అన్వేషించండి

Skoda India Recall: స్కోడా కొడియాక్ రీకాల్ : భద్రత విషయంలో రాజీ పడకూడదనే కంపెనీ నిర్ణయం!

ఫ్రంట్ సీటు ఫ్రేమ్‌లో సాంకేతిక లోపం కారణంగా స్కోడా ఇండియా తన ఫ్లాగ్‌షిప్ కొడియాక్ ఎస్‌యూవీని రీకాల్ చేసింది. ఇది ఎయిర్‌బ్యాగ్ పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Skoda India Recall News: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియా తన లగ్జరీ ఎస్‌యూవీ కొడియాక్ (Kodiaq) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రంట్ సీటు లోపలి ఫ్రేమ్‌లో లోపం ఉన్నట్లు గుర్తించడంతో కొన్ని వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2025 మార్చి 10 నుండి డిసెంబర్ 8 మధ్య తయారైన సుమారు 221 యూనిట్లు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. సీటు ఫ్రేమ్ అంచులలో ఉన్న లోపం వల్ల ప్రమాద సమయంలో సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ (Side Airbags) సరిగ్గా పనిచేయకపోవచ్చు. దీనివల్ల ప్రయాణికులకు గాయాలయ్యే ముప్పు ఉందని స్కోడా హెచ్చరించింది.

SIAM వివరణ
ఎస్‌ఐఏఎం (SIAM) వెబ్‌సైట్‌లో ఈ లోపం గురించి వివరంగా కంపెనీ ప్రతినిథులు పేర్కొన్నారు. పైన తెలిపిన కాలంలో తయారైన వాహనాలలో ఫ్రంట్ సీటు లోపలి భాగం అంచులు సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్స్ విచ్చుకునేటప్పుడు ఆశించిన స్థాయిలో రక్షణ కల్పించలేకపోవచ్చు. ఎయిర్‌బ్యాగ్ ప్రభావం తగ్గడం వల్ల ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ వాహనాలను తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేయాలని స్కోడా నిర్ణయించింది.

కొడియాక్ ఎస్‌యూవీ విశేషాలు
స్కోడా తన సెకండ్ జనరేషన్ కొడియాక్ ఎస్‌యూవీని గతేడాది ఏప్రిల్‌లో ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో 2.0 టీఎస్‌ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. ప్రారంభంలో దీనిని మూడు వరుసల సీటింగ్ (7-seater) తో స్పోర్ట్‌లైన్, సెలక్షన్ ఎల్&కె వంటి వేరియంట్లలో తెచ్చారు. ఆ తర్వాత రెండు వరుసల సీటింగ్ (5-seater) కలిగిన 'లాంజ్' ట్రిమ్‌ను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.

Also Read: Auto News: మీ కార్ టైర్లలో గాలి తక్కువగా ఉందా? జాగ్రత్త.. మైలేజీతో పాటు సేఫ్టీ కూడా దెబ్బతినొచ్చు!

ధర, పోటీ వివరాలు
ప్రస్తుతం కొడియాక్ ధర రూ. 39.99 లక్షల నుండి రూ. 45.95 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. లగ్జరీ విభాగంలో ఇది తన సిస్టర్ మోడల్ అయిన కొత్త వోక్స్‌వ్యాగన్ టైరాన్ (Volkswagen Tayron) తో పోటీ పడుతోంది. తమ కారు రీకాల్ పరిధిలో ఉందో లేదో తెలుసుకోవడానికి వినియోగదారులు స్కోడా సర్వీస్ సెంటర్లను సంప్రదించవచ్చు. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే స్కోడా, లోపాలను గుర్తించిన వెంటనే స్పందించి ప్రయాణికుల క్షేమం కోరడం ప్రశంసనీయం.

 

టాప్ హెడ్ లైన్స్

రూ.లక్షల్లో కొత్త కారు, రూ.వేలల్లో మెయింటెనెన్స్‌ ఖర్చు! క్యాబ్‌లో తిరగడమే బెటర్‌ ఐడియానా?
సిటీలో డైలీ డ్రైవింగ్‌ కోసం కారు కొనడం మంచిదా? రోజూ క్యాబ్‌ బుక్‌ చేసుకోవడమే బెటరా?
Royal Enfield Himalayan 440: లాంచ్‌ అయిన నెలకే భారీ డిమాండ్‌.. 6 నెలల వెయిటింగ్‌ పిరియడ్‌, బుకింగ్స్‌ నిలిపివేత
ఈ బైక్‌ కొంటే ఇంటికి తీసుకెళ్లడానికి ఆరు నెలలు ఆగాలట! రష్‌ తట్టుకోలేక బుకింగ్స్‌ కూడా బంద్‌
ఖరీదైన కార్లకే కాదు.. తక్కువ ధర కార్లలోనూ ADAS సేఫ్టీ ఫీచర్లు! సుజుకి కొత్త ప్లాన్ ఇదే
సామాన్యుల కార్లలోనూ ADAS సేఫ్టీ.. సుజుకి కీలక నిర్ణయం, ఖర్చు తగ్గించే టెక్నాలజీపై ఫోకస్‌
కొత్త కారు కొనడానికి మీ బడ్జెట్‌ రూ.6 లక్షల లోపే ఉందా? అయినా పర్లేదు, ఎన్నో ఆప్షన్లు
రూ.6 లక్షల లోపులోనే కొనగలిగే 11 కార్లు.. ఈ దసరాకి కొత్త కారు మీ ఇంటికొస్తుంది!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Bypoll Stay: ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
KTR Counter: రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Embed widget