రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
వీటిలో 45 కేడబ్ల్యూహెచ్, 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి.
దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 585 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయవచ్చు.
కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ అంటోంది.
ఎలక్ట్రిక్ కారు అయినా ఇది కేవలం 8.6 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదట.
టాటా కర్వ్ ఈవీలో ఆడియో కోసం ఏకంగా తొమ్మిది జేబీఎల్ స్పీకర్లు ఉన్నాయి.
తెలుగులో కూడా వాయిస్ కమాండ్లను టాటా కర్వ్ ఈవీ తీసుకోనుంది.