అన్వేషించండి

కొత్త Maruti Wagon Rలో 6 ఎయిర్‌బ్యాగులు, ఆశ్చర్యపరిచే మైలేజీ – రేటు రూ.5.79 లక్షలే!

Wagon R New Model: కొత్త మారుతి వ్యాగన్ R ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగులు, గొప్ప మైలేజ్ & తక్కువ ధరతో మధ్యతరగతి కుటంబాల మొదటి ఎంపికగా మారింది. ఈ కారు పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Maruti Wagon R 2025 Price, Mileage And Features In Telugu: కొత్త మారుతి వ్యాగన్ ఆర్ కారు మోడ్రన్‌ అప్‌డేట్స్‌తో మరింత స్టైలిష్‌గా మారింది. ఫ్రంట్‌ గ్రిల్‌, హెడ్‌ల్యాంప్స్‌ డిజైన్‌ ఈ కారుకు ప్రీమియమ్‌ లుక్‌ తీసుకొచ్చాయి. ఎలివేటెడ్‌ స్టాన్స్‌ & రూఫ్‌లైన్‌ ఈ హ్యాచ్‌బ్యాక్‌కు డైనమిక్‌ ప్రొఫైల్‌ను ఇస్తున్నాయి. కొత్త అలాయ్‌ వీల్స్‌ & క్లీన్‌ బాడీ లైన్స్‌ కారును మరింత ఆకర్షణీయంగా చూపిస్తున్నాయి. మారుతి సుజుకి, వ్యాగన్ R ను మరింత సురక్షితంగా మార్చింది. ఈ కారులోని ప్రతి వేరియంట్ ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందిస్తుంది, ఇది ఈ విభాగంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఇంకా.. ABS, EBD, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్ & రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్ల కూడా ఈ కారులో ఉన్నాయి. రూ. 6 లక్షల కంటే తక్కువ ధరలో, చాలా ఆధునిక భద్రతలు ఉండడం ఈ కారును చాలా ప్రత్యేకంగా చూపుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధర 
మారుతి వ్యాగన్ ఆర్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర (Maruti Wagon R 2025 ex-showroom price) రూ. 5.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్‌ వేరియంట్ రేటు రూ. 8.50 లక్షల వరకు ఉంటుంది. దీని CNG వేరియంట్ రూ. 7.15 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, ఇది మధ్య తరగతి కుటుంబాలకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌. 

ఆంధ్రప్రదేశ్‌ లేదా తెలంగాణ నగరాల్లో, మారుతి వ్యాగన్ R బేస్‌ వేరియంట్‌ను దాదాపు రూ. 6,93 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు (Maruti Wagon R 2025 on-road, Hyderabad Vijayawada) కొనవచ్చు.  ఆన్‌-రోడ్‌ ధరలో ఎక్స్‌-షోరూమ్ రేటుతో పాటు బండి రిజిస్ట్రేషన్‌, బీమా, ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉంటాయి.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?
వాగన్ R లో ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లే సపోర్ట్‌తో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది ప్రయాణంలో సరదా నింపుతుంది. ఇంకా.. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, ఆటో AC & డ్రైవర్ సీటు ఎత్తును సర్దుబాటు చేయగల ఫీచర్‌ వంటివి కూడా ఉన్నాయి.

ఇంజిన్ & పనితీరు
మారుతి వ్యాగన్ R మూడు రకాల పవర్‌ట్రెయిన్లతో అందుబాటులో ఉంది, ప్రతి కస్టమర్ తన అవసరాలకు అనుగుణంగా మెరుగైన ఇంజిన్‌ రకాన్ని ఎంచుకోవచ్చు. వీటిలో మొదటిది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది 65.68 bhp పవర్‌ను & 89 Nm పీక్‌ టార్క్‌ను ఇస్తుంది. రెండోది ఆప్షన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 88.5 bhp పవర్‌ & 113 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. మూడో ఎంపిక 1.0-లీటర్ CNG ఇంజిన్, ఇది 88 PS శక్తిని & 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు పెట్రోల్ ఇంజన్లూ 5-స్పీడ్ మాన్యువల్ & AMT ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్నాయి. CNG వేరియంట్ మాత్రం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఈ ఇంజిన్లన్నీ గొప్ప పనితీరును కనబరుస్తాయి. 

మైలేజ్
మైలేజ్ విషయానికి వస్తే... వ్యాగన్ R భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి & మధ్య తరగతి కుటుంబం ఆశించే అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. 

1.0-లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు సగటున 24.35 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది, AMT వెర్షన్ లీటరుకు 25.19 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. 

1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 23.56 కి.మీ. & AMT వేరియంట్ మైలేజ్ లీటరుకు 24.43 కి.మీ. మైలేజ్‌ ఇవ్వగలదు. 

CNG వేరియంట్ కిలోకు 34.05 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఇంధన సామర్థ్యం గల కార్లలో మారుతి వ్యాగన్ R ఒకటిగా నిలిచింది. తక్కువ ధర, గొప్ప మైలేజ్, నమ్మకమైన ఇంజిన్ & మునుపటి కంటే మెరుగైన భద్రతల కారణంగా, వ్యాగన్ R ఇప్పటికీ మధ్య తరగతి కుటుంబాల మొదటి ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Embed widget