అన్వేషించండి

New Bajaj Pulsar: కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!

Bajaj Pulsar N125: బజాజ్ పల్సర్ కొత్త వెర్షన్ మన దేశంలో త్వరలో లాంచ్ కానుందని సమాచారం. అక్టోబర్ 16వ తేదీన ఈ బైక్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. ఇది చవకైన బైక్ అని తెలుస్తోంది.

New Bajaj Pulsar Launch: బజాజ్ ఆటో తన కొత్త పల్సర్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ బైక్‌ను పండుగ సీజన్‌లో అక్టోబర్ 16వ తేదీన కంపెనీ లాంచ్ కానుందని తెలుస్తోంది. మార్కెట్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ కొత్త బైక్ బజాజ్ పల్సర్ ఎన్125 కావచ్చని తెలుస్తోంది. బైక్ తయారీ కంపెనీకి చెందిన ఎన్ సిరీస్ కూడా మార్కెట్‌లో విజయాన్ని సాధించింది. దీంతో పాటు ఈ సిరీస్ బైక్‌లు అత్యంత చవకైన మోటార్‌సైకిళ్ల విభాగంలో వస్తాయి.

బజాజ్ కొత్త బైక్‌లో ప్రత్యేకత ఏమిటి?
బజాజ్ తన కొత్త పల్సర్‌ను ఫన్, అర్బన్ బైక్‌గా విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ బైక్ కొంచెం తక్కువ కెపాసిటీతో రావచ్చు. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం ఇది పల్సర్ ఎన్125 కావచ్చు. ఈ కొత్త బజాజ్ బైక్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో ప్రొజెక్టర్ లెన్స్ హెడ్‌ల్యాంప్‌లు ఉండవచ్చు. బైక్‌లో ట్విన్ స్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా అందించవచ్చని సమాచారం.

Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే

పల్సర్ ఎన్125 టాప్ ఫీచర్లు
బజాజ్ పల్సర్ ఎన్125 బ్లూటూత్ కనెక్టివిటీతో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందవచ్చు. కంపెనీ ఈ బైక్‌లో స్ప్లిట్ సీటును అందించగలదని తెలుస్తోంది. బైక్ వెనుక భాగంలో కూడా ఎల్ఈడీ లైట్లను ఉపయోగించవచ్చు. కొత్త బజాజ్ పల్సర్ 125 సీసీ, సింగిల్ సిలిండర్ మోటార్‌తో రావచ్చు. ఈ బైక్‌ను 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కు కనెక్ట్ చేసే అవకాశం ఉంది. బైక్‌లో స్పోర్ట్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉండవచ్చు. అదే సమయంలో ఈ బైక్ టాప్ వేరియంట్‌లో సింగిల్-ఛానల్ ఏబీఎస్‌ని చూసే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్‌కు కాంపిటీషన్ ఇవే...
భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ 125 డిస్క్ ఎక్స్ షోరూమ్ ధర రూ.92,883 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ ఎన్ సిరీస్‌లో వస్తే దాని కొత్త మోడల్ ఏ రేంజ్‌లో మార్కెట్లోకి ప్రవేశిస్తుందో చూడాలి. బజాజ్ పల్సర్ ఎన్125 లాంచ్ అయిన వెంటనే అనేక బైక్‌లతో పోటీ పడగలదు. ఈ మోటార్‌సైకిల్ హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, టీవీఎస్ రెయిడర్ 125, బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీలకు ప్రత్యర్థిగా మారవచ్చు. 

Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Radhika Apte : సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్

వీడియోలు

Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ
Hardik Pandya in India vs South Africa T20 | రికార్డులు బద్దలు కొట్టిన హార్దిక్
Suryakumar Yadav Batting Ind vs SA Series | బ్యాటర్‌గా విఫలమయ్యానన్న సూర్యకుమార్
India vs South Africa 5th T20 Highlights | సిరీస్ సొంతం చేసుకున్న భారత్
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Radhika Apte : సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
Highest Opening Day Collection In India: షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్‌ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?
షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్‌ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?
Actor Sreenivasan Death: మాలీవుడ్‌లో విషాదం... సీనియర్ నటుడు శ్రీనివాసన్ మృతి - బ్లాక్‌బస్టర్స్‌ తీసిన కుమారుడు
మాలీవుడ్‌లో విషాదం... సీనియర్ నటుడు శ్రీనివాసన్ మృతి - బ్లాక్‌బస్టర్స్‌ తీసిన కుమారుడు
Vrusshabha Tralier : 'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
Year Ender 2025: ప్రతి ఆర్మీ జవాన్‌ మీసం మెలేసే సంవత్సరం 2025; సాధించిన ఘనతలు చూస్తే గూజ్‌బంప్సే!
ప్రతి ఆర్మీ జవాన్‌ మీసం మెలేసే సంవత్సరం 2025; సాధించిన ఘనతలు చూస్తే గూజ్‌బంప్సే!
Embed widget