Tata Curvv EMI Calculator : టాటా కర్వ్‌ను నాలుగేళ్ల టెన్యూర్ లోన్‌పై తీసుకుంటే ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి!.
Tata Curvv EMI : టాటా కర్వ్‌కు చెందిన ఏ మోడల్‌నైనా సరే లోన్‌పై తీసుకోవచ్చు. అయితే బేసిక్ మోడల్ నాలుగేళ్ల టెన్యూర్‌పై కొనుక్కుంటేం నెలవారీగా ఎంత EMI చెల్లించాలి?

Tata Curvv EMI and Down Payment: టాటా కర్వ్ ఒక అద్భుతమైన కారు. ఈ కారు పెట్రోల్, డీజిల్‌తోపాటు ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా మార్కెట్లో ఉంది. టాటా కర్వ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్ల ధర 9.66 లక్షల రూపాయల నుంచి 18.85 లక్షల రూపాయల వరకు ఉంది. మీరు టాటా కర్వ్ చౌకైన మోడల్‌ను కొనుగోలు చేసి, ఈ కారు కోసం ఒకేసారి మొత్తం చెల్లింపు చేయలేకపోతే, మీరు కారు లోన్ పై కూడా కొనుగోలు చేయవచ్చు.
EMI పై టాటా కర్వ్‌ను ఎలా కొనాలి?
టాటా కర్వ్ చౌకైన మోడల్ స్మార్ట్ (పెట్రోల్). ఈ కారు ధర 9.66 లక్షల రూపాయలు. టాటాకు చెందిన ఈ కారును కొనడానికి 97,000 రూపాయల డౌన్ పేమెంట్ చేయాలి. మీరు దీనికంటే ఎక్కువ రూపాయల డౌన్ పేమెంట్ చేస్తే, లోన్ EMI మరింత తక్కువగా చెల్లించాల్సి వస్తుంది. మీరు చెల్లించే డౌన్ పేమెంట్ మీరు లోన్ చెల్లింపునకు పెట్టుకున్న టెన్యూర్ ఆధారంగా ఈఎంఐలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. టాటా కంపెనీకి చెందినఈ కారు కోసం 8.69 లక్షల రూపాయల లోన్ లభించవచ్చు. ఈ లోన్ పై వడ్డీ విధించడంతో, ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తం EMI రూపంలో చెల్లించాలి.
- టాటా కర్వ్ కోసం నాలుగు సంవత్సరాల లోన్ తీసుకుంటే, ఈ లోన్ పై 9 శాతం వడ్డీ ఉంటే, ప్రతి నెలా దాదాపు 21,600 రూపాయల EMI చెల్లించాలి.
- కర్వ్ కోసం ఐదు సంవత్సరాల లోన్ తీసుకుంటే 9 శాతం వడ్డీతో ప్రతి నెలా 18,000 రూపాయల వాయిదా చెల్లించాలి.
- ఈ టాటా కారును కొనడానికి మీరు ఆరు సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీతో ప్రతి నెలా 15,700 రూపాయల EMI బ్యాంకులో జమ చేయాలి.
- టాటా కర్వ్ కొనడానికి ఏడు సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీతో ప్రతి నెలా 14,000 రూపాయల వాయిదా చెల్లించాలి.
టాటా కర్వ్ కోసం లోన్ తీసుకునేటప్పుడు అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. బ్యాంక్, కార్ కంపెనీల వేర్వేరు విధానాల కారణంగా, ఈ లెక్కల్లో వ్యత్యాసం ఉండవచ్చు.





















