News
News
X

Cars Sold in January: 2023 ఆరంభంలో ‘మారుతీ’ జోరు - జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే!

2023 సంవత్సరాన్ని ఆటోమోటివ్ కంపెనీలు గ్రాండ్ గా మొదలు పెట్టాయి. జనవరిలో కార్ల అమ్మకాలు జోరుగా కొనసాగాయి. అత్యధిక అమ్మకాలు జరుపుకున్న టాప్ 10 కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

FOLLOW US: 
Share:

మారుతి సుజుకి 2023 సంవ్సరాన్ని జోష్ ఫుల్ గా మొదలుపెట్టింది. జనవరిలో విక్రయించబడిన టాప్ 10 కార్ల జాబితాలో 7 మోడళ్లు మారుతి కంపెనీవే కావడం విశేషం. అంతేకాదు, గత నెలలో ఆల్టో చార్ట్ టాపర్‌గా నిలిచి సత్తా చాటింది. దాని తర్వాత స్థానాన్ని WagonR దక్కించుకుంది. టాటా మోటార్స్ నెక్సాన్, పంచ్ SUVలు జనాదరణను కొనసాగిస్తున్నప్పటికీ, హ్యుందాయ్ మోటార్ బెస్ట్ సెల్లర్ క్రెటా ఈ జాబితాలో ఉన్న ఏకైక కొరియన్ మోడల్‌గా మిగిలింది. జనవరిలో దేశంలో విక్రయించబడిన టాప్ 10 కార్లలో ఏయే కార్లు చోటు దక్కించుకున్నాయో ఇక్కడ చూడండి. 

మారుతి ఆల్టో

మారుతి సుజుకి  అతి చిన్న హ్యాచ్‌బ్యాక్ అయిన కొత్త తరం ఆల్టో జనవరి అమ్మకాల జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. ఈ కార్ల తయారీ సంస్థ గత నెలలో 21,411 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 12,342 యూనిట్లను విక్రయించింది. అంటే 70 శాతం కంటే ఎక్కువ అమ్మకాలు పెరిగాయి. మారుతి గత సంవత్సరం కొత్త ఆల్టో హ్యాచ్‌బ్యాక్‌ను అనేక కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.3.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది.

మారుతి వ్యాగనార్

బాక్సీ వ్యాగనార్ హ్యాచ్‌బ్యాక్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. జనవరిలో 20,466 యూనిట్ల అమ్మకాలను జరిపింది. గత ఏడాది ఇదే నెలలో 20,334 యూనిట్లను విక్రయించింది. 

మారుతి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌ బ్యాక్ చిన్న కార్ల సెగ్మెంట్‌లో బలమైన ప్లేయర్‌గా కొనసాగుతోంది. ఇది జనవరిలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. మారుతి 16,440 యూనిట్లను విక్రయించింది. జనవరి, 2022లో ఇదే కార్ల అమ్మకం 19,108 యూనిట్లు ఉండగా ఇప్పుడు తగ్గింది. డిసెంబర్ నెలతో పోల్చితే జనవరిలో అమ్మకాలు ఎక్కువగానే జరిగాయి.

   

మారుతి బాలెనో

భారతదేశంలో విక్రయించబడుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో బాలెనో ఒకటి.  గత సంవత్సరం ప్రారంభించబడిన కొత్త తరం బాలెనో గత కొన్ని నెలల్లో అమ్మకాల్లో జోరందుకుంది. జనవరిలో మారుతీ 16,357 యూనిట్లను విక్రయించింది. గత నెలతో పోలిస్తే, గతేడాది జనవరిలో మారుతీ కేవలం 6,791 యూనిట్ల స్విఫ్ట్‌ను మాత్రమే విక్రయించింది.

టాటా నెక్సాన్

SUV సెగ్మెంట్‌లో Nexon అగ్రగామిగా కొనసాగుతోంది. ICE మరియు EV అవతార్‌లలో అందించబడిన నెక్సాన్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఐదవ కారుగా జనవరితో ముగిసింది. టాటా SUV యొక్క 15,567 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది ఇదే నెలలో 13,816 యూనిట్లు విక్రయించబడ్డాయి. డిసెంబర్‌లో విక్రయించిన 12,053 యూనిట్ల నుంచి అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి.

హ్యుందాయ్ క్రెటా

క్రెటా జనవరిలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUVగా నిలిచింది. హ్యుందాయ్  గత నెలలో 15,037 యూనిట్ల అమ్మకాలను జరుపుకుంది. గత ఏడాది జనవరిలో విక్రయించిన 9,869 యూనిట్లు, అలాగే డిసెంబర్‌లో విక్రయించిన 10,205 యూనిట్లతో పోలిస్తే అత్యధికం అని చెప్పుకోవచ్చు. 

మారుతీ బ్రెజా

గత సంవత్సరం ప్రారంభించబడిన కొత్త తరం బ్రెజా, నెక్సాన్ నుంచి సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో లీడర్‌గా కొనసాగుతోంది.  అయితే, SUV అమ్మకాల పరంగా వృద్ధిని కొనసాగిస్తోంది. కొత్త బ్రెజా జనవరిలో 14,359 అమ్మకాలు జరుపుకుంది. డిసెంబర్‌లో 11,200 యూనిట్లు విక్రయించబడ్డాయి. గత ఏడాది జనవరిలో, పాత తరం విటారా బ్రెజాగా విక్రయించబడినప్పుడు, మారుతి కేవలం 9,576 యూనిట్లను మాత్రమే అమ్మింది.

టాటా పంచ్

పంచ్ టాటా మోటార్స్ రెండవ బెస్ట్ సెల్లర్‌గా మిగిలింది. జనవరిలో ఈ అతి చిన్న SUV 12,006 యూనిట్లు డెలివరీ చేయబడింది. గత సంవత్సరం జనవరిలో, టాటా SUV  10,027 యూనిట్లను విక్రయించింది. డిసెంబరులో, పంచ్ 10,586 అమ్మకాలు జరుపుకుంది.

మారుతి ఈకో

Eeco గత నెలలో 11,709 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది. దీని అమ్మకాల్లో చాలా సంవత్సరాలుగా పెద్దగా హెచ్చుతగ్గులు లేవు. గత ఏడాది జనవరిలో, మారుతీ ఈకో 10,528 యూనిట్లను విక్రయించింది. డిసెంబర్‌లో 10,581 యూనిట్లను విక్రయించింది.

మారుతి డిజైర్

మారుతి డిజైర్ గత నెలలో 11,317 యూనిట్లను విక్రయించి, సెడాన్ సెగ్మెంట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. రెండవ బెస్ట్ సెల్లర్ హోండా అమేజ్ జనవరిలో 5,580 అమ్మకాలు జరుపుకుంది. గత ఏడాది ఇదే నెలలో మారుతి 14,967 యూనిట్లను విక్రయించగా, డిజైర్ విక్రయాలు తగ్గాయి. ఇది డిసెంబర్‌లో విక్రయించిన 11,997 యూనిట్ల కంటే స్వల్పంగా తగ్గింది.

Read Also: ఇండియాలో మరో ఆటో ఎక్స్‌పో - ఆసియాలోనే అతి పెద్దది, ఎప్పుడు? ఎక్కడో తెలుసా?

Published at : 07 Feb 2023 03:36 PM (IST) Tags: Tata Punch Maruti Cars sold in January Top 10 cars sold in January Alto WagonR

సంబంధిత కథనాలు

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Upcoming SUVs: వచ్చేస్తున్నాయ్ కొత్త కార్లు - రూ.15 లక్షలలోపు రాబోయే 4 SUVలు ఇవే!

Upcoming SUVs: వచ్చేస్తున్నాయ్ కొత్త కార్లు - రూ.15 లక్షలలోపు రాబోయే 4 SUVలు ఇవే!

Best Bikes: రూ.లక్షలోపు ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే - ఇది ఉంటేనే మోడర్న్ బైక్!

Best Bikes: రూ.లక్షలోపు ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే - ఇది ఉంటేనే మోడర్న్ బైక్!

Honda City: రూ.1.3 లక్షలు కట్టి హోండా సిటీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు - పూర్తి వివరాలు తెలుసుకోండి!

Honda City: రూ.1.3 లక్షలు కట్టి హోండా సిటీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు - పూర్తి వివరాలు తెలుసుకోండి!

Bikes For Beginner Riders: మీకు బైక్ రైడింగ్ ఇంట్రస్ట్ ఉందా? - అయితే ఈ ఐదు బిగినర్ బైక్స్‌పై ఓ లుక్కేయండి!

Bikes For Beginner Riders: మీకు బైక్ రైడింగ్ ఇంట్రస్ట్ ఉందా? - అయితే ఈ ఐదు బిగినర్ బైక్స్‌పై ఓ లుక్కేయండి!

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!