New 2023 Toyota Innova: కొత్త ఇన్నోవాలో భారీ మార్పులు - ఈసారి ఆ మోడల్ ఉండదట!
2023లో లాంచ్ కానున్న కొత్త ఇన్నోవా మోడల్‌లో డీజిల్ వేరియంట్ లాంచ్ కాబోదని వార్తలు వస్తున్నాయి.
![New 2023 Toyota Innova: కొత్త ఇన్నోవాలో భారీ మార్పులు - ఈసారి ఆ మోడల్ ఉండదట! New 2023 Toyota Innova might not have a diesel know about its specifications and other details New 2023 Toyota Innova: కొత్త ఇన్నోవాలో భారీ మార్పులు - ఈసారి ఆ మోడల్ ఉండదట!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/27531fb86d8d600dc5662ba06602bb18_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
New 2023 Toyota Innova specifications: టొయోటా తన వినియోగదారులకు భారీ షాక్ ఇవ్వనుంది. టొయోటా ఇన్నోవా ఎంత ఫేమస్ మోడలో అందరికీ తెలిసిందే. అయితే త్వరలో లాంచ్ కానున్న ఇన్నోవా మోడల్‌లో డీజిల్ వేరియంట్ ఉండబోవడం లేదని తెలుస్తోంది. 2023లో ఈ మోడల్ లాంచ్ కానుంది.
దీనికి సంబంధించిన స్పై పిక్ కూడా ఇప్పటికే లీక్ అయింది. ఈ కొత్త ఇన్నోవా మోడల్ టెస్టింగ్‌లో కనిపించింది. టీఎన్‌జీఏ ప్లాట్‌ఫాం మీద ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోడ్‌లో ఈ కారు లాంచ్ కానుందని తలెుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇన్నోవాను ఐఎంవీ ప్లాట్‌ఫాంపై రూపొందించారు. టొయోటా ఫార్ట్యూనర్ కూడా ఇదే ప్లాట్‌ఫాంపై రూపొందించారు. ఇప్పుడు ఇన్నోవా మోడల్ ప్లాట్‌ఫాం కూడా మారనుందని తెలుస్తోంది.
దీని లేఅవుట్‌లో మార్పులు గమనిస్తే... ఇందులో ఎక్కువ స్పేస్ లభించనుంది. ఈ కొత్త ప్లాట్‌ఫాం రైడ్ క్వాలిటీతో పాటు కంఫర్ట్‌ను కూడా పెంచనుంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్నోవా కంటే టఫ్‌గా ఉంటుందా? అనే ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు.
దీంతోపాటు త్వరలో లాంచ్ కానున్న ఇన్నోవాలో డీజిల్ ఇంజిన్ వేరియంట్‌ను కంపెనీ అందించబోవడం లేదు. ఇన్నోవాలో డీజిల్ వేరియంట్ ఎంతో పాపులర్ అయిన మోడల్. ఇప్పుడు దీన్ని అందించబోవడం లేదు కాబట్టి...హైబ్రిడ్ పెట్రోల్ ఆప్షన్ అందించే అవకాశం ఉంది.
ఈ హైబ్రిడ్ పెట్రోల్ ఆప్షన్ వాహనం సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రస్తుతం ఉన్న ఇన్నోవా పెట్రోల్ వేరియంట్ కంటే పవర్‌ఫుల్‌గా హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్ పనిచేయనుంది. ఈ కొత్త ఇన్నోవా సైజు కూడా పెద్దగా ఉండనుంది. దీంతోపాటు లగ్జరియస్ ఫీచర్లను కూడా ఇందులో కంపెనీ అందించనుంది. సన్‌రూఫ్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.
అయితే ఈ వాహనం ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది కాబట్టి... కంపెనీ దీనికి మార్పులు కూడా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్నోవాకు... త్వరలో లాంచ్ అయ్యే ఇన్నోవాకు చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ డీజిల్ వేరియంట్ రాకపోతే... ఇన్నోవా మార్కెట్ ఏం అవుతుంది? ఎంత లేదనుకున్నా ఇన్నోవా కోర్ మార్కెట్‌పై దీని ప్రభావం కచ్చితంగా పడుతుంది.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)