Best Mileage Diesel SUVs: డీజిల్ SUV కోసం చూస్తున్నారా? Nexon నుంచి Syros వరకు మంచి మైలేజీ ఇచ్చే కార్లు ఇవే!
Best Mileage Diesel SUVs:డీజిల్ SUV కొనాలనుకుంటున్నారా? టాటా నెక్సాన్ నుంచి కియా సిరోస్ వరకు మంచి మైలేజ్ ఇచ్చే ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ధర, మైలేజ్ వివరాలు ఇక్కడ చూడండి.

Best Mileage Diesel SUVs: భారతదేశంలో గత కొన్నేళ్లుగా డీజిల్ కార్ల అమ్మకాలు కొద్దిగా తగ్గినప్పటికీ, డీజిల్ ఇంజిన్ SUVలకు డిమాండ్ ఇప్పటికీ భారీగానే ఉంది. దీనికి ప్రధాన కారణాలు మంచి మైలైజీ వస్తుందని, పనితీరు కూడా బాగుంటుందని, ఎక్కువ దూరాలు వెళ్లేందుకు తక్కువ ఖర్చు అవుతుందని ఈ వాహనాలు కొనేందుకు కొందరు మొగ్గు చూపుతున్నారు. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించేవారికి లేదా హైవే డ్రైవ్‌లను ఇష్టపడేవారు కూడా ఈ డీజిల్ SUVలను మొదటి ఎంపికగా భావిస్తుంటారు. ఈ జాబితాలో మీరు ఉన్నట్టు అయితే మీ కోసం ఎక్కువ మైలేజ్ ఇచ్చే డీజిల్ SUV వాహనాలు గురించి వివరిస్తాం. భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే డీజిల్ SUVల జాబితాను మీరు ఇక్కడ చూడొచ్చు.
టాటా నెక్సాన్ డీజిల్
టాటా నెక్సాన్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVలలో ఒకటి. దీని డీజిల్ మోడల్ 1.5 లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ విషయంలో, నెక్సాన్ డీజిల్ ఈ సెగ్మెంట్‌లో ముందంజలో ఉంది. దీని AMT వేరియంట్ 24.08 కిమీ/లీటర్ వరకు ARAI మైలేజ్ ఇస్తుంది, అయితే మాన్యువల్ వేరియంట్ సుమారు 23.23 కిమీ/లీటర్ వరకు మైలేజీ ఇస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 9.01 లక్షల నుంచి రూ. 14.05 లక్షల వరకు ఉంటుంది.
కియా సోనెట్ డీజిల్
కియా సోనెట్ డీజిల్ SUV కూడా కొనుగోలుదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండూ కూడా అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ విషయానికొస్తే, సోనెట్ డీజిల్ 18.6 కిమీ/లీటర్ నుంచి 22.3 కిమీ/లీటర్ వరకు ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 8.98 లక్షలు ఉంది. టాప్ వేరియంట్ రూ. 14.09 లక్షల వరకు ఉంటుంది.
మహీంద్రా XUV 3XO
మహీంద్రా XUV 3XO వాహనం చౌకైన డీజిల్ SUVలలో ఒకటి. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది, ఇది మాన్యువల్, AMT రెండింటిలోనూ అందుబాటులో ఉంది. మైలేజ్ విషయంలో, ఈ SUV 20.6 నుంచి 21.2 కిలోమీటర్/లీటర్ వరకు కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. దీని ధర సుమారు రూ. 8.95 లక్షల నుంచి రూ. 13.43 లక్షల వరకు ఉంటుంది.
హ్యుందాయ్ వెన్యూ డీజిల్, కియా సైరోస్ డీజిల్
హ్యుందాయ్ వెన్యూ డీజిల్ 17.9 నుంచి 20.99 కిలోమీటర్/లీటర్ వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ. 9.70 లక్షల నుంచి రూ. 15.69 లక్షల వరకు ఉంటుంది. అయితే, కియా సైరోస్ డీజిల్ మాన్యువల్ వేరియంట్ 20.75 కిలోమీటర్/లీటర్, ఆటోమేటిక్ వేరియంట్ 17.65 కిలోమీటర్/లీటర్ వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ. 10.14 లక్షల నుంచి రూ. 15.94 లక్షల మధ్య ఉంటుంది.
మీరు ఎక్కువ మైలేజ్, బలమైన ఇంజిన్ కలిగిన డీజిల్ SUV కావాలనుకుంటే, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ, కియా సైరోస్ మీకు అద్భుతమైన ఆప్షన్‌లు కావచ్చు. సరైన SUVని ఎంచుకునేటప్పుడు, మైలేజ్‌తోపాటు బడ్జెట్, అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.





















