Renault Triber: సేల్స్‌లో దూసుకుపోతున్న రెనో 7 సీటర్ కారు - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Renault Triber Sales: రెనో ట్రైబర్ మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే 7 సీటర్ కార్లలో ఒకటిగా నిలిచింది. 2024 అక్టోబర్‌లో దీనికి సంబంధించి 2,111 యూనిట్లు అమ్ముడయ్యాయి.
Renault Triber Best Selling Car in October 2024: మనదేశంలో ఫ్యామిలీ ఉన్న వారు ఎల్లప్పుడూ 7 సీటర్ కార్లను ప్రిఫర్ చేస్తారు. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఒక 7 సీటర్ కారు అమ్మకాల పరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే రెనో ట్రైబర్. గత నెల అంటే అక్టోబర్‌లో ఈ కారు మొత్తంగా 2,111 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే 2023 అక్టోబర్‌లో ట్రైబర్ మొత్తం 2.080 యూనిట్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే దాని అమ్మకాలు 1.49 శాతం పెరిగాయి.
రెనో కిగర్ అమ్మకాల పరంగా రెండో స్థానంలో ఉంది. ఈ కారు మొత్తం 1,053 యూనిట్లను విక్రయించింది. 2023 అక్టోబర్‌లో రెనో కిగర్ మొత్తం 912 యూనిట్లను విక్రయించింది. రెనో క్విడ్ అమ్మకాల పరంగా మూడో స్థానంలో నిలిచింది. క్విడ్ 18.76 శాతం వార్షిక క్షీణతతో 706 యూనిట్లను విక్రయించింది.
రెనో ట్రైబర్ ధర, ఫీచర్లు
రెనో ట్రైబర్ ధర గురించి చెప్పాలంటే ఇది రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. తక్కువ బడ్జెట్‌లో వస్తున్న ఈ 7 సీటర్ కారు గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు 72 పీఎస్ పవర్, 96 ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.0 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
రెనో ఇటీవలే ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా ఇతర ఉత్పత్తులను కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. రెనో హెరిటేజ్ స్పిరిట్ స్క్రాంబ్లర్ బైక్ గ్లింప్స్ కూడా ఇటీవలే చూపించింది. ఇది ఒక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అని చెప్పవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర 23,340 యూరోలుగా నిర్ణయించారు. దీనిని భారత కరెన్సీలోకి మార్చినప్పుడు రూ. 21.2 లక్షల వరకు వస్తుంది. భారతదేశ మార్కెట్లో లభించే ఎన్నో బెస్ట్ సెల్లింగ్ కార్ల కంటే దీని ధర చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.
Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
ట్రైబర్‌లో 14 అంగుళాల ఫ్లెక్స్ వీల్స్ చూడవచ్చు. ఇది పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన డ్యుయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ వైట్ ఎల్‌ఈడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టైలిష్ ఫాబ్రిక్ అప్‌హోల్స్టరీ, క్రోమ్ రింగ్‌తో కూడిన హెచ్‌వీఎసీ నాబ్‌లు, బ్లాక్ ఇన్నర్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
కారు ఎంత మైలేజీ ఇస్తుంది?
ఇది కాకుండా పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, సిక్స్ వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ట్రైబర్ కారులో అందుబాటులో ఉన్నాయి. కారు మాన్యువల్ వేరియంట్ 19 కిలోమీటర్ల వరకు మైలేజీని పొందవచ్చు.
ఈ ఎంపీవీ కారు మొత్తం 10 వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ కారు లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో 84 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. సీలు చేసిన మూడో వరుసను ఫోల్డ్ చేయడం ద్వారా దీనిని 625 లీటర్లకు పెంచవచ్చు.
Also Read: రూ.10 లక్షల్లోపు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే - మహీంద్రా నుంచి మారుతి వరకు!