Maruti Baleno ధర రూ.6 లక్షల కంటే తక్కువ, GST తగ్గింపుతో పాటు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా!
GST Reforms 2025: భారత మార్కెట్లో, Tata Altroz, Hyundai i20, Toyota Glanza & Maruti Swift వంటి కార్లతో Maruti Baleno పోటీ పడుతుంది, ఇవన్నీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగం కార్లు.

Maruti Baleno New GST Price Diwali 2025 Offers: మారుతి బాలెనో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి . మీరు ఈ పండుగ సీజన్‌లో మారుతి బాలెనో కొనాలని ప్లాన్ చేస్తుంటే , ఇది మంచి అవకాశం కావచ్చు. నిజానికి, GST తగ్గింపు తర్వాత, మారుతి బాలెనో కొనుగోలు మునుపటి కంటే మరింత అందుబాటులోకి వచ్చింది. అందువల్ల, కొనే ముందు కొత్త ధర, ఫీచర్లు & మైలేజ్ గురించి తెలుసుకోవడం ముఖ్యం.
మారుతి బాలెనోపై GST రేటు 28% నుంచి 18% కి తగ్గింది. తత్ఫలితంగా, బాలెనో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు కేవలం ₹5.99 లక్షలు (Maruti Baleno ex-showroom price, Hyderabad Vijayawada) గా మారింది.
వేరియంట్ వారీగా, మారుతి బాలెనో ఇప్పుడు ఎంత చవక?
మారుతి బాలెనో సిగ్మా వేరియంట్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు ₹5.99 లక్షలు కాగా, డెల్టా వేరియంట్ ధర ₹6.79 లక్షలు. డెల్టా CNG వేరియంట్ ధర ₹7.69 లక్షలు, జీటా CNG వేరియంట్ ధర ₹8.59 లక్షలు. ఇంకా, ఈ నెల (అక్టోబర్ 2025) చివరి వరకు ఈ కారుపై ₹70,000 వరకు అదనపు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
మారుతి బాలెనో ఫీచర్లు
మారుతి బాలెనోలో ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ ఫీచర్లు చాలా వరకు టాప్-స్పెక్ మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉండటం గమనించదగ్గ విషయం. ఇంజిన్ ఆప్షన్లలో... 1.2-లీటర్, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది పని చేస్తుంది. ఈ ఇంజిన్ 89 bhp & 113 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. CNG మోడ్‌లో ఈ ఇంజిన్ 76 bhp పవర్ & 98.5 Nm టార్క్‌ను జనరేట్ చేయగలదు.
మారుతి బాలెనో ఎంత మైలేజ్ ఇస్తుంది?
సాధారణంగా, మారుతి కారు అంటేనే మైలేజ్‌కు పెట్టింది పేరు. బాలెనో కూడా ఈ విషయం నిరుత్సాహపరచదు. కంపెనీ లెక్క ప్రకారం, CNG వెర్షన్ కిలోగ్రాముకు 30.61 కిలోమీటర్ల వరకు మైలేజీని (Maruti Baleno CNG Mileage) ఇస్తుంది. పెట్రోల్ (మాన్యువల్) వేరియంట్ లీటరుకు 21.01 నుంచి 22.35 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ (Maruti Baleno Petrol Mileage) అందిస్తుంది. ఆటోమేటిక్ మోడ్‌లో, ఇది లీటరుకు 22.94 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు.
Maruti Baleno కు 37 లీటర్ల పెట్రోల్ & 55 లీటర్ల CNG ట్యాంక్ సామర్థ్యం ఉంది. ఈ రెండిటినీ ఫుల్ ట్యాంక్ చేస్తే, మైలేజ్ లెక్క ప్రకారం, ఏకబిగిన 1,200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
ప్రస్తుత మార్కెట్‌లో... టాటా ఆల్ట్రోజ్ , హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా & మారుతి స్విఫ్ట్ వంటి వాటితో మారుతి బాలెనో పోటీ పడుతోంది. ఇవన్నీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి వస్తాయి.





















