Maruti Car Discount: ఈ మారుతి బడ్జెట్ కారుపై రూ.లక్ష వరకు తగ్గింపు - ఎలా కొనాలంటే?
Auto News in Telugu: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారుపై ట్యాక్స్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. సీఎస్డీ క్యాంటీన్ ద్వారా కొనుగోలు చేస్తే భారీ పన్ను రాయితీలు కూడా అందిస్తున్నారు.
Maruti Suzuki S-PRESSO Car: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌పై వినియోగదారులకు భారీ పన్ను రాయితీలు అందిస్తున్నారు. ఇది సీఎస్డీ ద్వారా దేశంలోని సైనికులకు కూడా అందుబాటులో ఉంది. ఆర్మీ క్యాంటీన్ నుంచి కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు భారీ పన్ను రాయితీలు లభిస్తాయి. ఈ కారణంగానే వినియోగదారులు సీఎస్డీ ద్వారా ఈ కారును చాలా చౌక ధరకు పొందుతున్నారు.
ఇప్పుడు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో క్యాంటీన్ ధరను మార్కెట్లో ఉన్న ఎక్స్ షోరూమ్ ధరలతో పోల్చుకుని చూద్దాం. సీఎస్డీ ఛానెల్ నుంచి ఈ కారును కొనుగోలు చేయడం ద్వారా దేశంలోని యువత ఎంత తగ్గింపు పొందవచ్చో చూడవచ్చు.
మారుతి ఎస్-ప్రెస్సో సీఎస్డీ, ఎక్స్ షోరూమ్ ధరలు ఎలా ఉన్నాయి?
మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్ మాన్యువల్ ఎస్టీడీ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.26 లక్షలుగా ఉంది. ఈ వేరియంట్‌ను సీఎస్‌డీలో కొనుగోలు చేస్తే దీని ధర రూ. 3.44 లక్షలుగా ఉంది. ఇది కాకుండా మనం ఎల్ఎక్స్ఐ వేరియంట్ గురించి చెప్పాలంటే దాని ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.01 లక్షలుగా ఉంది. సీఎస్డీలో ఈ కారు విలువ రూ. 4.1 లక్షలుగా ఉంది. ఇది మాత్రమే కాకుండా వీఎక్స్ఐ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.21 లక్షలుగానూ, సీఎస్డీ ధర రూ. 4.27 లక్షలుగా ఉంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే!
ఏ వేరియంట్‌పై ఎంత తగ్గింపు లభిస్తుంది?
వీఎక్స్ఐ ప్లస్ వేరియంట్ గురించి చెప్పాలంటే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.5 లక్షలుగా ఉంది. దీని సీఎస్డీ ధర రూ. 4.52 లక్షలుగా ఉంది. 1.0 లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్‌లో వీఎక్స్ఐ (వో) వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.66 లక్షలు కాగా, సీఎస్‌డీ వెర్షన్ ధర రూ.4.63 లక్షలుగా నిర్ణయించారు.
దాని వీఎక్స్ఐ ప్లస్ (వో) వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.95 లక్షలు కాగా, సీఎస్డీ ధర రూ. 4.88 లక్షలుగా ఉంది. 1.0 లీటర్ సీఎన్‌జీ మాన్యువల్ వేరియంట్ రూ. 6.11 లక్షలు కాగా, సీఎస్డీ ధర రూ. 5.03 లక్షలుగా నిర్ణయించారు. ఈ విధంగా సీఎస్డీలో కొనుగోలు చేస్తే రూ. లక్ష వరకు తగ్గనుంది.
మారుతి ఎస్-ప్రెస్సో మాన్యువల్ వేరియంట్లు లీటరుకు 24.76 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్ లీటరుకు 25.30 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఇది ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్... అంటే మైలేజ్ పరంగా ఇది అద్భుతమైన కారు అన్న మాట. ఎస్-ప్రెస్సో పొడవు 3,565 మిల్లీమీటర్లు కాగా, ఎత్తు 1,567 మిల్లీమీటర్లుగానూ, వెడల్పు 1520 మిల్లీమీటర్లుగానూ ఉంది.
Our First-aid Trauma Care training has equipped 8,500 people primarily commercial drivers to become first responders during the 'golden hour' after accidents. With these initiatives, we're taking small steps in Road Safety to make a difference for all road users @MORTHIndia (2/2)
— Maruti Suzuki (@Maruti_Corp) August 30, 2024
Also Read:మీరు కారు వాడుతున్నారా? ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే రూ.వేలు ఆదా చేయొచ్చు!