News
News
X

Ola Electric Car: చూడగానే కొనాలనిపించే ఓలా ఎలక్ట్రిక్ కారు - కేవలం నాలుగు సెకన్లలోనే - మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు!

ఓలా ఎలక్ట్రిక్ కారును అనౌన్స్ చేసింది. ఈ కారు 500 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.

FOLLOW US: 

ఓలా ఎలక్ట్రిక్ కారును కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కారు గురించిన స్పెసిఫికేషన్లను ఓలా రివీల్ చేయలేదు. భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో ఈ కారును కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ కారును ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. మనదేశంలో రూపొందిన స్పోర్టియస్ట్ కారు ఇదే అని సీఈవో భవీష్ అగర్వాల్ అన్నారు. 2024లో ఈ కారు లాంచ్ కానుంది.

‘నూతన భారతదేశాన్ని నిర్వచించే కారు ఇప్పుడు మనకు అవసరం. దేశంలోని వేగవంతమైన కార్లలో ఇది ఒకటిగా ఉండనుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం నాలుగు సెకన్లలోనే అందుకోనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందించనుంది. పూర్తి గ్లాస్ రూఫ్‌తో ఈ కారు లాంచ్ కానుంది. మనదేశంలో రూపొందించిన కార్లలో అత్యంత స్పోర్టియస్ట్ కారు ఇదే. మూవ్ఓఎస్, అసిస్టెడ్ డ్రైవింగ్ సామర్థ్యాలు కూడా ఈ కారులో ఉండనున్నాయి. ఈ కారుకు కీ కానీ, హ్యాండిల్ కానీ అవసరం లేదు.’ అని భవీష్ అగర్వాల్ లైవ్ స్ట్రీమ్‌లో తెలిపారు.

ఈ కారు గురించి కేవలం రెండు వివరాలు మాత్రమే రివీల్ అయ్యాయి. దీని రేంజ్ 500 కిలోమీటర్లు, 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం నాలుగు సెకన్లలోనే అందుకోనుంది. పోటీగా ఉన్న కార్లను చూస్తే టాటా నెక్సాన్ ఈవీ 437 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 9.4 సెకన్లలో అందుకోనుంది.

ఓలా ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు వినడానికి బాగానే ఉన్నా... టాటా నెక్సాన్ ఈవీ ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ అనే విషయం గుర్తుంచుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ కారు టీజర్ ఇమేజ్‌ను కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ జులైలో షేర్ చేశారు. దీన్ని బట్టి ఇది హ్యాచ్‌బ్యాక్ అని చెప్పవచ్చు. అయితే వీడియో చూస్తే మాత్రం ఫాస్ట్ బ్యాక్ రూఫ్ ఉన్న సెడాన్ లాగా ఈ కారు అనిపిస్తుంది. 2024లో భారతదేశంలో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు దీని స్థాయికి వచ్చే లేదా మించే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కూడా ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కారు ధర రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎంట్రీ లెవల్‌లో ఉన్న ఎక్స్‌జెడ్+ వేరియంట్ ధర. ఇందులో టాప్ ఎండ్ ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ ట్రిమ్ వేరియంట్ ధర రూ.19.24 లక్షలుగా నిర్ణయించారు. సాధారణ నెక్సాన్ ఈవీ ధర రూ.14.79 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో పేర్కొన్నవన్నీ ఎక్స్-షోరూం ధరలే.

దీని డిజైన్ రెగ్యులర్ నెక్సాన్ ఈవీ తరహాలోనే ఉంది. ఇంటెన్సీ టియాల్, డేటోనా గ్రే, ప్రిస్టీన్ వైట్ రంగుల్లో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ కొంచెం కొత్తగా ఉండనుంది. 16 అంగుళాల అలోయ్ వీల్స్, ఈవీ మ్యాక్స్ బ్యాడ్జింగ్ వంటి ఫీచర్లు అందించారు.

వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ మోడ్ రీజనరేటివ్ బ్రేకింగ్, ఎయిర్ ప్యూరిఫయర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, క్రూజ్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. వీటితో పాటు ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ కారు ఏకంగా 437 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని టాటా అంటోంది. నెక్సాన్ ఈవీ గతంలో 312 కిలోమీటర్ల రేంజ్‌తో లాంచ్ అయింది. 40.5 కేడబ్ల్యూహెచ్ లిథియం ఇయాన్ బ్యాటరీని ఇందులో అందించారు. దీంతోపాటు 3.3 కేడబ్ల్యూ చార్జర్‌ను కంపెనీ అందించనుంది. వినియోగదారులు 80 కేడబ్ల్యూ ఫాస్ట్ చార్జర్‌ను కొనుగోలు చేస్తే కేవలం 56 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం చార్జింగ్ ఎక్కనుంది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Published at : 15 Aug 2022 05:21 PM (IST) Tags: Ola electric Ola Ola Electric Car Ola Electric Car Launch Ola EV Ola EV Car Launch

సంబంధిత కథనాలు

Skoda Octavia: స్కోడా ఎలక్ట్రిక్ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిపోవచ్చు!

Skoda Octavia: స్కోడా ఎలక్ట్రిక్ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిపోవచ్చు!

Hero E-scooter: హీరో నుంచి ఎట్టకేలకు ఇ-స్కూటర్, విడుదల ఎప్పుడంటే?

Hero E-scooter: హీరో నుంచి ఎట్టకేలకు ఇ-స్కూటర్, విడుదల ఎప్పుడంటే?

Electric SUV Space: ఎలక్ట్రిక్‌ SUVల కోసం ₹4 వేల కోట్ల ప్లాన్‌లో మహీంద్ర

Electric SUV Space: ఎలక్ట్రిక్‌ SUVల కోసం ₹4 వేల కోట్ల ప్లాన్‌లో మహీంద్ర

Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Tata Punch Camo Edition: టాటా పంచ్‌లో కొత్త వెర్షన్ - సూపర్ అనిపించే లుక్!

Tata Punch Camo Edition: టాటా పంచ్‌లో కొత్త వెర్షన్ - సూపర్ అనిపించే లుక్!

టాప్ స్టోరీస్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!