అన్వేషించండి

Best Automatic Cars Under 5 Lakh India: ఐదు లక్షల లోపు బడ్జెట్‌లో బెస్ట్‌ ఆటోమేటిక్ కార్లు! సిటీ డ్రైవింగ్‌కు కేరాఫ్ అడ్రెస్‌!

Best Automatic Cars Under 5 Lakh India:భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఐదు లక్షల ప్రారంభ ధరలో లభించే బెస్ట్ కార్ల గురించి ఇక్కడ చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ₹5 లక్షల లోపు ఆరు ఆటోమేటిక్ కార్లు నగరాలకు అందుబాటులోకి.
  • మారుతి సుజుకి ప్రెసో, ఆల్టో K10, సెలెరియో, వ్యాగన్ఆర్ మోడళ్లు.
  • రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో కూడా పోటీలో నిలుస్తున్నాయి.
  • తక్కువ ధరలో లేటెస్ట్ టెక్నాలజీ, భద్రతా ఫీచర్లు లభిస్తున్నాయి.

Best Automatic Cars Under 5 Lakh India: నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ దృష్ట్యా మాన్యువల్ గేర్లు మార్చడం వాహనదారులకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా బడ్జెట్ పరిమితులు ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఆటోమేటిక్‌ కారు అనేది ఒకప్పుడు కలగా ఉండేది. కానీ నేడు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో తక్కువ ధరలోనే క్లచ్‌లేని ప్రయాణం సాధ్యమవుతోంది. ప్రస్తుతం భారత్లో ఐదు లక్షల రూపాయల లోపు ప్రారంభ ధరతో ఆరు  ఆటోమేటిక్‌ కార్లు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. ఇవన్నీ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు కావడం వల్ల నగరాల్లోని ఇరుకైన వీధుల్లో నడపడానికి, పార్కింగ్‌ చేయడానికి ఎంతో అనువుగా ఉంటాయి. 

మారుతి సుజుకి హవా

ప్రస్తుతం ఈ బడ్జెట్‌ విభాగంలో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అందుబాటులో ఉన్న ఆరు మోడళ్లలో నాలుగు కేవలం మారుతి సంస్థ నుంచే ఉన్నాయి. ఇవి పెట్రోల్, సీఎన్జీ ఇంధన ఆప్షన్స్‌తో వస్తున్నాయి. 

మారుతి సుజుకి ప్రెసో 

అత్యంత చౌకైన ఆప్షన్. దీని ధర మూడున్నర లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ విభాగంలో టాప్ ఎండ ర 5.25 లక్షలే. ఇది లీటర్‌కు 21. 4 నుంచి 32. 7 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. 

మారుతి సుజుకి ఆల్టో కే 10

ఇది మధ్యతరగతి ప్రజలకు అతి చేరువైన కారు. దీని ధర 3.70 నుంచి 5.45 లక్షల  మధ్య ఉంది. భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే వారి కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేశారు. ఇది లీటరకు గరిష్టంగా 33.9 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 

రెనాల్ట్‌ క్విడ్

స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఈ కారు మంచి ఆప్షన్‌ దీని ధర 4.30 లక్షల నుంచి 5.85 లక్షల వరకు ఉంది. మారుతి కార్లకు గట్టి పోటీ ఇచ్చే  ఈ కారు కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ విభాగంలో రివర్స్‌ కెమెరా ఫీచర్‌ ఉన్న ఏకైక కారు. 

టాటా టియాగో 

ఇది కూడా 4.57 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాటా నుంచి వచ్చిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 19.8 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇది పెట్రోల్, సీఎన్జీ వేరియంట్‌లలో లభిస్తుంది. 

మారుతి సుజుకి సెలెరియో

మైలేజీలో రారాజుగా దీన్ని పిలుస్తారు. లీటర్‌కు 34. 4 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ విభాగంలో టాప్‌లో ఉన్న కారు. దీనికి 3 స్టార్ రేటింగ్ లభిస్తుంది. ఆరు ఎయిర్ బ్యాగ్లు, ఏబీఎస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

విశాలమైన కారు. దీని ధర 4.99 లక్షల నుంచి 6.84 లక్షల వరకు లభిస్తుంది. ఇది ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లతోపాటు 33.5కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. 

ఈ బడ్జెట్ కార్లు కేవలం తక్కువ ధరకే పరిమితం కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ కూడా కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. భద్రత కోసం ఏబీఎస్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్‌లు అన్ని మోడల్స్‌లో లభిస్తున్నాయి. ఈ కార్లు సాధారణంగా వెయ్యి సీసీ లోపు సామర్థ్యం గల ఇంజన్లతో వస్తాయి. నగర ప్రయాణాలకు సరిపోతాయి. 

నగరాల్లో ట్రాఫిక్ కారణంగా నిరంతరం క్లచ్ వాడటం వల్ల డ్రైవర్లకు మోకాళ్ల నొప్పులు, అలసట రావడం సహజం. ఆటోమేటిక్ కార్లు ఈ ఇబ్బందిని తొలగిస్తాయి. కేవలం ఐదు లక్షల ప్రారంభ బడ్జెట్‌తోనే లగ్జరీ కార్ల వంటి టూ పెడల్ డ్రైవింగ్ అనుభూతిని పొందడం ఈ విభాగానికి ఉన్న అతి పెద్ద బలం. 

మీరు తక్కువ ధర లో కారు కావాలనుకుంటే ఎస్‌ ప్రెస్సో, అత్యధిక మైలేజీ కావాలనుకుంటే సెలెరియో, స్టైలిష్ డిజైన్‌తో పాటు రివర్స్ కెమెరా వంటి ఫీచర్లు కావాలనుకుంటే క్విడ్ సరైన ఆప్షన్. ప్రయాణం సౌకర్యవంతంగా ఎక్కువ స్థలం కావాలనుకుంటే వ్యాగన్ ఆర్ వైపు మొగ్గు చూపవచ్చు. 

మరిన్ని ఉపయోగకరమైన కార్లు, బైక్‌ల గురించి తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Frequently Asked Questions

5 లక్షల లోపు ఆటోమేటిక్ కార్లు నగర ప్రయాణాలకు ఎందుకు అనుకూలం?

నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌లో మాన్యువల్ గేర్లను మార్చడం కష్టంగా ఉంటుంది. ఆటోమేటిక్ కార్లు క్లచ్‌లేని ప్రయాణాన్ని అందిస్తాయి, ఇవి ఇరుకైన వీధుల్లో నడపడానికి, పార్కింగ్‌ చేయడానికి అనువుగా ఉంటాయి.

5 లక్షల లోపు ఆటోమేటిక్ కార్లలో ఏ బ్రాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది?

ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అందుబాటులో ఉన్న ఆరు మోడళ్లలో నాలుగు కేవలం మారుతి సంస్థ నుంచే ఉన్నాయి.

మారుతి సుజుకి ప్రెసో కారు ప్రత్యేకత ఏమిటి?

ప్రెసో ఈ విభాగంలో అత్యంత చౌకైన ఆటోమేటిక్ కారు. ఇది 3.5 లక్షల నుంచి ప్రారంభమై, 32.7 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.

రెనాల్ట్ క్విడ్ కారులో ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటి?

స్టైలిష్ లుక్ కోరుకునే వారికి క్విడ్ మంచి ఆప్షన్. ఈ విభాగంలో రివర్స్‌ కెమెరా ఫీచర్‌ ఉన్న ఏకైక కారు ఇదే.

మైలేజీలో అత్యుత్తమంగా నిలిచే కారు ఏది?

మారుతి సుజుకి సెలెరియో మైలేజీలో రారాజుగా పిలువబడుతుంది. ఇది లీటర్‌కు 34.4 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది మరియు 3 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

స్టైలిష్‌ లుక్‌, 260km వరకు రేంజ్‌, 114kmph టాప్ స్పీడ్‌ - Avore నుంచి మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు
స్పోర్టీ లుక్‌తో అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 260km రేంజ్‌, కేవలం రూ.799కే మీ సొంతం!
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Mahindra Scorpio N ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్లు.. ఈ కొత్త ఫీచర్లు చూస్తే కొనాలనిపించాల్సిందే!
లాంచ్‌కు ముందే ఫుల్‌గా లీకైన మహీంద్ర స్కార్పియో N.. థార్‌ రాక్స్‌ తరహా ఫీచర్లతో వస్తున్న కొత్త SUV
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget