Audi Q7: ఆడీ కొత్త క్యూ7 వచ్చేస్తుంది.. పూర్తి ఫీచర్లు ఇవే.. రూ.ఐదు లక్షలతోనే!
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ఆడీ తన క్యూ7 కారును త్వరలో లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
ఆడీ క్యూ7 కారు కొద్దిరోజుల్లో మనముందుకు రానుంది. ఇప్పుడు కంపెనీ ఈ కార్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లను తెలిపింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. దీని బుకింగ్ అమౌంట్ రూ.5 లక్షలుగా ఉంది. ఇందులో 3.0 లీటర్ వీ6 టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ అందించారు. 340 హెచ్‌పీ, 500 ఎన్ఎం టార్క్ కూడా ఇందులో ఉన్నాయి.
ఆడీ డ్రైవ్ సెలెక్ట్, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు కూడా దీని ఎక్విప్‌మెంట్ లిస్ట్‌లో ఉన్నాయి. దీని ముందువెర్షన్ క్యూ7లో డీజిల్ ఇంజిన్ అందించారు. అయితే ఇప్పుడు లాంచ్ కానున్న క్యూ7లో వీ6 పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. దీంతో ఇది శక్తివంతమైన ఎస్‌యూవీ కానుంది.
ఇక టెక్నాలజీ విషయానికి వస్తే.. ఇందులో మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ అందించారు. లేన్ డిపార్చర్ వార్నింగ్, పార్క్ అసిస్ట్ ప్లస్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది లగ్జరీ ఎస్‌యూవీ కావడంతో ఇందులో ఆడీ వర్చువల్ కాక్‌పిట్, బీఅండ్ఓ ప్రీమియం 3డీ సౌండ్ సిస్టం, 4-జోన్ ఎయిర్ కండిషనింగ్, కాంటూర్ యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ఐజోనర్, అరోమటిజేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో ఈ కారు అందుబాటులోకి రానుంది.
2021లో ఆడీ మొత్తంగా 3,293 రిటైల్ యూనిట్లను మనదేశంలో విక్రయించింది. 2021 సేల్స్‌లో మొత్తంగా 101 శాతం పురోగతిని ఆడీ సాధించింది. ఈ కొత్త క్యూ7 కారును మనదేశంలోనే అసెంబుల్ చేయనున్నారు. అంటే ధర కూడా కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉంది. క్యూ5కి, క్యూ8కి మధ్యలో ఈ కారు ఉండనుంది.
ఆడీ క్యూ7 మనదేశంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కారు. ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ విభాగంలో ఉన్న బెస్ట్ కార్లలో ఇది కూడా ఒకటి. మనదేశంలో ఆడీ బ్రాండ్ సక్సెస్ అవ్వడంలో ముఖ్య కారణం క్యూ సిరీసే. కాబట్టి ఈ సిరీస్‌లో కంపెనీ లాంచ్ చేసే కార్లపై మంచి అంచనాలు ఉంటాయి.
Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?