అన్వేషించండి

పెట్రోల్, CNG వెర్షన్లు, 5 వేరియంట్లలో Tata Aeris లాంచ్‌.. ధరలు, ఆధునిక ఫీచర్లు ఇవే

టాటా కొత్త Aeris సెడాన్‌ను రూ.5.29 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. పెట్రోల్, CNGలో 5 వేరియంట్లు, MT & AMT ఎంపికలు ఉన్నాయి.

Tata Aeris Price, Mileage And Features Telugu: టాటా మోటార్స్ నుంచి మరో కొత్త సెడాన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ కంపెనీ.. కొత్త Tata Aerisను కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధరను రూ.5.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. వేరియంట్‌ను బట్టి ధర రూ.9.74 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న Tata Tigorకు ఆధునిక రూపం ఇచ్చి, దాని స్థానంలో Tata Aeris ను కంపెనీ తీసుకొచ్చింది.

Tata Aerisలో పెట్రోల్ & CNG ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. మొత్తం ఐదు వేరియంట్లలో - Smart, Pure, Pure+, Creative & Accomplished - ఈ కారును కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్, CNG రెండింటిలోనూ MT & AMT గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 11 నుంచి డెలివరీలు మొదలవుతాయి.

ధరలు ఇలా..

వేరియంట్లు
పెట్రోల్‌ MT
(ధర రూ. లక్షల్లో)
పెట్రోల్‌ AMT
(ధర రూ. లక్షల్లో)
CNG MT
(ధర రూ. లక్షల్లో)
CNG AMT
(ధర రూ. లక్షల్లో)
Smart
 
5.29
-
6.29
-
Pure
 
6.14
6.69
7.14
7.69
Pure+
 
6.74
7.29
7.74
8.29
Creative
 
7.49
8.04
8.49
9.04
Accomplished
 
8.19
8.74
9.19
9.74

కొత్త లుక్‌తో..

Aeris డిజైన్‌లో భారీ మార్పులు కనిపిస్తాయి. ముందుభాగంలో సన్నని LED హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. కనుబొమ్మల తరహాలో LED DRLs ఇచ్చారు. ముందు భాగంలో నలుపు రంగు గ్రిల్ ఉంటుంది. బంపర్ డిజైన్ కూడా కొత్తగా ఉంది. పిక్సెల్ ఆకారంలోని LED ఫాగ్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

వెనుక భాగంలో సన్నని LED టెయిల్‌ల్యాంప్స్ ఉన్నాయి. వీటిని ఎరుపు రంగు స్ట్రిప్‌తో కలిపారు. 15 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కూడా అందిస్తున్నారు. Smart, Pure వేరియంట్లలో & అన్ని CNG వేరియంట్లలో 14 అంగుళాల వీల్స్ ఉంటాయి.

Aeris పొడవు 3,995 మిల్లీమీటర్లు. వెడల్పు 1,684 మిల్లీమీటర్లు. ఎత్తు 1,532 మిల్లీమీటర్లు. వీల్‌బేస్ 2,450 మిల్లీమీటర్లు. గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిల్లీమీటర్లు. పెట్రోల్ వెర్షన్‌లో 419 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.

ఇది కూడా చదవండి: 1.3 లక్షలు డౌన్ పేమెంట్ చేసి Tata Aeris కారు కొనవచ్చు.. EMI ఎంత చెల్లించాలి

లోపల కొత్త ఫీచర్లు..

క్యాబిన్ డిజైన్ Tata Tiagoను పోలి ఉంటుంది. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఇచ్చారు. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ కొత్తగా వచ్చింది. ముందు సీట్లకు వెంటిలేషన్ సదుపాయం ఉంది. లెదరెట్ సీట్లను కూడా అందిస్తున్నారు.

సరౌండ్ వ్యూ కెమెరాలను డ్యాష్‌క్యామ్‌గా ఉపయోగించే సదుపాయం ఉంది. దీనిని ‘డ్యాష్‌క్యామ్ రికార్డర్’గా అందిస్తున్నారు. అయితే ఆడియో సిస్టమ్‌లో స్పీకర్ల సంఖ్య తగ్గింది. గత మోడల్‌ (Tata Tiago)లో 8 స్పీకర్లు ఉండగా, కొత్త Aerisలో 6 స్పీకర్లు ఉన్నాయి.

భద్రతకు ప్రాధాన్యం..

Aerisలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ప్రామాణికంగా ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, TPMS, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పిల్లల సీట్ల కోసం ISOFIX యాంకరేజ్‌లు కూడా ఇచ్చారు.

ఇంజిన్ వివరాలు..

Aerisలో 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 86hp శక్తి & 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ MT లేదా 5 స్పీడ్ AMTతో లభిస్తుంది.

CNG వెర్షన్‌లో ఇదే ఇంజిన్ 76hp శక్తి & 97Nm టార్క్‌ను అందిస్తుంది. CNGలోనూ MT & AMT ఎంపికలు ఉన్నాయి. CNG వెర్షన్‌లో రెండు సిలిండర్ల ట్యాంక్ వ్యవస్థను ఉపయోగించారు. దీంతో బూట్ స్పేస్ విషయంలోనూ ఈ కారు ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: Tata Tiago EV: ఈఎమ్‌ఐ రూ.10,000 కంటే తక్కువే! విజయవాడలో ఆన్‌రోడ్‌ ధర, ఈజీ ఫైనాన్స్‌ ప్లాన్‌ వివరాలు

మారుతి సుజుకి Dzire, హోండా Amaze & హ్యుందాయ్ Auraలకు Aeris పోటీ ఇవ్వనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget