By: ABP Desam | Updated at : 07 Jun 2023 05:43 PM (IST)
మారుతి సుజుకి జిమ్నీ ఐదు డోర్ల వేరియంట్ మార్కెట్లో లాంచ్ అయింది. ( Image Source : Maruti Suzuki )
Maruti Suzuki Jimny: ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత మారుతి సుజుకి తన ఆఫ్ రోడింగ్ కారు మారుతి సుజుకి జిమ్నీని విడుదల చేసింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని రూ. 12.7 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది పెట్రోల్ మాన్యువల్ వేరియంట్. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.15.05 లక్షలుగా ఉంది. ఇది పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్.
మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్ వేరియంట్స్
జిమ్నీ జీటా, ఆల్ఫా ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఇది 105 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేసే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లాంచ్ కానుంది. అలాగే ఇది 4x4 SUV మోడల్. జిమ్నీ భారతదేశంలో 5 డోర్ల కాన్ఫిగరేషన్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఈ లుక్‌తో ఇది 2023 ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో ప్రవేశించింది. అంతర్జాతీయంగా జిమ్నీ 3 డోర్లతో లాంచ్ అయింది. ఈ కారు ఐదు సింగిల్ టోన్, రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.
మారుతి సుజుకి జిమ్నీ ఫీచర్లు
ఈ ఆఫ్ రోడ్ కారులో 9 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇది స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto కనెక్టివిటీని సపోర్ట్ చేయనుంది. ఆర్కమిస్ ఆడియో సిస్టం, క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, LED హెడ్‌ల్యాంప్‌లు కూడా ఈ కారులో ఉన్నాయి.
వీటితో పాటు ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, పవర్ విండోలు, వెనుక కెమెరా, ఈఎస్‌పీ వంటి మరిన్ని ఫీచర్లు పొందుతారు. మారుతి కొంతకాలం క్రితం జిమ్నీ 5 డోర్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. కంపెనీ ఈ కారును నెక్సా షోరూమ్‌ల ద్వారా విక్రయించనుంది. మారుతి సుజుకి జిప్సీ తర్వాత చాలా కాలానికి తిరిగి ఆఫ్ రోడర్ కార్లను లాంచ్ చేసింది.
మహీంద్రా థార్‌తో డైరెక్ట్‌గా పోటీ
మహీంద్రా థార్‌తో మారుతి సుజుకి జిమ్నీ నేరుగా పోటీపడుతుంది. అయితే థార్ 3 డోర్లతో అందుబాటులో ఉంది. జిమ్నీ 5 డోర్ మోడల్ ఒక భయంకరమైన ఆఫ్-రోడర్ అని చెప్పాలి. రోజువారీ వినియోగానికి అవసరమైన ఫీచర్లను కూడా ఇందులో అందించారు.
మారుతి సుజుకి కొత్త కారు ఇన్నోవా హైక్రాస్ బేస్డ్ ప్రీమియం 2023 జులైలో లాంచ్ కాబోతోంది. పవర్‌ట్రెయిన్ నుంచి ఫీచర్ల వరకు ప్రతిదీ ఇన్నోవా హైక్రాస్ నుండి నేరుగా లిఫ్ట్-ఆఫ్ అవుతుంది. సుజుకి లోగో మినహా ఇంటీరియర్ ఒకే విధంగా ఉంటాయి. అయితే ఎక్టీరియర్ డిజైన్‌లో చిన్న మార్పులు ఉండవచ్చు. భారతీయ ప్రీమియం MPVలో అత్యంత ఖరీదైన వాహనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
టాటా పంచ్‌ను లక్ష్యంగా చేసుకుని హ్యుందాయ్ ఎక్స్ టర్ ను కంపెనీ తీసుకొస్తుంది. పలు నివేదికల ప్రకారం ఈ మైక్రో-SUV ఆగస్ట్ 2023లో లాంచ్ కానుంది. హ్యుందాయ్ SUV లైనప్ దిగువన దీనిని రూపొందించారు. ఇది 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఫరర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ 1.0-లీటర్ tGDi పెట్రోల్ యూనిట్‌తో అందించబడుతుంది. CNG ఇంధన ఎంపికలో కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?
2023 Hyundai i20 N Line: కొత్త హ్యుందాయ్ ఐ20 లాంచ్ - ధర రూ.10 లక్షలలోపే!
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
Car Buying Tips: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు తెలుసుకోండి
Tata Motors: బ్యాడ్ న్యూస్ - ఈ టాటా వాహనాల ధరలు మూడు శాతం పెంపు!
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
/body>