Ola Scooter New Feature Revealed: ఓలా స్కూటర్ ఫీచర్ మామూలుగా లేదుగా.. అంతా రివర్సే!
ఓలా నుంచి త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ఫీచర్‌ను కంపెనీ రివీల్ చేసింది. ద్విచక్ర వాహనాల్లో అరుదుగా ఉండే రివర్స్ మోడ్ ఫీచర్ దీనిలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.
ఓలా నుంచి త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ఫీచర్‌ను కంపెనీ రివీల్ చేసింది. ద్విచక్ర వాహనాల్లో అరుదుగా ఉండే రివర్స్ మోడ్ ఫీచర్ దీనిలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్‌ను హైలైట్ చేస్తూ ఓ వీడియోను పంచుకుంది. ఓలా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు రానున్నాయని ప్రకటన వెలువడిన నాటి నుంచి వీటిపై ఆసక్తి నెలకొంది. వీటి అడ్వాన్స్ బుకింగ్ నుంచి ప్రతీది సంచలనంగా మారుతోంది. ఇక వీటి ఫీచర్లు, కలర్స్ విషయంలోనైతే రకరకాల లీకులు హల్ చల్ చేశాయి.
You can reverse the Ola Scooter at an unbelievable pace, you can also reserve the Ola Scooter at an unbelievable price of ₹499 now! ⁰😎
— Ola Electric (@OlaElectric) August 7, 2021
See you on 15th August 🛵#JoinTheRevolution at https://t.co/5SIc3JyPqm pic.twitter.com/trTJLJBapM
ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఈ స్కూటర్లకు సంబంధించిన విషయాలను ట్వీట్ల రూపంలో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. స్కూటర్లకు సంబంధించిన ట్రైలర్, అడ్వాన్స్ బుకింగ్స్, కలర్స్, స్పీడ్, రిలీజ్ డేట్ ఇలా అన్ని విషయాలను ట్వీట్ చేస్తుంటారు. ఓలా ఫీచర్‌కు సంబంధించిన వీడియోను భవిష్ పంచుకున్నారు. దీనికి ‘రెవల్యూషన్ టు రివర్స్ క్లైమేట్ ఛేంజ్’ అనే క్యాప్షన్ ఇచ్చారు.
!won em ot netsiL
— Bhavish Aggarwal (@bhash) August 7, 2021
A revolution to Reverse climate change! See you on 15th August at https://t.co/lzUzbWbFl7 #JoinTheRevolution @OlaElectric pic.twitter.com/WXXn3sD8CN
ఈ నెల 15న విడుదల..
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ నెల 15వ తేదీన విడుదల కానున్నాయి. ఇవి మొత్తం 10 కలర్ వేరియంట్లతో మార్కెట్లోకి విడుదల కానున్నాయని కంపెనీ పేర్కొంది. దీని అడ్వాన్స్ బుకింగ్స్ సైతం జూలై 15వ తేదీన స్టార్ట్ అయ్యాయి. వీటిని నేరుగా కస్టమర్ల ఇంటికే డెలివరీ చేయాలని ఓలా భావిస్తోంది.
Also read: Bikes Scooter Launch in August: ఆగస్టులో విడుదల కానున్న బైక్స్ ఇవే..
ఇక ఓలా స్కూటర్ల వేరియంట్ల గురించి పలు లీకులు వస్తున్నాయి. ఈ స్కూటర్లు ఎస్, ఎస్ 1, ఎస్ 1 ప్రో అనే మూడు వేరియంట్లలో రానున్నట్లుగా తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.2 లక్షల నుంచి రూ.1.4 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్ ప్రకారం) ఉండే అవకాశం ఉందని సమాచారం.
Also read: Ola Scooter Speed: ఓలా.. స్పీడ్ అదిరిపోలా!