Royal Enfield Classic 650: భారత్ మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350- ఫీచర్స్, ధర గురించి తెలుసా?
Royal Enfield Classic 650 : రాయల్ ఎన్ఫీల్డ్ 650 సిసి కొత్త బైక్ భారతదేశంలో లాంచ్ అయింది. దీని ధర సూపర్ మీటీయర్ 650, షాట్‌గన్ 650లకు దగ్గరగా ఉంది.

Royal Enfield Classic 650 : రాయల్రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందాయి. ఈ బ్రిటిష్ బ్రాండ్ 350 cc బైక్స్‌లో బుల్లెట్, క్లాసిక్‌లకు చాలా డిమాండ్ ఉంది. అదే సమయంలో సూపర్ మీటీయర్ 650, బీర్ 650, షాట్‌గన్ 650, కాంటినెంటల్ జిటి , ఇంటర్‌సెప్టర్ 650లు కూడా భారతీయ మార్కెట్లో పాపులర్. ఇప్పుడు ఈ 650 cc సెగ్మెంట్‌లో మరో కొత్త మోటార్ సైకిల్ ఎంట్రీ ఇచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ఇవాళ (గురువారం, మార్చి 27న) భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది.
ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 పవర్
రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన ఈ కొత్త బైక్‌లో 648 cc, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంది. క్లాసిక్ 650లో ఉన్న ఈ ఇంజన్ 47 hp పవర్ ఇస్తుంది. 52 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ ఇంజన్‌తో 6-స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కుచెందిన ఈ మోటార్ సైకిల్ ఇంజన్‌ను ఇప్పటికే పరీక్షించారు.

ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో ఇంజిన్ ఫీచర్స్ ఏంటీ?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంది. మోటార్ సైకిల్‌లో ఉన్న ఈ 349 cc ఇంజన్ 6,100 rpm వద్ద 20.2 bhp పవర్ ఇస్తుంది. 4,000 rpm వద్ద 27 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ ఇంజన్‌తో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది.
మిగతా వాటితో పోలిస్తే ధరలో తేడా ఏంటీ?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 పవర్ క్లాసిక్ 350తో పోలిస్తే దాదాపు రెట్టింపు. ఈ కొత్త బైక్ క్లాసిక్ 350, ఈ బైక్‌లో ఉన్న పారలెల్ ట్విన్ ఇంజన్‌ల మంచి కలయికగా వచ్చింది. క్లాసిక్ 350 ఒక లీటర్ పెట్రోల్‌లో 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ చెబుతుంది. అదే సమయంలో 650 cc బైక్స్ విషయానికి వస్తే షాట్‌గన్ 650, 22 kmpl మైలేజ్ ఇస్తుందని చెబుతుంది.
Classic 650 ధర ఎంత?
క్లాసిక్ 650 ధర సూపర్ మీటీయర్ 650, షాట్‌గన్ 650 ధరలకు దగ్గరగా ఉంటుంది. షాట్‌గన్ 650 ఎక్స్-షోరూమ్ ధర 3.59 లక్షల రూపాయలుగా ఉంది. సూపర్ మీటీయర్ 650 ఎక్స్-షోరూమ్ ధర 3.64 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో క్లాసిక్ 650 ఎక్స్-షోరూమ్ ధర 1,93,080 రూపాయల నుంచి ప్రారంభమై 3.37 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించిన Royal Enfield సంస్థ ఈ Classic 350 బైక్‌లను ఏప్రిల్ నుంచి డెలవరీ చేయనుంది.
అత్యంత బరువై రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్ సైకిల్..
EICMA 2024లో తొలిసారిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ గురించి ప్రకటించారు. తర్వాత మోటోవర్స్ 2024లో దీన్ని ప్రదర్శించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650కు 'టైగర్-ఐ' హెడ్‌లైట్లు, టియర్‌డ్రాప్ ఆకారపు ఆయిల్ ట్యాంక్, ట్రయాంగిల్‌్ సైడ్ ప్యానెల్‌లు ఉన్నాయి. ఇది వైర్ స్పోక్ వీల్స్‌పై నడుస్తుంది, ముందు భాగంలో 320mm డిస్క్, వెనుక భాగంలో 300mm డిస్క్ బ్రేక్ కలిగి ఉంది. క్లాసిక్ 650 ఇంధన ట్యాంక్ సామర్థ్యం 14.8 లీటర్లు. కెర్బ్ బరువు 243 కిలోలు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత బరువైన మోటార్‌సైకిల్‌గా మారింది.





















