అన్వేషించండి

ఎలక్ట్రిక్‌ కార్లలోనే కాదు, బైక్‌లోనూ హై ఓల్టేజ్‌ టెక్నాలజీ - T30 డెలివెరీలు స్టార్ట్‌ చేసిన రాప్టీ

హై ఓల్టేజ్‌ టెక్నాలజీతో రూపొందించిన Raptee HV T30 ఎలక్ట్రిక్‌ బైక్‌ డెలివెరీలు చెన్నైలో ప్రారంభమయ్యాయి. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ, 36 నిమిషాల్లో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ప్రధాన ఆకర్షణలు.

High Voltage Electric Motorcycle India: ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రపంచంలో మరో ఘట్టం మొదలైంది. చెన్నైకి చెందిన స్టార్టప్‌ సంస్థ 'రాప్టీ హెచ్‌వీ' (Raptee.HV) తమ హై ఓల్టేజ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ T30 డెలివెరీలను అధికారికంగా ప్రారంభించింది. ఏడు సంవత్సరాల పరిశోధన, టెస్టింగ్‌, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ తర్వాత ఈ బైక్‌ను ప్రజల చేతుల్లో పెడుతున్నామని కంపెనీ తెలిపింది.

ఇప్పటి  వరకు కార్లలోనే ఉన్న టెక్నాలజీ

ఇప్పటివరకు ఎలక్ట్రిక్‌ కార్లలో మాత్రమే కనిపించిన హై ఓల్టేజ్‌ (HV-Tec) ఆర్కిటెక్చర్‌ను ద్విచక్ర వాహనాల్లోకి తీసుకురావడం రాప్టీ ప్రత్యేకత. ఈ టెక్నాలజీ వల్ల మెరుగైన పనితీరు, వేగవంతమైన ఛార్జింగ్‌, స్థిరమైన పవర్‌ డెలివరీ లభిస్తాయని సంస్థ చెబుతోంది. ముఖ్యంగా CCS2 కనెక్టర్‌ సపోర్ట్‌ ఉండటంతో ఈ బైక్‌ను ఎలక్ట్రిక్‌ కార్ల పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లలో కూడా సులభంగా ఛార్జ్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతం డెలివెరీలు చెన్నైలో ప్రారంభమయ్యాయి. అక్కడే సర్వీస్‌ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేశారు. 2026 ఏప్రిల్‌ నుంచి బెంగళూరులో ప్రత్యేక షోరూమ్‌, అధీకృత సర్వీస్‌ సెంటర్‌తో కార్యకలాపాలు మొదలుపెట్టాలని కంపెనీ ప్లాన్‌ చేస్తోంది. ఈ ఏడాది చివరికి దక్షిణ భారత రాష్ట్రాల రాజధానులు, తర్వాత పశ్చిమ భారత మార్కెట్‌లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ధర

ధర విషయానికి వస్తే, T30 ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.2.39 లక్షలు. ఈ ప్రైస్‌ సెగ్మెంట్‌లో, కంపెనీ ఇండస్ట్రీలోనే తొలిసారి అందిస్తున్న 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. అదనంగా 3 ఏళ్ల వాహన వారంటీ కూడా ఇస్తున్నారు. సర్వీస్‌ కోసం ప్రత్యేక సింగిల్‌ పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ (SPOC), రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ సపోర్ట్‌ వంటి సదుపాయాలు కూడా ఓనర్‌షిప్‌ ప్యాకేజీలో భాగం.

పవర్‌ట్రెయిన్‌ విషయానికి వస్తే, ఈ బైక్‌లో 5.4kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంది. దీనికి జతగా 29.5 హెచ్‌పీ శక్తి, 70Nm టార్క్‌ ఇచ్చే మోటార్‌ పని చేస్తుంది. పనితీరు పరంగా ఇది సిటీ రైడింగ్‌కే కాదు, హైవే వినియోగానికీ సరిపడేలా ట్యూన్‌ చేశారు.

కేవలం 36 నిమిషాల్లో ఛార్జ్‌

ఛార్జింగ్‌ సామర్థ్యం కూడా ఆకట్టుకునేలా ఉంది. DC ఫాస్ట్‌ ఛార్జర్‌తో 20 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 36 నిమిషాల్లో ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఇంటి వద్ద ఆన్‌బోర్డ్‌ ఛార్జర్‌తో పూర్తి టాప్‌అప్‌ చేయడానికి ఒక గంట కంటే కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. అంటే రోజువారీ ప్రయాణాలకు ఇది చాలా అనుకూలం.

“మా టెక్నాలజీపై విశ్వాసం ఉంచిన తొలి కస్టమర్లకు మేము రుణపడి ఉంటాం. ఇప్పుడు పెద్ద స్థాయిలో డెలివెరీలు ప్రారంభించడం మాకు గర్వకారణం. మేము కేవలం బైక్‌ను అందించడం కాదు, ప్రారంభం నుంచే సజావుగా ఉండే యాజమాన్య అనుభవాన్ని ఇవ్వాలని కట్టుబడి ఉన్నాం” - కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు దినేష్‌ అర్జున్‌

అదనంగా, రాప్టీ హెచ్‌వీకి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి గుర్తింపు కూడా లభించింది. ఉత్పత్తి దశలో ఉన్న ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌తో అత్యధిక సగటు దూరం, అత్యధిక మొత్తం దూరం కవర్‌ చేసినందుకు ఈ గుర్తింపు దక్కింది.

మొత్తంగా చూస్తే, హై ఓల్టేజ్‌ టెక్నాలజీ, వేగవంతమైన ఛార్జింగ్‌, దీర్ఘకాల వారంటీతో T30 ఎలక్ట్రిక్‌ బైక్‌ మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు కూడా ఈ బైక్‌ను బుక్‌ చేశారా?, బుక్‌ చేస్తే డెలివెరీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Classic 350ని కేవలం 4600 EMIతో పొందండి... పూర్తి లెక్కలు చూశారా
Royal Enfield Classic 350ని కేవలం 4600 EMIతో పొందండి... పూర్తి లెక్కలు చూశారా
50,000 జీతంతో Land Rover Defender కారు మెయింటైన్ చేయవచ్చా? దాని మైలేజ్ ఎంత
50,000 జీతంతో Land Rover Defender కారు మెయింటైన్ చేయవచ్చా? దాని మైలేజ్ ఎంత
TVS Orbiter V1 EMI: టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే EMI ఎంత చెల్లించాలి? ఈ బండికి ఎవరికి పోటీ? 
టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే EMI ఎంత చెల్లించాలి? ఈ బండికి ఎవరికి పోటీ? 
Best Mileage Bikes in 150 to 200cc: అధిక మైలేజ్ ఉన్న బైక్ కోసం చూస్తున్నారా? 150-200cc విభాగంలోని ఈ 5 మోడళ్లు ట్రై చేయండి !
అధిక మైలేజ్ ఉన్న బైక్ కోసం చూస్తున్నారా? 150-200cc విభాగంలోని ఈ 5 మోడళ్లు ట్రై చేయండి !
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget