అన్వేషించండి

అసెంబ్లీ ఎన్నికలు 2026

(Source:  Poll of Polls)

Auto News: మీ కార్ టైర్లలో గాలి తక్కువగా ఉందా? జాగ్రత్త.. మైలేజీతో పాటు సేఫ్టీ కూడా దెబ్బతినొచ్చు!

కారు టైర్ల నిర్వహణ కేవలం గాలి కొట్టించడంతోనే ముగిసిపోదు. సరైన ప్రెషర్ మెయింటైన్ చేయడం వల్ల మైలేజీ పెరగడమే కాకుండా ప్రయాణం సురక్షితంగా మారుతుంది.

Car Maintanance Tips: ఇండియాలో కారు యజమానులు ఎక్కువగా పట్టించుకోని విషయం ఏదైనా ఉందంటే అది టైర్ల నిర్వహణ. టైర్లలో ఉండే గాలి పీడనం (Tyre Pressure) అనేది కారు గ్రిప్, ప్రయాణీకుల సౌకర్యం, బ్రేకింగ్, ఇంధన సామర్థ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. పెట్రోల్ బంకుకు వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి గాలి చెక్ చేయించడం సరిపోదు. కొంచెం శ్రద్ధ పెడితే మీ టైర్లను మీరే ఇంట్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకు అవసరమైన పరికరాలు కూడా ఆన్లైన్ లేదా సంబంధిత షాపులలో సులభంగా దొరుకుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఎప్పుడు, ఎలా చెక్ చేయాలి?
ప్రతి కారు డ్రైవర్ సీటు వైపు ఉండే డోర్ పిల్లర్ మీద ఒక మెటల్ స్టిక్కర్ ఉంటుంది. అందులో మీ కారు టైర్లకు ఉండాల్సిన సరైన పీడనం (PSI లేదా bar) వివరాలు ఉంటాయి. కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ రీడింగ్స్ మారుతుంటాయి. ముఖ్యంగా టైర్లు చల్లగా ఉన్నప్పుడే (Cold Tyres) గాలిని చెక్ చేయాలి. కారును ఎక్కువ దూరం నడిపిన తర్వాత టైర్లు వేడెక్కి గాలి వ్యాకోచిస్తుంది, దీనివల్ల తప్పుడు రీడింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణం మొదలుపెట్టే ముందు లేదా కారు పార్క్ చేసిన రెండు గంటల తర్వాతే చెక్ చేయడం ఉత్తమం.

స్పేర్ వీల్ మర్చిపోవద్దు
చాలా మంది నాలుగు టైర్ల మీద చూపే శ్రద్ధ డిక్కీలో ఉండే స్పేర్ వీల్ (Spare Wheel) మీద చూపరు. అత్యవసర సమయంలో అది పనికిరావాలంటే అందులో ఎప్పుడూ నిర్ణీత స్థాయి కంటే కొంచెం ఎక్కువ గాలి (సుమారు 60 PSI) నింపి ఉంచాలి. గాలి క్రమంగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు దీనిని కూడా గమనిస్తూ ఉండాలి. అలాగే కారులో ఉండే టీపీఎంఎస్ (TPMS) సిస్టమ్‌ను పూర్తిగా నమ్మకూడదు. గాలి 20 శాతం కంటే ఎక్కువ తగ్గినప్పుడే అది సిగ్నల్ ఇస్తుంది. అందుకే ప్రతి రెండు వారాలకు ఒకసారి మాన్యువల్‌గా చెక్ చేసుకోవడం సురక్షితమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

నైట్రోజన్ ఉత్త‌మ‌మా?
సాధారణ గాలితో పోలిస్తే నైట్రోజన్ వల్ల టైర్ల లైఫ్ పెరుగుతుంది, టైర్లు పేలిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయితే ఇది అన్ని చోట్లా దొరకదు, పైగా దీనికి కొంత ఖర్చు అవుతుంది. మీరు టైర్ ప్రెషర్‌ను క్రమం తప్పకుండా మెయింటైన్ చేయగలిగితే సాధారణ గాలి కూడా సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

సరైన ప్రెషర్ ఎందుకు అవసరం?
గాలి తక్కువగా ఉంటే మైలేజీ తగ్గిపోతుంది, స్టీరింగ్ తిప్పడం కష్టమవుతుంది, టైర్లు త్వరగా అరిగిపోతాయి. అదే గాలి ఎక్కువగా ఉంటే ప్రయాణం అసౌకర్యంగా ఉండటమే కాకుండా రోడ్డుపై కారు గ్రిప్ తగ్గుతుంది. సరైన పీడనం ఉంటేనే బ్రేకులు సమర్థవంతంగా పనిచేస్తాయి, కారు హ్యాండ్లింగ్ బాగుంటుంది. మీ ప్రయాణం క్షేమంగా సాగాలంటే టైర్ల విషయంలో నిర్లక్ష్యం వద్ద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అప్పుడే మీ ప్రయాణం సుఖవంతగా సాగుతుందని, ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండబోదని అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vehicle Maintenance Guide: మీ కారు ఈ సంకేతాలు ఇస్తోందా? బ్రేక్ ప్యాడ్స్ నుండి బ్యాటరీ దాకా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
మీ కారు ఈ సంకేతాలు ఇస్తోందా? బ్రేక్ ప్యాడ్స్ నుండి బ్యాటరీ దాకా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
Honda City Facelift India Launch: హోండా సిటీ కొత్త వెర్షన్ వచ్చేస్తోంది.. మే 22న గ్రాండ్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు, కొత్త లుక్ తో సెడాన్ మార్కెట్లోకి ఎంట్రీ
హోండా సిటీ కొత్త వెర్షన్ వచ్చేస్తోంది.. మే 22న గ్రాండ్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు, కొత్త లుక్ తో సెడాన్ మార్కెట్లోకి ఎంట్రీ
Mini Cooper S Launched: రోడ్లపై ఇక స్టైలిష్ ప్రయాణం - మినీ కూపర్ ఎస్ కొత్త వేరియంట్ ఎంట్రీ.. అదిరిపోయే స్పోర్టీ లుక్, లగ్జరీ ఫీచర్లు.. 
రోడ్లపై ఇక స్టైలిష్ ప్రయాణం - మినీ కూపర్ ఎస్ కొత్త వేరియంట్ ఎంట్రీ.. అదిరిపోయే స్పోర్టీ లుక్, లగ్జరీ ఫీచర్లు.. 
Toyota Urban Cruiser Hyryder vs Maruti Suzuki Grand Vitara: టయోటా హైరైడర్‌ వర్సెస్‌ మారుతి గ్రాండ్ విటారా! మధ్యతరగతి వినియోగదారుడికి ఏది ప్రయోజనం? ధర, మైలేజీ, ఫీచర్లపై ఫుల్‌ గైడ్‌ ఇదే!
టయోటా హైరైడర్‌ వర్సెస్‌ మారుతి గ్రాండ్ విటారా! మధ్యతరగతి వినియోగదారుడికి ఏది ప్రయోజనం? ధర, మైలేజీ, ఫీచర్లపై ఫుల్‌ గైడ్‌ ఇదే!
Advertisement

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
Dhurandhar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Hormuz: హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
TS SSC Supplementary Exams Date: తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
Embed widget