధ్య చాలా పోలికలు  ఉన్నాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు 12.3 అంగుళాల స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు కలిగి ఉంటాయి. దీంతో పాటు ఈ వాహనాలలో 360 డిగ్రీ కెమెరా ఫీచర్ కూడా అందించారు. టాటా కర్వ్ ఈవీలో వేరే రకమైన షిఫ్టర్, ఫ్రంక్ ఉన్నాయి. ఇది నెక్సాన్ ఈవీలో లేదు.

కాబట్టి మీరు ధర మెయిన్ ఫ్యాక్టర్, కాస్త రేంజ్, మిగతా ఫీచర్లు తక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే టాటా నెక్సాన్ ఈవీ తీసుకోవచ్చు. ధర కాస్త అటూ ఇటయినా పర్లేదు. మంచి రేంజ్, లేటెస్ట్ ఫీచర్లు, డిఫరెంట్ లుక్ ఉన్న కారు కావాలనుకుంటే టాటా కర్వ్ ఈవీ వైపు మొగ్గు చూపడం బెటర్.

Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget