రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో మనదేశంలో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ బైక్ ఎప్పుడు లాంచ్ కానుందో కూడా రివీల్ చేశారు. నవంబర్ 4వ తేదీన ఈ బైక్ మార్కెట్లో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.1.5 లక్షల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. దీని లుక్‌ను కూడా కంపెనీ రివీల్ చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రూయిజర్ తరహాలో దీని లుక్ ఉండనుందని అనుకోవచ్చు. హార్లే డేవిడ్సన్ క్రూయిజర్ తరహాలో ఈ బైక్ ఉండనుంది. బ్యాటరీ కవర్, మోటార్లు ఇందులో ఒకే చోట ఉండనున్నాయి. దీని ఫీచర్లను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.