Porsche 911 Hybrid: కొత్త హైబ్రిడ్ కారును పరిచయం చేసిన పోర్షే - గంటకు 312 కిలోమీటర్ల స్పీడ్!
Porsche New Car: ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ పోర్షే తన 911 కారులో హైబ్రిడ్ వెర్షన్‌ను పరిచయం చేసింది. అయితే దీని ధరను ఇంకా వెల్లడించలేదు. త్వరలో ఈ కారు మనదేశంలో కూడా లాంచ్ అవుతుందని అంచనా.
Porsche 911 Hybrid Unveiled: పోర్షే కంపెనీ తన కొత్త హైబ్రిడ్ కారును పరిచయం చేసింది. అదే పోర్షే 911 టీ హైబ్రిడ్. ఐకానిక్ స్పోర్ట్స్ కారుకు హైబ్రిడ్ ఇంజిన్ జోడించి సరికొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చారు. పోర్షే 911 జీటీఎస్ కూపేలో కొత్త 992 ఛాసిస్ అందించారు. ఇందులో వెనకవైపు ఇంజిన్ అమర్చారు. ఇది 3.6 లీటర్ ఫ్లాట్ సిక్స్ ఇంజిన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ టర్బోఛార్జర్, ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఇందులో ఉన్నాయి. దీంతో 532 బీహెచ్‌పీ పవర్ అవుట్‌పుట్, 610 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇది డెలివర్ చేయనుంది. ఇంతకు ముందు వెర్షన్‌లో ఉన్న 3.0 లీటర్ ట్విన్ టర్బో మోటార్ 478 బీహెచ్‌పీ పవర్, 569 ఎన్ఎం పీక్ టార్క్‌ను డెలివర్ చేయనుంది.
ఇప్పుడు కొత్తగా వచ్చిన పోర్షే 911 టీ హైబ్రిడ్‌లో 11 కేడబ్ల్యూ మోటార్‌ను అందించారు. ఇది టర్బైన్, కంప్రెసర్‌ల మధ్య షాఫ్ట్‌గా పని చేయనుంది. టర్బోను ఈ మోటార్ వేగంగా తిప్పుతుంది. దీని కారణంగా టర్బో ల్యాగ్ కూడా తగ్గనుంది. 400 వోల్ట్ బ్యాటరీ ద్వారా ఇది పవర్‌ను తిరిగి వెనక్కి పంపనుంది.
ఈ కొత్త ఇంజిన్‌లో పీఎంఎస్ ఎలక్ట్రిక్ మోటార్ ఉండనుంది. 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది ఇంటిగ్రేట్ కానుంది. ఇందులో అందుబాటులో ఉన్న ఈ-మోటార్ 40 కేడబ్ల్యూ పవర్ బూస్ట్‌ను అందించనుంది. 150 ఎన్ఎం వరకు అదనపు డ్రైవ్ టార్క్‌ను కూడా డెలివర్ చేయనుంది. ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ రెండిటికీ బోనెట్‌లో ఉండే 1.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ పవర్‌ను అందించనుంది. గతంలో ఉన్న 12 వోల్ట్ బ్యాటరీ స్థానంలో ఈ కొత్త బ్యాటరీ అందుబాటులోకి రానుంది.
Also Read: కొత్త పల్సర్ విడుదల చేసిన బజాజ్ - లేటెస్ట్ ఫీచర్లు, రేటు ఎంతో తెలుసా?
దీని ముందు వెర్షన్‌తో పోలిస్తే ఈ కారు బరువు మరో 50 కేజీలు పెరిగింది. ఈ మార్పుల కారణంగా కొత్త 911 టీ-హైబ్రిడ్ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం మూడు సెకన్లలో అందుకోనుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 312 కిలోమీటర్లుగా ఉంది. దీని ముందు వెర్షన్ కంటే ఈ కొత్త పోర్షే 911 టీ హైబ్రిడ్ 0.4 సెకన్లు వేగంగా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని, 1.1 సెకన్లు వేగంగా 0 నుంచి 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది. స్టాండర్డ్ మోడల్లో రియర్ వీల్ స్టీరింగ్‌ను ఇది పొందనుంది.
2025 పోర్షే 911 హైబ్రిడ్ వెర్షన్ క్యాబిన్‌లో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కంపెనీ అందించింది. కీలెస్ గో, కూల్డ్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లను కూడా ఈ కారు సెంటర్ కన్సోల్‌లో చూడవచ్చు. ఓవరాల్ డిజైన్‌లో పెద్దగా మార్పులేమీ లేవనే చెప్పాలి. ఈ మోడల్ మనదేశంలో కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Tested around the world. Coming to the U.S.
— Porsche (@Porsche) May 24, 2024
Catch the premiere of the new Porsche 911 on May 28 at 9 a.m. EDT at the link in bio. pic.twitter.com/B5ZAQuKNsp
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?