రోజూ ఆఫీస్ జర్నీ నుంచి కేజువల్ రైడ్ వరకు - రాయల్ ఎన్‌ఫీల్డ్ అర్బనైట్ హూడీ ఎలా ఉంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ అర్బనైట్ హూడీ రివ్యూ ఇది. స్టైల్‌గా కనిపిస్తూ, రోజువారీ రైడింగ్‌కు సరిపోయే భద్రత ఇచ్చే ఈ హూడీ ఫీచర్లు, కంఫర్ట్, వాడకంపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

Royal Enfield Urbanite Hoodie: రైడింగ్ గేర్ అంటే చాలా మందికి ఇప్పటికీ బరువైన జాకెట్, స్పోర్టీ లుక్, రోడ్డుపైనే ప్రత్యేకంగా కనిపించే డిజైన్ గుర్తుకు వస్తుంది. కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రం ఈ ఆలోచనను కొంచెం మార్చే ప్రయత్నం చేసింది. అర్బనైట్ హూడీతో, రోజూ ఆఫీస్‌కు వెళ్లే రైడర్లను, సిటీ కమ్యూటర్లను దృష్టిలో పెట్టుకుని ఒక లైఫ్‌స్టైల్ రైడింగ్ గేర్‌ను తీసుకొచ్చింది.
ప్రత్యేకంగా కనిపించకపోవడమే ప్లస్
మొదట చూడగానే, ఇది రైడింగ్ జాకెట్‌లా అసలు కనిపించదు. సాధారణ స్ట్రీట్‌వేర్ హూడీలా ఉండటమే దీని పెద్ద ప్లస్ పాయింట్. ఆఫీస్‌కి వెళ్లినా, బయటికి వెళ్లినా, బైక్ దిగిన తర్వాత కూడా ప్రత్యేకంగా రైడింగ్ గేర్ వేసుకున్నట్టు అనిపించదు. ప్రస్తుతం ఈ హూడీ బ్లాక్ కలర్‌లో మాత్రమే లభిస్తోంది. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే, 100 శాతం పాలిస్టర్‌తో తయారు చేశారు. ఈ చలికాలంలో చల్లటి గాలి ఒంటికి తగలకుండా కొంత వరకు రక్షణ ఇస్తుంది. ఇంపాక్ట్ ఎక్కువగా పడే భాగాల్లో 600D రీన్ఫోర్స్‌డ్ పాలిస్టర్ వాడటం వల్ల భద్రత కూడా పెరిగింది.
భద్రత విషయంలో రాజీ లేదు
ఈ జాకెట్ షోల్డర్స్, ఎల్బోస్ వద్ద RE Ergo Protech CE లెవల్ 2 ఆర్మర్ ఇచ్చారు. బ్యాక్ భాగంలో Norman Tech G926F ఆర్మర్ ఉంటుంది. అయితే ఛెస్ట్ ఆర్మర్ పెట్టుకునే ఆప్షన్ మాత్రం లేదు. సిటీ రైడింగ్‌కు ఇది సరిపోతుంది కానీ లాంగ్ టూరింగ్ చేసే వారికి ఇది కొంచెం పరిమితంగా అనిపించవచ్చు.
హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో రైడింగ్ చేస్తే వాతావరణమే పెద్ద పరీక్ష. ట్రాఫిక్, ధూళి, ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ హూడీని హైదరాబాద్‌లో వాడిన అనుభవంలో చెప్పాలంటే... వేసవి కాలంలో ఇది కొంచెం వేడిని జనరేట్ చేస్తుంది. ఇది హూడీ కాబట్టి ఆ విషయం సహజమే. అందుకే వేసవిలో మెష్ ఉన్న జాకెట్ మెరుగైన ఎంపికగా ఉంటుంది. కానీ శీతాకాలంలో మాత్రం ఈ అర్బనైట్ హూడీ మంచి కంఫర్ట్‌గా, వెచ్చగా అనిపిస్తుంది.
చేతుల దగ్గర వెల్క్రో ట్యాబ్స్
ఫిట్ విషయంలో హూడీ చాలా ఎర్గోనామిక్‌గా ఉంటుంది. హై స్పీడ్‌లో ఉన్నా కూడా స్లీవ్స్ ఊగిపోవు. వెల్క్రో ట్యాబ్స్ వల్ల చేతుల దగ్గర గట్టిగా ఉండేలా, హూడీ లోపలకు గాలి వెళ్లకుండా సెట్ చేసుకోవచ్చు. హుడ్ తీసేయలేని డిజైన్ కొంతమందికి మైనస్‌లా అనిపించవచ్చు. కానీ అదే ఈ హూడీకి స్టైల్‌ను కూడా ఇస్తుంది. దీనికి మూడు పాకెట్లు ఉన్నాయి, చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు.
నైట్ రైడింగ్ కోసం రిఫ్లెక్టివ్ డిజైన్
నైట్ రైడింగ్‌లో ఇతర డ్రైవర్లకు స్పష్టంగా కనిపించేందుకు ఈ హుడీ మీద రిఫ్లెక్టివ్ ఎలిమెంట్స్ కూడా ఇచ్చారు.
ఈ హూడీని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇతర రైడింగ్ గేర్‌తో జత చేసుకోవచ్చు. రైడింగ్ జీన్స్, ప్యాంట్స్, షూస్, హెల్మెట్‌తో కలిపితే ఒక కంప్లీట్ అర్బన్ రైడర్ లుక్ వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్భుతంగా ఉపయోగపడుతుంది. లాంగ్ టూర్స్, భారీ వర్షాలు లేదా తీవ్రమైన చలిలో మాత్రం ఇది పూర్తిగా రక్షణ ఇవ్వదు, సాధారణ వాతావరణం నుంచి రక్షణ కోసం దీనిని డిజైన్ చేశారు. రోజూ బైక్‌పై తిరిగే వారికి, రైడింగ్ గేర్‌లా కనిపించని ఒక సేఫ్ ఆప్షన్ కావాలంటే ఇది మంచి ఎంపిక.
ధర
₹8,990 ధరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అర్బనైట్ హూడీ.. స్టైల్, డైలీ యూజ్, భద్రత మధ్య మంచి బ్యాలెన్స్ ఇస్తుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















