హైలీ పాపులర్ Maruti Grand Vitara కొంటున్నారా?, - ఈ కారుపై ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చే గైడ్ ఇదిగో!
Maruti Grand Vitara Features: అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్‌సైజ్ SUV గ్రాండ్ విటారా ధర, మైలేజ్, ఫీచర్లు, పోటీ కార్లకు సంబంధించిన ప్రతి ప్రశ్నకు ఈ కథనంలో సమాధానం దొరుకుతుంది.

Maruti Grand Vitara Price, Mileage And Features In Telugu: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్‌సైజ్ SUVలలో గ్రాండ్ విటారా ఒకటి. మారుతి సుజుకి బ్రాండ్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ SUV ఇదే. ధరలు పోటీ స్థాయిలో ఉండటం, ఫీచర్లు అధికంగా ఉండటం, బ్రాండ్ పేరు, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్ వంటివి గ్రాండ్ విటారా విజయ రహస్యాలు. మీరు ఈ SUV కొనే ప్లాన్‌లో ఉంటే, ఈ కారు గురించి ఎక్కువ మందికి అడిగే ప్రశ్నలు - వాటికి సమాధానాలు ఇవిగో...
మారుతి గ్రాండ్ విటారా ధర ఎంత?
బేస్ వేరియంట్ సిగ్మా పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 11.42 లక్షలు. టాప్-ఎండ్ ఆల్ఫా+(O) స్ట్రాంగ్ హైబ్రిడ్ ధర రూ. 20.52 లక్షలు. పెట్రోల్ వేరియంట్‌ల ధరలు రూ. 11.42 లక్షల నుంచి రూ. 19.64 లక్షల వరకు ఉంటాయి. మినిమమ్ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 13.93 లక్షలు. గ్రాండ్ విటారా CNG ధర రూ. 13.48 లక్షల నుంచి రూ. 15.62 లక్షల వరకు ఉంటుంది. సగటు హైబ్రిడ్ వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు. కొన్నిసార్లు, కంపెనీ డిస్కౌంట్లు కూడా ఇస్తుంది.
మారుతి గ్రాండ్ విటారా ఇంజిన్ ఆప్షన్లు ఏమిటి?
గ్రాండ్ విటారా మూడు ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది
- 103hp 1.5 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ (మైల్డ్-హైబ్రిడ్)
- 89hp 1.5 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్-CNG
- 116hp (కాంబైన్డ్) 1.5 లీటర్ 3-సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్
CNG వేరియంట్లలో కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది. హైబ్రిడ్‌లో e-CVT ఆటోమేటిక్ మాత్రమే ఉంటుంది. పెట్రోల్ వేరియంట్‌లు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటో గేర్‌బాక్స్‌తో వస్తాయి. ముఖ్యంగా, ఆల్ఫా, ఆల్ఫా(O) ట్రిమ్‌లలో AWD ఆప్షన్ కూడా లభిస్తుంది.
మారుతి గ్రాండ్ విటారాలో సన్‌రూఫ్ ఉందా?
జెటా(O) ట్రిమ్ నుంచి (రూ. 15.27 లక్షల ధర) గ్రాండ్ విటారాలో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. అదనంగా:
- 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్
- 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే
- 4 స్పీకర్లు + 2 ట్వీటర్లు
- ఎలక్ట్రిక్ డ్రైవర్ సీటు
- హెడప్ డిస్‌ప్లే
- 360 డిగ్రీల కెమెరా
- వైర్‌లెస్ ఛార్జర్, అంబియెంట్ లైటింగ్
- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
- ఆటో క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్, లెదరేట్ సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయి.
మారుతి గ్రాండ్ విటారా మైలేజ్ ఎంత?
ARAI ప్రకారం, హైబ్రిడ్ వేరియంట్ 27.97 kmpl ఇస్తుంది. వాస్తవంగా సిటీ లో 23.77 kmpl, హైవేపై 20.39 kmpl వస్తుంది. అంటే, సగటు మైలేజ్ 22.08 kmpl.
- CNG వేరియంట్ మైలేజ్ - 26.6 km/kg
- పెట్రోల్ వేరియంట్ మైలేజ్
- మాన్యువల్ - 21.11 kmpl
- ఆటోమేటిక్ - 20.58 kmpl
- AWD ఆటో - 19.20 kmpl
- రియల్ డ్రైవింగ్ టెస్టుల్లో పెట్రోల్ ఆటో FWD సిటీలో 11.6 kmpl, హైవేలో 15.3 kmpl ఇచ్చింది.
హైబ్రిడ్ వెర్షన్ కొనాలా, లేక పెట్రోల్ వెర్షన్ కొనాలా?
మీరు మైలేజీకి ప్రాధాన్యం ఇస్తే హైబ్రిడ్ బెస్ట్. హైబ్రిడ్ వేరియంట్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. టాప్ హైబ్రిడ్ ట్రిమ్ (ఆల్ఫా+(O))లో డ్రైవ్ మోడ్‌లు, బ్లాక్ ఇంటీరియర్ డిజైన్, అదనపు ఫీచర్లు ఉంటాయి.
పెట్రోల్ వేరియంట్ ప్రయోజనాలు ఏంటి?
- ఎక్కువ బూట్ స్పేస్ (పెట్రోల్‌లో 373 లీటర్లు, హైబ్రిడ్‌లో 265 లీటర్లు)
- AWD ఆప్షన్
- తక్కువ ధర - హైబ్రిడ్‌తో పోలిస్తే పెట్రోల్ వెర్షన్ రూ. 3 లక్షల వరకు చౌకగా ఉంటుంది
మారుతి గ్రాండ్ విటారా vs హ్యుందాయ్ క్రెటా కంటే పెద్దదా?
గ్రాండ్ విటారా పొడవు 4345mm, వెడల్పు 1795mm, ఎత్తు 1645mm, వీల్‌బేస్ 2600mm. ఇది క్రెటా కంటే పొడవుగా, వెడల్పుగా, ఎత్తుగా ఉంటుంది.
మారుతి గ్రాండ్ విటారా vs బ్రెజ్జా కంటే బెటరా?
గ్రాండ్ విటారా బ్రెజ్జా కూడా కంటే పెద్దది. ఇంటీరియర్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ రెండు వేరియంట్‌లలోనూ ఒకే ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ బ్రెజ్జాలో బెటర్‌గా పని చేస్తుంది, ఎందుకంటే అది తక్కువ బరువున్న SUV. బ్రెజ్జా టాప్ వేరియంట్ ధర రూ. 13.98 లక్షలు. అదే ధరలో గ్రాండ్ విటారా ఎంట్రీ వేరియంట్ వస్తుంది. కాబట్టి బడ్జెట్‌ను బట్టి బ్రెజ్జా బెటర్.
మారుతి గ్రాండ్ విటారా నుంచి మైలేజ్ కోరుకునేవారికి హైబ్రిడ్ వెర్షన్ బెస్ట్, బడ్జెట్ కోరుకునే కస్టమర్లకు పెట్రోల్ వేరియంట్లు సరైనవి. ఫీచర్లు, ధర, బ్రాండ్ విలువ అన్నీ కలిసి గ్రాండ్ విటారాను మిడ్‌సైజ్ SUVల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి.




















