Maruti Alto K10 vs Renault Kwid - GST తగ్గింపుతో ఏ కారు ధర ఎక్కువ తగ్గుతుంది?
GST Car Price Cut: తక్కువ రేటులో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మార్కెట్లో మీకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మారుతి ఆల్టో K10 & రెనాల్ట్ క్విడ్ వంటి పేర్లు కూడా ఉన్నాయి.

Maruti Alto K10 vs Renault Kwid - Price Comparison: జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత, ఇప్పుడు, కలల కారు కొనడం కొంచెం సులభంగా మారింది. కొత్త జీఎస్టీ స్లాబ్ కింద, 1200 సిసి కంటే తక్కువ పెట్రోల్ & 1500 సిసి కంటే తక్కువ డీజిల్ ఇంజిన్లు కలిగిన కార్లపై & 4 మీటర్ల కంటే తక్కువ పొడవు గల కార్లపై గూడ్స్ & సర్వీస్ టాక్స్ తగ్గించారు. గతంలో, ఈ కేటగిరీ వాహనాలపై 28% జీఎస్టీ విధించారు, ఇప్పుడు దానిని 18% కు ట్రిమ్ చేశారు. దేశంలోనే అత్యంత చవకగా వచ్చే మారుతి ఆల్టో కె10 & రెనాల్ట్ క్విడ్ కార్లు, జీఎస్టీ ట్రిమ్మింగ్ తర్వాత మరింత చౌకగా మారాయి.
మారుతి ఆల్టో K10 vs రెనాల్ట్ క్విడ్: ధరలు
తెలుగు రాష్ట్రాల్లో, మారుతి ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.23 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది & వేరియంట్‌ను బట్టి ఇది రూ. 6.21 లక్షల వరకు ఉంది.
రెనాల్ట్ క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.67 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది & వేరియంట్‌ను బట్టి ఇది రూ. 6.45 లక్షల వరకు ఉంది.
ఈ ఫెస్టివ్ సీజన్‌లో మారుతి ఆల్టో K10 కొనే ప్లాన్ చేస్తుంటే, దాని CNG వెర్షన్ VXI (O) మీకు మంచి డీల్ కావచ్చు, ధర విషయంలో ఇది గరిష్ట పొదుపు చేస్తుంది. అదే సమయంలో, పెట్రోల్ వేరియంట్లలో కూడా రూ. 35,000 నుంచి రూ. 44,000 వరకు తగ్గింపు ఉంటుంది. తక్కువ బడ్జెట్ ఉన్నవారికి, Alto Std & LXi వేరియంట్లు ఇప్పుడు మరింత అందుబాటులోకి వచ్చాయి.
రెనాల్ట్ క్విడ్ కొనాలని మీరు ఆలోచిస్తుంటే, దీని 1.0 పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ RXT పై గరిష్టంగా రూ. 55,095 తగ్గింపు ఇస్తున్నారు.
మారుతి ఆల్టో K10 vs రెనాల్ట్ క్విడ్: ఫీచర్లు
మారుతి ఆల్టో K10 ఆపిల్ కార్ ప్లే & ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ & డిజిటలైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ కారులో, ప్రయాణీకుల భద్రత కోసం డ్యూయల్ (రెండు) ఎయిర్ బ్యాగులు, EBD తో ABS & రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఇంకా చాలా మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి.
రెనాల్ట్ క్విడ్ ఆపిల్ కార్ ప్లే & ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు వైపులా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు & 14 అంగుళాల చక్రాలు ఇచ్చారు. దీంతో పాటు, కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ AC & ఎలక్ట్రిక్ ORVM, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, EBD తో ABS & రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి లక్షణాలతో అందుబాటులో ఉంది.
మారుతి ఆల్టో K10 vs రెనాల్ట్ క్విడ్: పవర్
రెనాల్ట్ క్విడ్ 1 లీటర్, 3 సిలిండర్, పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 67 bhp శక్తిని & 91 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్టో K10 హ్యాచ్‌బ్యాక్‌లోని ఇంజిన్ 65 bhp గరిష్ట శక్తిని & 89 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.





















