అన్వేషించండి

త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు

రెనాల్ట్ కంపెనీకి చెందిన కొత్త డస్టర్ హైబ్రిడ్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. అక్టోబర్ 17న జరగనున్న దీని లాంచింగ్, ఇంజిన్ ఆప్షన్లు, ఫీచర్లకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ అక్టోబర్ 17న విడుదలవుతుంది.
  • హైబ్రిడ్, టర్బో-పెట్రోల్ ఇంజిన్లతో శక్తివంతమైన డ్రైవ్ అనుభవం.
  • ఆధునిక డిజైన్, ప్రీమియం ఫీచర్లు, మెరుగైన భద్రతా ప్రమాణాలు.
  • రూ. 10-11 లక్షల ప్రారంభ ధరతో పోటీకి సిద్ధం.

New Renault Duster hybrid | ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఎస్‌యూవీ రెనో డస్టర్ మళ్లీ ఒక కొత్త, స్టైలిస్ అవతార్‌లో మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఐకానిక్ కారు నెక్స్ట్-జనరేషన్ హైబ్రిడ్ మోడల్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రెనాల్ట్ ఈ కొత్త కారును మోడ్రన్ హైబ్రిడ్ టెక్నాలజీ, బోల్డ్ లుక్స్, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో పరిచయం చేయనుంది. 

కస్టమర్లు కొంతకాలం నుంచి ఈ కొత్త SUV కోసం ఎదురుచూస్తున్నారు, ఎట్టకేలకు దీని లాంచ్ షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చింది. కొత్త హైబ్రిడ్ సాంకేతికతతో రాబోతున్న రెనాల్ట్ డస్టర్, తన సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కొత్త రెనో డస్టర్ హైబ్రిడ్‌లో ఎలాంటి కొత్త ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, ప్రత్యేక అప్‌డేట్లు రాబోతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

అక్టోబర్ 17న లాంచింగ్ 
కొత్త రెనో డస్టర్ హైబ్రిడ్‌ను అక్టోబర్ 17న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రెనాల్ట్ కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని తీసుకురానుంది. లాంచ్ రోజే దీని బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. ఫెస్టివల్ సీజన్‌లో ఈ కారుకు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందని కంపెనీ భావిస్తోంది.

హైబ్రిడ్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు
కొత్త డస్టర్‌లో కస్టమర్లకు పవర్‌ఫుల్, మైలేజ్ ఫ్రెండ్లీ ఇంజిన్ ఆప్షన్లు లభించనున్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణ 1.6 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే హైబ్రిడ్ సిస్టమ్. ఇది 2 ఎలక్ట్రిక్ మోటార్లతో పనిచేస్తుంది. మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లభించే అవకాశం ఉంది. ఈ కొత్త హైబ్రిడ్ సెటప్ కారుకు హై పవర్ ఇవ్వడమే కాకుండా మంచి మైలేజ్‌ కూడా అందిస్తుంది.

Also Read: పెట్రోల్, CNG వెర్షన్లు, 5 వేరియంట్లలో Tata Aeris లాంచ్‌.. ధరలు, ఆధునిక ఫీచర్లు ఇవే

రెనాల్ట్ కంపెనీ ఈ కొత్త డస్టర్ ఎక్స్‌టీరియర్‌ను గతంలో కంటే మరింత అగ్రెసివ్, మస్కులర్‌గా డిజైన్ చేసింది. ఇందులో కొత్త Y షేప్డ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, సిగ్నేచర్ గ్రిల్, రూఫ్ రైల్స్, వెడల్పాటి అల్లాయ్ వీల్స్ ఇస్తున్నారు. కేబిన్‌లోకి అడుగుపెట్టగానే మీకు ఒక కొత్త, ప్రీమియం డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో 10.1 అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి.

అంచనా ధర 

సేఫ్టీ పరంగా కొత్త రెనో డస్టర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి హైటెక్ సేఫ్టీ ఫీచర్లు ఇస్తారని అంచనాలున్నాయి. ఇక ధర విషయానికొస్తే, మేక్ ఇన్ ఇండియా, హైబ్రిడ్ టెక్నాలజీతో రానుండటం వల్ల దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షలు, రూ. 11 లక్షలు ఉండవచ్చు. టాప్ హైబ్రిడ్ వేరియంట్ల ధర రూ. 18 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Also Read: Suzuki e-Access వర్సెస్‌ Yamaha EC-06.. రేంజ్, స్పీడ్, ధరలో ఏ బండి ఎలా ఉంది?

 

 

Frequently Asked Questions

కొత్త రెనో డస్టర్ హైబ్రిడ్ ఎప్పుడు విడుదల కానుంది?

కొత్త రెనో డస్టర్ హైబ్రిడ్ అక్టోబర్ 17న విడుదల కానుంది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని తీసుకురానుంది.

కొత్త డస్టర్ హైబ్రిడ్‌లో ఎలాంటి ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి?

1.6 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో కూడిన హైబ్రిడ్ సిస్టమ్, 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. ఇవి పవర్ తో పాటు మంచి మైలేజీని అందిస్తాయి.

కొత్త రెనో డస్టర్ హైబ్రిడ్ అంచనా ధర ఎంత?

దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 11 లక్షల వరకు ఉండవచ్చు. టాప్ హైబ్రిడ్ వేరియంట్ల ధర రూ. 18 లక్షల వరకు ఉంటుందని అంచనా.

కొత్త రెనో డస్టర్ ఏ కార్లకు పోటీ ఇవ్వనుంది?

కొత్త హైబ్రిడ్ డస్టర్, తన సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

హైదరాబాద్‌ లేదా విజయవాడ... Kawasaki Versys X 300ని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఈజీ EMI ప్లాన్‌ ఉందిగా!
Kawasaki Versys X 300: రూ.4 లక్షల బండిని కేవలం రూ.7,685 EMI తో సొంతం చేసుకునే ప్లాన్‌
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
ఒంటరిగా వెళ్లినా, జంటగా వెళ్లినా.. లాంగ్ రైడ్స్‌కు బెస్ట్.. రూ.2-5 లక్షల్లో 11 అడ్వెంచర్ టూరర్ బైక్స్
రూ.2-5 లక్షల బడ్జెట్‌లో బ్రహ్మాండమైన అడ్వెంచర్ టూరర్‌ బైక్స్.. ఇవిగో 11 ఆప్షన్లు
Tata Aerisలో ఏ వేరియంట్‌ మీ బడ్జెట్‌కు సరిపోతుంది? వేరియంట్ల వారీగా ఫీచర్లు, ధరల వివరాలు
Tata Aerisలో 5 వేరియంట్లు.. ఏ వేరియంట్‌లో స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నాయి, ఏది కొనాలి?
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Embed widget