అన్వేషించండి

Bajaj Pulsar 220F కొనే ముందే మీకు తెలియాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

బజాజ్‌ పల్సర్‌ 220F కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇంజిన్‌ పవర్‌, మైలేజ్‌, తాజా అప్‌డేట్స్‌, టైర్లు, హైదరాబాద్‌–విజయవాడ వంటి తెలుగు నగరాల్లో ఆన్‌ రోడ్‌ ధరలతో పూర్తి గైడ్‌.

Pulsar 220F Specifications: భారత మోటార్‌సైకిల్‌ మార్కెట్‌లో బజాజ్‌ పల్సర్‌ 220Fకి ఉన్న పేరే వేరు. 2009లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్‌, ఇప్పటివరకు లక్షలాది మంది రైడర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. స్పోర్టీ లుక్‌, శక్తిమంతమైన ఇంజిన్‌, నమ్మదగిన పనితీరుతో ఇది ఒక లెజెండరీ మోడల్‌గా నిలిచింది. అమ్మకాల ఊపు తగ్గకూడదన్న ఉద్దేశంతో బజాజ్‌ సంస్థ, అసలు ఫార్ములాను మార్చకుండా చిన్న చిన్న అప్‌డేట్స్‌ మాత్రమే ఇస్తూ వస్తోంది.

మీరు కూడా పల్సర్‌ 220F కొనాలనుకుంటే, కొనుగోలు ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్య విషయాలు ఇవే.

1. బజాజ్‌ పల్సర్‌ 220F ఇంజిన్‌ పవర్‌ ఎంత?

పేరులో ఉన్నట్లుగానే పల్సర్‌ 220Fలో 220 సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్‌ 20.9 హెచ్‌పీ శక్తి, 18.5 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు. హైవే రైడింగ్‌, ఓవర్‌టేకింగ్‌లలో ఈ ఇంజిన్‌ ఇప్పటికీ మంచి విశ్వాసాన్ని ఇస్తుంది.

2. ఫ్యూయల్‌ ట్యాంక్‌ సామర్థ్యం, కర్బ్‌ వెయిట్‌

పల్సర్‌ 220Fలో 15 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఉంది. దీనివల్ల తరచుగా పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగాల్సిన అవసరం తగ్గుతుంది. బైక్‌ కర్బ్‌ వెయిట్‌ (ఫ్యూయల్‌, ఇతర ఆయిల్స్‌తో కలిపి) 160 కిలోలు. ఈ వెయిట్‌ హైవేల్లో స్టేబిలిటీని పెంచుతుంది, అయితే కొత్త రైడర్లకు సిటీ ట్రాఫిక్‌లో కొంచెం భారంగా అనిపించొచ్చు.

3. ఇటీవల పల్సర్‌ 220Fకి వచ్చిన అప్‌డేట్స్‌

ఇటీవల బజాజ్‌ పల్సర్‌ 220Fకు రెండు కొత్త కలర్‌ ఆప్షన్లు ఇచ్చింది, అవి - బ్లాక్‌ కాపర్‌ బేజ్‌, గ్రీన్‌ లైట్‌ కాపర్‌. ఈ రంగులతో పాటు రిఫ్రెష్‌ చేసిన గ్రాఫిక్స్‌, LED టర్న్‌ ఇండికేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బైక్‌కు కొంచెం మోడ్రన్‌ టచ్‌ ఇస్తున్నాయి.

4. టైర్ల సైజ్‌ వివరాలు

బజాజ్‌ పల్సర్‌ 220Fలో ముందు టైర్‌ – 90/90 – 17 & వెనుక టైర్‌ – 120/80 – 17 డైమెన్షన్స్‌లో ఉంటాయి. ట్యూబ్‌లెస్‌ టైర్లు ఇచ్చారు. ఈ సెటప్‌ హైవేలో మంచి గ్రిప్‌, స్థిరత్వాన్ని ఇస్తుంది.

5. పల్సర్‌ 220F ధర & తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌ రోడ్‌ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బజాజ్‌ పల్సర్‌ 220F ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.1.28 లక్షలు.

హైదరాబాద్‌లో ఆన్‌ రోడ్‌ ధర
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹1,27,269
RTO: ₹20,590
ఇన్సూరెన్స్‌ (కాంప్రహెన్సివ్‌): ₹10,673
మొత్తం ఆన్‌ రోడ్‌ ధర: ₹1,58,532

విజయవాడలో ఆన్‌ రోడ్‌ ధర
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹1,27,269
RTO: ₹16,772
ఇన్సూరెన్స్‌ (కాంప్రహెన్సివ్‌): ₹10,626
మొత్తం ఆన్‌ రోడ్‌ ధర: ₹1,54,667

పల్సర్‌ 220F మోటార్‌ సైకిల్‌ ఆధునిక ఫీచర్లతో నిండిన కొత్త తరం వెహికల్‌ కాకపోయినా... నమ్మకమైన ఇంజిన్‌, స్పోర్టీ లుక్‌, హైవే పనితీరు కోరుకునేవారికి ఇప్పటికీ ఒక మంచి ఎంపిక. కాలం పరీక్షించిన మోడల్‌ కావడంతో, రీలయబిలిటీపై సందేహం అవసరం లేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి. 

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Embed widget