అన్వేషించండి

Best Mileage Bike: 70 km మైలేజ్‌ ఇచ్చే బైక్‌, రేటు రూ.60 వేలే - ఒక్క నెలలో లక్ష మంది కొన్నారు

Hero HF Deluxe: హీరో HF డీలక్స్‌లో 97.2cc ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్, OHC టెక్నాలజీ ఇంజిన్ ఉంది. స్మూత్‌ ట్రాన్స్‌మిషన్ కోసం 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఇచ్చారు.

Hero HF Deluxe Price, Mileage And Features In Telugu: హీరో హెచ్ఎఫ్ డీలక్స్ భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధర బైక్‌ల్లో ఒకటి. స్ల్పెండర్‌ సిరీస్‌ తర్వాత, హీరో కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడైన బైక్ ఇది. సేల్స్‌ రిపోర్ట్‌ ప్రకారం, గత నెలలో (జూన్ 2025) ఈ బండిని 1 లక్ష మందికి పైగా కొత్త కస్టమర్లు కొనుగోలు చేశారు. కిక్ స్టార్ట్ & సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్లలో ఈ టూవీలర్‌ను కొనవచ్చు.

హీరో HF డీలక్స్ 2025 మోడల్ ఒక మంచి కమ్యూటర్ బైక్. అంటే, డైలీ అప్‌ అండ్‌ డౌన్‌ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మంచి ఇంధన సామర్థ్యం కారణంగా పెట్రోల్‌ తక్కువ తాగుతుంది, మీ డబ్బు ఆదా చేస్తుంది.

హైదరాబాద్‌లో, హీరో HF డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర (Hero HF Deluxe ex-showroom price, Hyderabad) రూ. 62,018 నుంచి ప్రారంభమై, రూ. 70,618 వరకు ఉంటుంది. దీని ఆన్-రోడ్ ధర (Hero HF Deluxe on-road price, Hyderabad) దాదాపు రూ. 78,000. 

విజయవాడలో హీరో HF డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 62,018 కాగా, ఆన్‌-రోడ్‌ ధర  (Hero HF Deluxe Price, Vijayawada) దాదాపు రూ. 77,500. 

హీరో HF డీలక్స్ ఫీచర్లు
దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా & ఆధునికంగా కనిపిస్తుంది. స్టైలిష్ బాడీ దీనికి మరింత మెరుగైన రూపాన్ని ఇస్తుంది. బైక్ సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి హాయిగా ఉంటుంది. తక్కువ బరువు కారణంగా ఈ బండిని చాలా సులభంగా నడపవచ్చు. ఇంకా, మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ కారణంగా యాక్సిడెంట్ల రిస్క్‌ తగ్గుతుంది. దీని సస్పెన్షన్ వ్యవస్థ కూడా చాలా బాగుంది, గుంతలు & స్పీడ్‌ బ్రేకర్ల దగ్గర కంఫర్ట్‌గా అనిపిస్తుంది. ఈ బైక్‌లో డిజిటల్ మీటర్, ఇగ్నిషన్ సిస్టమ్ & ట్యూబ్‌లెస్ టైర్లు వంటివి ఇచ్చారు.

హీరో HF డీలక్స్ ఇంజిన్
హీరో HF డీలక్స్‌లో.. 97.2cc ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్, OHC టెక్నాలజీ ఇంజిన్‌ బిగించారు. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ ఉంది, ట్రాఫిక్‌లో ఇది గొప్ప షిఫ్టింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 

హీరో HF డీలక్స్ మైలేజీ
హీరో HF డీలక్స్ మంచి ఇంధన సామర్థ్యానికి పెట్టింది పేరు. కంపెనీ లెక్క ప్రకారం, ఈ టూవీలర్‌ లీటరు పెట్రోలుకు 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇప్పటికే ఈ బండిని వాడుతున్న వినియోగదారులు చెప్పిన ప్రకారం, సగటున లీటరుకు 65-70 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. సిటీ ట్రాఫిక్‌లోనూ & హైవే రైడింగ్‌లోనూ కొందరు దాదాపు 70 కిలోమీటర్ల మైలేజీ సాధించారు. హీరో బ్రాండ్‌ డైలీ కమ్యూటర్ బైక్‌కు 9.6 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్‌ను నింపితే, 70 కిలోమీటర్ల మైలేజీ ప్రకారం, దాదాపు 670 కి.మీ. వరకు ఈల వేసుకుంటూ వెళ్లిపోవచ్చు. 

ఇటీవల, హీరో కంపెనీ, కొన్ని కొత్త ఫీచర్లతో Hero HF Deluxe Pro ను విడుదల చేసింది. ఈ బైక్‌కు ఇంధనాన్ని ఆదా చేసే i3S టెక్నాలజీని అందించింది. 

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget