OLA Roadster XPlus: లక్షన్నర ఎలక్ట్రిక్ వెహికిల్‌లో 500కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఓ రేంజ్ ఆఫర్ ఇది.
OlA తన Roadster X Plus ధరలను ప్రకటించింది. ఇప్పుడు బుక్ చేసుకుంటే వచ్చే త్రైమాసికం నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి.

ఎలక్ట్రిక్ వాహనాల్లో 500 కిలోమీటర్ల రేంజ్. హై ఎండ్ కార్లలోనే అది సాధ్యం. కానీ ఓలా బైక్ కు 501 కిలోమీటర్ల రేంజ్ ఇస్తోంది. తన గేమ్ చేంజర్ మోటర్ బైక్ Ola Roadster X Plus ను ఇంతకు ముందే అనౌన్స్ చేసిన OLA ఇవాళ వాటి ధరలను ప్రకటించింది. Ola Roadster X Plus ప్రారంభ మోడల్ ధర ₹1.05 లక్షలు కాగా, టాప్-ఎండ్ వెర్షన్ ధర ₹1.55 లక్షలు.

ఏకంగా 500కిలోమీటర్లు
ఎలక్ట్రిక్ టూవీలర్ల సిగ్మెంట్లోకి చాలా ముందుగానే వచ్చిన ఓలా.. ఈ కేటగిరిలో మంచి మార్కెట్ షేర్ కలిగి ఉంది. ఇప్పటికే పలురకాల టూవీలర్ మోడళ్లను తీసుకొచ్చింది. స్కూటీ సిగ్మెంట్లో ఇప్పటికే 5 రకాల మోడళ్లు ఉన్నాయి. మోటర్ బైక్ కేటగిరిలో ఓలా రోడ్‌స్టర్ ను తీసుకొచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు కొత్తగా Roadster X, Roadster X+ మోడళ్లు తీసుకొచ్చింది. వీటి ధరలను కూడా అనౌన్స్ చేశారు. అయితే పోటీ సంస్థల కాంపిటీషన్ ను తట్టుకునేందుకు ఈ మోడళ్లలో ఏకంగా 500కిలోమీటర్ల రేంజ్‌ను తీసుకొచ్చింది ఓలా. 9.1 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన వెర్షన్ 501కిమీ రేంజ్‌ను అందిస్తుంది! ఇది Ola Gen 3 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపొందించబడిన మోటార్‌సైకిల్ కాగా, 11Kw పీక్ పవర్‌ను అందిస్తుంది. గరిష్ట వేగం 125 km/h.
Also Read: దట్టమైన పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా ఈ చిట్కాలు పాటించండి.
Also Read: ఎలక్ట్రిక్ కాదు ఏకంగా సోలార్ కారే - కిలోమీటర్‌కు అర్థ రూపాయి ఖర్చు - రేటు కూడా చాలా చీప్ !
Roadster ఫీచర్స్
Ola Roadster X Plus ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో మూడు రైడింగ్ మోడ్స్, LCD డాష్‌బోర్డ్, రివర్స్ మోడ్, రిజెనరేటివ్ బ్రేకింగ్, సింగిల్-చానల్ ABS, OTA అప్‌డేట్స్ బ్రేక్-బై-వైర్ ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ స్క్వేర్ షేప్‌లో ఉండి కొంచం రెట్రో లుక్ ఉన్నప్పటికీ చూడ్డానికి క్లీన్ గానే కనిపిస్తోంది. రెండు వేరియంట్ల మధ్య పెద్దగా తేడా లేదు. మోటార్ ఒక మిడ్-డ్రైవ్ మౌంటెడ్ మోటార్‌గా ఉండగా, ఇందులో ఇంటిగ్రేటెడ్ ICU ఉంది. MoveOS 5 కొత్త ఫీచర్లను కూడా అందిస్తోంది.డిజైన్ పరంగా ఇది పూర్తిగా LED లైటింగ్‌ను కలిగి ఉంది. స్క్వేర్ ఆకారంలో రెట్రో వైబ్ కనిపిస్తుంది. బ్యాటరీ ప్యాక్ కోసం ఉపయోగించిన Bharat Cell ను Ola Gigafactoryలో తయారు చేశారు. పెద్ద బ్యాటరీ సైజ్ 9.1 kWh వెర్షన్‌లో ఉండటమే భారీ రేంజ్ అందివ్వడానికి ప్రధాన కారణం.
ఎలక్ట్రిక్ బైక్‌కు లాంగ్ డ్రైవ్‌కు అస్సలు కుదరదు. షార్ట్ రేంజ్ కారణంగా వీటిని లాంగ్ డ్రైవ్‌లకు వాడటానికి ఇష్టపడరు. అయితే Roadster X Plus ఆ కొరత తీరుస్తుంది. 500కిలోమీటర్ల రేంజ్ ను కంపెనీ ప్రకటించడంతో మారుమూల ప్రాంతాలకు కూడా నిశ్చింతగా వెళ్లొచ్చు. అదొక్కటే కాదు. లాంగ్ డ్రైవ్‌లో అలసిపోకుండా క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంది. అంటే యాక్సలేటర్ వదిలేసి రైడ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
ఈ బైక్ సెరామిక్ వైట్, పైన్ గ్రీన్, ఇండస్ట్రియల్ సిల్వర్, స్టెల్లార్ బ్లూ, అలాగే ఆంథ్రాసైట్ రంగులలో అందుబాటులో ఉంటుంది. 9.1 kWh వేరియంట్ డెలివరీలు వచ్చే త్రైమాసికం నుంచి ప్రారంభం కానున్నాయి, దాని తర్వాత 4.5 kWh వెర్షన్ అమ్మకాలు ప్రారంభమవుతాయి.
ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విభాగంలో పోటీ తక్కువగా ఉన్నప్పటికీ, ఈ కొత్త ఆఫరింగ్‌తో Ola Electric తన రేంజ్‌ను విస్తరించి, మోటార్‌సైకిల్ కొనుగోలుదారులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.





















