అన్వేషించండి

Mahindra XUV 3XO vs Tata Nexon:మహీంద్రా XUV 3XO వర్సెస్ టాటా నెక్సాన్; కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అసలైన విజేత ఎవరు?

Mahindra XUV 3XO vs Tata Nexon:భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా మహీంద్రా XUV XO, టాటా నెక్సాన్ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహీంద్రా XUV 3XO, టాటా నెక్సాన్ కాంపాక్ట్ SUVల పోటీ.
  • XUV 3XO కొంచెం ఎక్కువ మైలేజీ, మెరుగైన టార్క్ అందిస్తుంది.
  • రెండు కార్లు ఫైవ్ స్టార్ భద్రతా రేటింగ్, విభిన్న బ్రేకింగ్ వ్యవస్థలు.
  • XUV 3XO ఎక్కువ వీల్‌బేస్, నెక్సాన్ మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.

Mahindra XUV 3XO vs Tata Nexon: భారత్‌లో సబ్‌ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. మధ్యతరగతి కుటుంబాల నుంచి యువత వరకు అందరినీ ఆకట్టుకుంటున్న ఈ విభాగంోల మహీంద్రా XUV 3XO, టాటా నెక్సాన్ అగ్రగామిగా నిలుస్తున్నాయి. మహీంద్రా తన పాత మోడ్‌ XUV 3OOను సరికొత్త హంగులతో మహీంద్రా XUV 3XOగా రీబ్రాండ్ చేసి మార్కెట్‌లోకి తెచ్చింది. మరవైపు టాటా నెక్సాన్ తన అప్‌డేటెడ్ వెర్షన్‌తో ఇప్పికే మార్కెట్‌లో బలమైన పట్టు సాధించింది. 

ధర, వేరియంట్లు 

ఏ కారు కొనాలన్నా వినియోగదారులు మ౧దట చూసేది ధర. టాటా నెక్సాన్ స్మార్ట్ పెట్రోల్‌ 1.2L టర్బో వేరియంట్‌ ప్రారంభ ధర 7.37 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ధర పరంగా చూస్తే టాటా నెక్సాన్‌ స్వల్పంగా తక్కువ ధరకు లభిస్తోంది. ఇది బడ్జెట్ వినియోగదారులకు సానుకూల అంశం. 

ఇంజన్ సామర్థ్యం, పని తీరు 

కారు ఇంజన్ గుండెకాయ లాంటిది. XUV 3X౦లో 1197cc, 3 సిలిండర్‌ టర్బో చార్జ్డ్‌ ఇంజిన్ ఉంది. ఇది 110bhp పవర్, 200Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి భిన్నంగా టాటా నెక్సాన్ 1199సిసి ఇంజిన్‌తో 118bhp పవర్, 170Nm టార్క్‌ను అందిస్తుంది. 

నెక్సాన్(118bhp) మహీంద్రా XUV 3XO(110bhp)కంటే ఎక్కువ శక్తిని ఇస్తుంది. మహీంద్రా XUV 3XO(200Nm)నెక్సాన్(170Nm) కంటే మెరుగైన ఫుల్ పవర్‌ను కలిగి ఉంది. ఇది హైవే డ్రైవింగ్‌లో ఉపయోగపడుతుంది. మహీంద్రా XUV 3XO సిక్స్‌ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది. 
 
భారతీయ వియోగదారులకు మైలేజీ అత్యంత ముఖ్యం. మహీంద్రా మహీంద్రా XUV 3XO లీటరుకు 18.89 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని సంస్థ పేర్కొంది. వినియోగదారులు కూడా సుమారు 18 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని చెబుతున్నారు. టాటా నెక్సాన్ వినియోగదారుల నివేదికల ప్రకారం సుమారు 17కిలోమీటర్ల మైలేజీని ఇస్తోంది. ఇంధన సామర్థ్యం విషయంలో XUV 3XO స్వల్పంగా ముందంజలో ఉంది. 

భద్రత విషయంలో ఈ రెండు కంపెనీలు ఎక్కడా రాజీ పడలేదు. మహీంద్రా XUV 3XO, టాటా నెక్సా్ రెండూ భారత్ Nక్యాప్ పరీక్షల్లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించాయి. 

రెండు కార్లలోనూ డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్,సైడ్ ఎయిర్ బ్యాగ్‌లు ప్రామాణికంగా వస్తున్నాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా ఉంది. XUV 3XO నాలుగు చక్రాలకు డి్క్ బ్రేక్‌లను అందిస్తోంది. కానీ టాటా నెక్సాన్‌ ముందు చక్రాలకు డిస్క్, వెనుక చక్రాల డ్రమ్ బ్రేక్‌ను మాత్రమే కలిగి ఉంది. 

ప్రయాణికుల సౌకర్యం విషయంలో కారు వెడల్పు, వీల్‌బేస్ కీలక పాత్ర పోషిస్తాయి. మహీంద్రా XUV 3XO 2600mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఇది లోపల ఎక్కువ స్థలాన్ని ఇస్తుంది. నెక్సాన్‌ వీల్‌బేస్‌ 2498mm మాత్రమే. రోడ్లపై గుంతలను అధిగమించడానికి గ్రౌండ్ క్లియరెన్స్ ముఖ్యం. నెక్సాన్ 208mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో మెరుగ్గా ఉంది. మహీంద్రా XUV 3XO 201mm కలిగి ఉంది. లగేజీ పెట్టుకోవడానికి నెక్సాన్(382) మెరుగైన స్థలాన్ని ఇస్తోంది. XUV 3X౦లో ఇది 364 లీటర్లు మాత్రమే. 

ఆధునిక కాలంలో ఫీచర్లు లేకుండా కారు అమ్మడం అసాధ్యం. టాటా నెక్సాన్ LED హెడ్ ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను కలిగి ఉండగా మహీంద్రా XUV 3XO MX1 వేరియంట్‌ హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్స్‌ను ఉపయోగిస్తోంది. మహీంద్రా XUV 3XOలో వెనుక సీటు ప్రయాణికుల కోసం కూడా ఏసీ వెంట్్ ఉన్నాయి. ఇది నెక్సాన్ ప్రాథమిక వేరియంట్‌లో కనిపించదు. మహీంద్రా XUV 3XO డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. నెక్సాన్ ఆఫ్‌ వైట్, గ్రే కాంబినేషన్‌తో వస్తుంది. 

Frequently Asked Questions

మహీంద్రా XUV 3XO మరియు టాటా నెక్సాన్ ధరల వ్యత్యాసం ఏమిటి?

టాటా నెక్సాన్ స్మార్ట్ పెట్రోల్ 1.2L టర్బో వేరియంట్ ప్రారంభ ధర 7.37 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ధర పరంగా చూస్తే టాటా నెక్సాన్ స్వల్పంగా తక్కువ ధరకు లభిస్తోంది.

ఇంజన్ సామర్థ్యం మరియు పనితీరులో ఈ రెండు కార్ల మధ్య తేడా ఏమిటి?

నెక్సాన్ 118bhp పవర్ అందిస్తే, XUV 3XO 110bhp పవర్ అందిస్తుంది. అయితే, XUV 3XO 200Nm టార్క్ అందిస్తూ నెక్సాన్ (170Nm) కంటే మెరుగైన ఫుల్ పవర్ కలిగి ఉంది.

మైలేజీ విషయంలో ఏ కారు మెరుగ్గా ఉంది?

మహీంద్రా XUV 3XO లీటరుకు 18.89 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని సంస్థ పేర్కొంది, వినియోగదారులు కూడా సుమారు 18 కిలోమీటర్ల మైలేజీని చెబుతున్నారు. టాటా నెక్సాన్ సుమారు 17 కిలోమీటర్ల మైలేజీని ఇస్తోంది. ఇంధన సామర్థ్యం విషయంలో XUV 3XO స్వల్పంగా ముందంజలో ఉంది.

భద్రత విషయంలో ఈ రెండు కార్ల రేటింగ్ ఏమిటి?

మహీంద్రా XUV 3XO మరియు టాటా నెక్సాన్ రెండూ భారత్ Nక్యాప్ పరీక్షల్లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించాయి. రెండు కార్లలోనూ అవసరమైన ఎయిర్ బ్యాగ్ లు ప్రామాణికంగా వస్తున్నాయి.

కారు లోపలి స్థలం మరియు లగేజీ సామర్థ్యంలో తేడా ఏమిటి?

మహీంద్రా XUV 3XO 2600mm వీల్‌బేస్‌తో లోపల ఎక్కువ స్థలాన్ని ఇస్తుంది. నెక్సాన్ 208mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో మెరుగ్గా ఉంది. లగేజీ పెట్టుకోవడానికి నెక్సాన్(382) మెరుగైన స్థలాన్ని ఇస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

నెలకు రూ.2500 EMIతో TVS Apache RTR 160 4V కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, లోన్‌ ఎంత వస్తుంది?
TVS Apache RTR 160 4V కొనడానికి రూ.25,000 ఉంటే చాలు, మిగిలిన డబ్బును బ్యాంక్‌ లోన్‌గా ఇస్తుంది!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
బజాజ్ చేతక్ EVని ఇంటికి తెచ్చుకోవడానికి లోన్‌ ఫెసిలిటీ.. కనీస డౌన్‌పేమెంట్‌, EMI పూర్తి వివరాలు
Bajaj Chetak C2501 ఎలక్ట్రిక్ స్కూటర్‌.. నెలకు కేవలం రూ.1500 EMIతో మీ సొంతం!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Indrakeeladari Arrangements: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. విజయవాడ ఉత్సవ్ కు తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
Embed widget