![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
New Hyundai Verna: సరికొత్త హ్యుందాయ్ వెర్నా బుకింగ్స్ ఓపెన్, ఫీచర్లు, డిజైన్, ఇంజిన్ ప్రత్యేకతలు ఇవే!
హ్యుందాయ్ వెర్నా 2023 సరికొత్తగా అందుబాటులోకి రాబోతోంది. కూల్డ్ సీట్లు, సన్‌రూఫ్, లేటెస్ట్ ఫీచర్లతో అప్‌గ్రేడ్ అవుతున్న ఈ వెహికల్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
![New Hyundai Verna: సరికొత్త హ్యుందాయ్ వెర్నా బుకింగ్స్ ఓపెన్, ఫీచర్లు, డిజైన్, ఇంజిన్ ప్రత్యేకతలు ఇవే! New 2023 Hyundai Verna Bookings Open, Sedan Features New Styling Theme Check Details New Hyundai Verna: సరికొత్త హ్యుందాయ్ వెర్నా బుకింగ్స్ ఓపెన్, ఫీచర్లు, డిజైన్, ఇంజిన్ ప్రత్యేకతలు ఇవే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/14/07cbcef30dbdffa12063ea903af595281676381287548544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తాజా ఆటో ఎక్స్‌పో లో Ioniq 5ని ప్రారంభించిన కొద్దిసేపటికే, హ్యుందాయ్ న్యూ జెనరేషన్ వెర్నా సెడాన్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. ఈ సరికొత్త మోడల్ కొత్త స్టైలింగ్ థీమ్ తో రూపొందుతోంది. ఇంజన్ లైనప్ తో పాటు ఇంటీరియర్ పరంగానూ పలు మార్పులు చేర్పులతో అందుబాటులోకి రాబోతోంది. లేటెస్ట్ వెర్నా కోసం రూ. 25,000 చెల్లించి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Make a statement and take on the future in the all-new Hyundai VERNA. Bookings open.#Hyundai #HyundaiIndia #AllNewVerna #Futuristic #Ferocious #ILoveHyundai pic.twitter.com/1h3uitV0Vf
— Hyundai India (@HyundaiIndia) February 13, 2023
ఆకట్టుకునే డిజైన్, అత్యాధునిక ఫీచర్లు
హ్యుందాయ్ న్యూ జెనరేషన్ వెర్నా సెడాన్ చూడ చక్కని డిజైన్ తో ఆకట్టుకోనుంది.గత వెర్నాతో పోల్చితే మరింత పెద్దిగా ఉండబోతోంది. ముందు భాగంలో స్లిమ్ LED లైటింగ్‌తో పాటు కింద హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఇందులో పెద్ద గ్రిల్ ఉంటుంది. రూఫ్ లైన్ షార్ప్ క్యారెక్టర్ లైన్లతో పాటు కూపే లాగా లోపలికి వెళ్తుంది. వెనుక భాగంలో కనెక్ట్ అయ్యే LED లైట్లు కూడా ఉన్నాయి.
ఇక లోపల, హ్యుందాయ్ కొత్త వెర్నాకు పెద్ద టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో మరింత ప్రీమియం రూపాన్ని కలిగి ఉంటుంది. కూల్డ్ సీట్లు, సన్ రూఫ్, పవర్డ్ సీట్లు ఉండబోతున్నాయి. ADAS ఫీచర్లతో సరికొత్త వెర్నా అప్ డేట్ అవుతోంది. టక్సన్ తర్వాత ADASని పొందిన రెండవ హ్యుందాయ్ వాహనంగా కొత్త వెర్నా నిలువబోతోంది. .
ఇంజిన్ ప్రత్యేకతలు
పవర్ ట్రెయిన్‌ల పరంగా, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ (6MT), 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ (7DCT)తో కొత్త 1.5 టర్బో GDi పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఇది ప్రస్తుత 1.4 లీటర్ టర్బో పెట్రోల్ స్థానంలో ఉంది. ఇది ఇతర హ్యుందాయ్ కార్లలో కూడా ఉంటుంది. కొత్త వెర్నాలో అందుబాటులోకి వచ్చిన కొత్త 1.5లీటర్ టర్బో కూడా త్వరలో క్రెటాలో అందుబాటులోకి రాబోతోంది. కొత్త వెర్నా లైనప్ లో మాన్యువల్, CVT ఆటోమేటిక్‌తో కూడిన 1.5l నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉంటుంది. కొత్త వెర్నా నాలుగు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది. EX, S, SX, SX(O). ఇక రంగుల ఎంపికల విషయానికొస్తే, కొత్త వెర్నా 7 మోనోటోన్, 2 డ్యూయల్ టోన్ బయటి రంగు ఎంపికలలో 3 కొత్త మోనోటోన్ రంగులను కలిగి ఉంటుంది. అవి అబిస్ బ్లాక్ (న్యూ), అట్లాస్ వైట్ (న్యూ), టెల్లూరియన్ బ్రౌన్‌తో వస్తుంది. వచ్చే నెలలో ఈ కారు ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో హ్యుందాయ్ క్రెటాకు చోటు
జనవరిలో విక్రయించబడిన టాప్ 10 కార్ల జాబితాలో హ్యుందాయ్ క్రెటా స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో ఉన్న ఏకైక కొరియన్ మోడల్‌గా మిగిలింది. క్రెటా దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUVగా నిలిచింది. హ్యుందాయ్ గత నెలలో 15,037 యూనిట్ల అమ్మకాలను జరుపుకుంది. గత ఏడాది జనవరిలో విక్రయించిన 9,869 యూనిట్లు, డిసెంబర్‌లో విక్రయించిన 10,205 యూనిట్లతో పోలిస్తే అత్యధికం అని చెప్పుకోవచ్చు.
Read Also: 2023 ఆరంభంలో ‘మారుతీ’ జోరు - జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)