అన్వేషించండి

Mahindra Scorpio N Pickup: లోడింగ్ నుంచి లైఫ్‌స్టైల్‌ వరకు - మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్‌లో అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు

Mahindra Scorpio N Pickup Features: మహీంద్రా స్కార్పియో N పికప్‌ను స్కార్పియో N ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. సింగిల్-క్యాబ్ & డబుల్-క్యాబ్ వేరియంట్లలో ఇది వస్తోంది.

Mahindra Scorpio N Pickup Features And Launch Date: మహీంద్రా కంపెనీ తన కొత్త స్కార్పియో N పికప్‌ను త్వరలో భారతదేశం మార్కెట్‌లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బండి, టెస్టింగ్‌ టైమ్‌లో చాలాసార్లు రోడ్లపై కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని అర్ధం.. దీని లాంచ్ డేట్‌ దగ్గర పడిందని. వాస్తవానికి, ఈ పికప్‌ ఆఫీస్‌లకు వెళ్లే సాధారణ కస్టమర్ల కోసం కాదు, లైఫ్‌స్టైల్‌ & వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను మహీంద్రా రూపొందించినట్టు చెబుతున్నారు.             

గంభీరమైన డిజైన్‌
మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్ స్కార్పియో ఎన్ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా నిర్మించారు. ఈ ఫోర్‌-వీలర్‌ను సింగిల్-క్యాబ్ & డబుల్-క్యాబ్ వేరియంట్లలో లాంచ్‌ చేస్తారు. పరీక్ష సమయంలో చూసిన మోడల్‌ను బట్టి, దీని లుక్ చాలా బలంగా & ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ బలమైన బండికి కొత్త ఫ్రంట్ గ్రిల్, యుటిలిటీ బంపర్, హై-మౌంటెడ్ రోల్‌ఓవర్ ప్రొటెక్షన్ బార్ ఇచ్చారు & పెద్ద లోడింగ్ బే ఉంటుంది. దీంతో పాటు, షార్క్-ఫిన్ యాంటెన్నా, స్టీల్ వీల్స్ & హాలోజన్ టెయిల్ లైట్లు వంటి ప్రాక్టికల్‌ ఫీచర్స్‌ను కూడా యాడ్‌ చేశారు.         

ఫుష్కలంగా అధునాతన & ప్రీమియం లక్షణాలు 
కంపెనీ, ప్రీమియం & అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇది లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), మల్టీ ఎయిర్‌ బ్యాగ్స్‌, 5G నెట్‌వర్క్ కనెక్టివిటీ, ట్రైలర్ స్వే కంట్రోల్ కిట్‌ (ఇదొక సేఫ్టీ ఫీచర్‌, ESCతో అనుసంధానమై ఉంటుంది) ‍‌& ఫాటీగ్ అలర్ట్ సిస్టమ్ (అలసట హెచ్చరిక వ్యవస్థ) వంటి అధునాతన లక్షణాలతో వస్తోంది. ఈ పికప్ బేసిక్ నుంచి హై-ఎండ్ ట్రిమ్‌ల వరకు చాలా వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. దీని టాప్ మోడల్స్‌లో 4Xplor 4WD సిస్టమ్‌ (four-wheel-drive system) ఉండే అవకాశం ఉంది, తద్వారా ఈ బండి ఆఫ్-రోడింగ్‌లోనూ పూర్తిగా సామర్థ్యంతో సత్తా చూపుతుంది.      

పవర్‌ఫుల్‌ ఇంజిన్ & పీక్‌ పవర్
ఈ కంపెనీ నుంచి వచ్చిన పాపులర్‌ SUVలు థార్ & స్కార్పియో N లో ఇచ్చిన అదే ఇంజిన్‌ను మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్‌లోనూ బిగించే అవకాశం ఉంది. దీనికి రెండు ఇంజిన్ ఎంపికలు ఉండవచ్చు. ఒకటి - 2.0-లీటర్ mStallion టర్బో-పెట్రోల్ ఇంజన్ & మరొకటి - 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్. ట్రాన్స్‌మిషన్‌ కోసం 6-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో రావచ్చు. అలాగే, ఈ పికప్ రియర్‌-వీల్‌-డ్రైవ్ (RWD) &ఫోర్‌-వీల్‌-డ్రైవ్ (4WD) వేరియంట్లలో రావచ్చు, తద్వారా ఇది అన్ని రకాల రోడ్లపైనా దుమ్ము లేపుకుంటూ దూసుకెళ్లగలదు.                    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:కోర్టుకు గంట సమయం ఇచ్చిన జగన్ -  హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వైరల్
కోర్టుకు గంట సమయం ఇచ్చిన జగన్ - హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వైరల్
Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
NRI murder case: అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
Prime Minister Modi Puttaparthi tour: ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
Advertisement

వీడియోలు

WTC Final India | టీమిండియా టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్కటే దారి
Ind vs SA Shubman Gill | రెండు టెస్ట్‌‌లో గిల్ ఆడటంపై అనుమానాలు.. అతడి ప్లేస్‌లో మరొకరు?
Dinesh Karthik Comments on Gambhir | గంభీర్.. అతడి కెరీర్ నాశనం చేస్తున్నావ్!
Maoist Commander Hidma Encounter in AP  | ఏపీలో భారీ ఎన్‌కౌంటర్ | ABP Desam
KL Rahul about IPL Captaincy | కెప్టెన్సీపై కేఎల్ రాహుల్  సంచలన కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:కోర్టుకు గంట సమయం ఇచ్చిన జగన్ -  హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వైరల్
కోర్టుకు గంట సమయం ఇచ్చిన జగన్ - హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వైరల్
Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
NRI murder case: అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
Prime Minister Modi Puttaparthi tour: ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
Deepika Padukone: ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ
ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ
Bandi Sanjay About Naxalism: నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే... అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్
నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే... అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్
Supritha Naidu: అటు తల్లి... ఇటు కుమార్తె... డబ్బింగ్ స్టూడియోలో సుప్రీత ఎమోషనల్ మూమెంట్
అటు తల్లి... ఇటు కుమార్తె... డబ్బింగ్ స్టూడియోలో సుప్రీత ఎమోషనల్ మూమెంట్
Puttaparthi Sathya Sai Baba: పుట్టపర్తిలో సెలబ్రిటీల సందడి.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సచిన్, ఐశ్వర్యరాయ్ ఫొటోలు చూశారా
పుట్టపర్తిలో సెలబ్రిటీల సందడి.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సచిన్, ఐశ్వర్యరాయ్ ఫొటోలు చూశారా
Embed widget