Honda Shine 100 DX: కొత్త ఫీచర్లు, అదిరిపోయే లుక్! బుకింగ్స్ ఎప్పుడంటే?
Honda Shine 100 DX Launch: కొత్త హోండా షైన్ 100 DX లాంచ్ అయింది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే మరింత స్టైలిష్ & పవర్‌ఫుల్‌గా వచ్చింది. బుకింగ్స్ తేదీని కూడా కంపెనీ ఖరారు చేసింది.

Honda Shine 100 DX Booking, Features and Design Updates: తక్కువ ధరతో బాగా పాపులర్ అయిన బైక్ షైన్ 100కు కొత్త తమ్ముడు వచ్చాడు. ఈ కంపెనీ, హోండా షైన్ 100 DXలో కొత్త & మరింత ప్రీమియం వెర్షన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ బైక్ కొత్త డిజైన్, ట్రెండీ ఫీచర్లు, యువ రైడర్‌లకు ఇష్టమైన రంగులతో విడుదలైంది. దీని బుకింగ్స్ మరో నెలలో, ఆగస్టు 1, 2025 నుంచి ప్రారంభం అవుతాయి.
ఈసారి డిజైన్‌లో ప్రత్యేకత ఏమిటి?
హోండా షైన్ 100 DX లుక్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు, ఈ టూవీలర్‌లో పెద్ద & వెడల్పాటి ఇంధన ట్యాంక్ బిగించారు. దీనివల్ల ఈ బండి గతంలో కంటే మరింత బలంగా & స్టైల్‌గా కనిపిస్తుంది. ఇంకా.. బోల్డ్ గ్రాఫిక్స్, క్రోమ్ హెడ్‌లైట్ కౌల్ & క్రోమ్ హీట్ షీల్డ్ కూడా ఉన్నాయి. బైక్‌కు చెల్లించే ధరతో పోలిస్తే, ఇవి ఈ బండికి ప్రీమియం లుక్ & ఫీలింగ్స్ ఇస్తాయి.
ఈ కొత్త బైక్ పూర్తి డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో లాంచ్ అయింది, ఇది ఈ విభాగంలో కొత్త & ప్రత్యేక లక్షణం. ఈ డిజిటల్ మీటర్ రైడర్‌కు బండి వేగం, ఇంధన స్థాయి & గేర్ పొజిషన్ వంటి కీలక సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ క్లస్టర్ ఎడిషన్‌తో ఈ బైక్ సాంకేతికంగా మరింత అడ్వాన్స్‌డ్‌గా & మోడరన్‌గా మారింది.
నాలుగు కొత్త రంగుల్లో అందుబాటులోకి..
హోండా షైన్ 100 DX యువత అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించారు & యువత మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. అవి:
- పెర్ల్ ఇంజీనస్ బ్లాక్ (Pearl Ingenous Black)
- ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ (Imperial Red Metallic)
- అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ (Athletic Blue Metallic)
- జెనీ గ్రే మెటాలిక్ (Geny Gray Metallic)
యువ రైడర్లకు స్టైలిష్ & ట్రెండీ లుక్ ఇచ్చే విధంగా ఈ కలర్ ఆప్షన్స్‌ను ఎంపిక చేశారు.
ఇంజిన్ & పవర్
హోండా షైన్ 100 DX లో, హోండా షైన్ 100 ఉపయోగించిన అదే పాత & నమ్మదగిన 98.98cc ఇంజిన్ ఉంది. ఇది 7.28 bhp శక్తిని & 8.04 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్‌ను 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో యాడ్ చేశారు. దీనివల్ల, ఈ బైక్ సిటీ ట్రాఫిక్‌లోనూ ఈజీగా పని చేస్తుంది & గ్రామీణ రోడ్లపై మంచి మైలేజీని, మృదువైన ప్రయాణాన్ని కూడా ఇస్తుంది.
భద్రత & సౌకర్యం
షైన్ 100 DX స్టీల్ ఫ్రేమ్ ఛాసిస్ ఉంది, ఇది బండికి బలాన్ని ఇస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, 5-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ షాక్స్ & 17-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్ కూడా ఈ బండితో ఇస్తున్నారు. ఈ ప్రత్యేకతలన్నీ కలిసి కొత్త షైన్ 100 DX ను సౌకర్యవంతమైన, సురక్షితమైన & స్టైలిష్ రైడ్ ఆప్షన్‌గా నిలబెడతాయి.
ధర
హోండా షైన్ 100 DX ధర గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. బుకింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి పూర్తి స్పష్టత వస్తుంది.



















