అన్వేషించండి

Suzuki Swift Hydrogen Prototype: హైడ్రోజన్ పవర్ తో దూసుకెళ్లనున్న స్విఫ్ట్.. నితిన్ గడ్కరీ కలల కారు సిద్ధం! అదిరిపోయే పవర్, క్లీన్ ఎనర్జీ

పర్యావరణ హితమైన హైడ్రోజన్ ఇంధనంతో నడిచే సరికొత్త స్విఫ్ట్ ప్రోటోటైప్‌ను ఏవీఎల్ సంస్థ ఆవిష్కరించింది. ఇది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ మొబిలిటీ విజన్‌కు బలాన్నిస్తోంది.

Suzuki Swift Hydrogen Prototype Revealed to Support Green Mobility: ప్రపంచ వ్యాప్తంగా వాహన తయారీ సంస్థలు ఇప్పుడు క్లీన్ ఫ్యూయల్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే హైడ్రోజన్ ఇంధనాన్ని ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. తాజాగా ఆస్ట్రియన్ పవర్‌ట్రెయిన్ ఎక్స్‌పర్ట్ ఏవీఎల్ టెక్నాలజీస్, సుజుకి బ్రాండ్ తో కలిసి ఒక వర్కింగ్ ప్రోటో టైప్‌ను తాజాగా ప్రదర్శించింది. మన దేశంలో అత్యంత పాపులర్ అయిన స్విఫ్ట్ మోడల్ ను ఇందుకు వేదికగా ఎంచుకోవడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

హైడ్రోజన్ ఇంజిన్ ప్రత్యేకతలు..
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న చాలా హైడ్రోజన్ కార్లు ఎలక్ట్రిక్ మోటార్ల సహాయంతో నడుస్తాయి. అయితే ఏవీఎల్ డెవలప్ చేసిన ఈ స్విఫ్ట్ మాత్రం మన సాధారణ పెట్రోల్ కార్ల లాగే ఇంజిన్ లో హైడ్రోజన్ ను మండించి శక్తిని విడుదల చేస్తుంది. ఇది ప్యాసింజర్ వాహనాలకు చాలా తక్కువ ఖర్చుతో కూడిన, ప్రాక్టికల్ పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు. ఈ సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ మోడల్ లో అమర్చిన 1.4 లీటర్ల ఇంజిన్, ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఐసీఈ ఇంజిన్ల కంటే మెరుగైన పర్ఫార్మెన్స్ చూపిస్తోంది. పెట్రోల్ ఇంజిన్ తో పోలిస్తే ఇందులో 13 హెచ్‌పీ పవర్, 20 ఎన్ఎమ్ టార్క్ అదనంగా లభిస్తాయి.

నితిన్ గడ్కరీ విజన్ కు ఊతం..
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారతదేశంలో ఎథనాల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ ఇంధన వినియోగాన్ని పెంచాలని పదేపదే చెప్తున్నారు. భవిష్యత్తులో మన రవాణా వ్యవస్థ అంతా గ్రీన్ ఎనర్జీ మీద ఆధారపడాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన స్వయంగా టయోటా మిరాయ్ అనే హైడ్రోజన్ కారును వాడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు స్విఫ్ట్ లాంటి మాస్ మార్కెట్ కారు హైడ్రోజన్ వెర్షన్ లో అందుబాటులోకి వస్తే గడ్కరీ కలలుగన్న స్వచ్ఛమైన ఇంధన విప్లవం వేగవంతం అవుతుంది.

భారత మార్కెట్ లో అంచనాలు..
మారుతి సుజుకి ఈ ప్రాజెక్టును గనుక పెద్ద ఎత్తున చేపట్టి ప్రొడక్షన్ లైన్ లోకి తీసుకువస్తే ఇండియన్ ఆటో సెక్టార్ లో పెను మార్పులు రావడం ఖాయం. స్విఫ్ట్ కు ఉన్న క్రేజ్ వల్ల ప్రజలు హైడ్రోజన్ వాహనాలను స్వీకరించడానికి పెద్దగా వెనకాడరు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా హైడ్రోజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయడానికి పైలట్ ప్రాజెక్టులను, పాలసీలను సిద్ధం చేస్తోంది. పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి హైడ్రోజన్ కార్లు గేమ్ ఛేంజర్ కానున్నాయి.  ఏవీఎల్ సంస్థ ఈ ఇంజిన్ డిజైన్, డెవలప్‌మెంట్, కాలిబ్రేషన్ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసింది. సుజుకి సంస్థ ఈ టెక్నాలజీని ఎప్పుడు సామాన్యులకు అందుబాటులోకి తెస్తుందో అని ఆటోమొబైల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
కొత్త హ్యుందాయ్ వెర్నా కోసం రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే EMI ఎంత మారుతుంది?
Hyundai Verna EMI: రూ.15,000 లోపు EMIతో హ్యుందాయ్‌ వెర్నా కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి?
మీ హెల్మెట్‌ వైజర్‌ పొగమంచుతో మసకబారుతోందా? పిన్‌లాక్‌ గురించి ప్రతి బైక్‌ రైడర్‌ ఈ విషయాలు తెలుసుకోవాలి
పిన్‌లాక్‌ ఉంటే చలికాలంలో కూడా మీ హెల్మెట్‌ వైజర్‌ మీద ఫాగ్‌ పేరుకుపోదు! ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?
Car Polish vs Wax: కారు మెరుపు కోసం పాలిష్ మాత్రమే సరిపోదు! పెయింట్ రక్షణకు వ్యాక్స్ కూడా అవసరమే!
కారు పాలిష్ చేయాలా.. వ్యాక్స్ వేయాలా? తేడా ఇదే.. ముందుగా ఏది చేయాలో తెలుసుకోండి

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget