రూ.87,000 లకే 2025 Suzuki Access - వెరైటీ వేరియంట్లు, మంచి మైలేజ్ దీని స్పెషల్ హైలైట్స్
2025 Suzuki Access రూ. 86,592 నుంచి రూ. 1,04,693 లక్షల వరకు లభిస్తోంది. కొత్త వేరియంట్లు, స్టైలిష్ డిజైన్, E20 కంప్లైంట్ ఇంజిన్, బెటర్ మైలేజ్‌తో ఇది యువతకు టాప్ ఆప్షన్‌గా మారింది.

Suzuki Access Price, Mileage, Features In Telugu: తెలుగు రాష్ట్రాల్లో, Suzuki Access 125 పేరు నమ్మకమైన స్కూటర్‌కు ప్రత్యామ్నాయంగా వినిపిస్తుంటుంది. 2007లో మొదటిసారి లాంచ్ అయినప్పటి నుంచి, ఈ స్కూటర్ యువత, ఫ్యామిలీ యూజర్ల మనస్సులు గెలుచుకుంటూ బెస్ట్ సెల్లర్‌గా కొనసాగుతోంది. ఇప్పుడు, 2025 Suzuki Access కొత్త అప్‌డేట్స్‌తో వచ్చింది. ఇంజిన్, చాసిస్, డిజైన్‌లో మార్పులు చేసి మరింత ఆకర్షణీయంగా మార్చారు. 2025లో కొత్త యూజర్ అనుభవాలు, మెరుగైన ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరలతో తిరిగి వచ్చిన సుజుకీ యాక్సెస్ - స్టైల్, పెర్ఫార్మెన్స్, కనెక్టివిటీ అన్నింటికీ స్పెషల్ ఆఫర్. మీరు వెతుకునే అన్ని టెక్ ఫీచర్లు ఈ కొత్త యాక్సెస్‌లో ఉన్నాయి.
లుక్ & టెక్నాలజీ
కొత్త 2025 Suzuki Access 125 లో మెటల్ ఫ్రంట్ ఫెన్డర్, మెటల్ లెగ్ షీల్డ్ వంటివాటిని కంపెనీ వాడింది, ఇది మెరుగైన మన్నిక ఇవ్వడంతో పాటు రిపేర్‌కూ సులభంగా ఉంటుంది. బాడీ ప్యానల్స్ ముందు భాగంలో క్రీసెస్, ఈవెనింగ్ లైటింగ్, LED హెడ్‌లైట్, LED టెయిల్ లైట్ ఉన్నాయి. అదనంగా, డిస్‌ప్లే బోర్డును పెద్దదిగా, ప్రీమియం లుక్ ఇచ్చేలా డిజైన్ చేశారు. ఫ్రేమ్ టార్షనల్ రిజిడిటీ 25% పెంచారు, ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఇది రోడ్డుపై మెరుగైన స్థిరత్వం ఇస్తుంది. సస్పెన్షన్ ఇప్పుడు టెలిస్కోపిక్ ఫోర్క్ ముందుగా, మోనోషాక్ వెనుకగా మార్చారు. ముందు వైపు 12-అంగుళాల చక్రం, వెనుక 10-అంగుళాల చక్రం సెటప్ ఉంది.
వేరియంట్లు
కొత్త Suzuki Access 2025లో మొత్తం నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి:
Standard - డ్రమ్ బ్రేకులు, స్టీల్ వీల్స్‌తో వచ్చిన బేసిక్ ఆప్షన్ ఇది.
Special - ఫ్రంట్ డిస్క్ బ్రేక్, అలాయ్ వీల్స్‌తో అదనపు స్టైల్ ఆపాదిస్తుంది.
Ride Connect - స్పెషల్ మోడల్ ఫీచర్లతో పాటు, Bluetooth కనెక్టివిటీ కలిగిన LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది.
Ride Connect TFT - టాప్-ఎండ్ వేరియంట్ ఇది, హై-రెజల్యూషన్ TFT కలర్ డిస్‌ప్లేతో స్టైలిష్ లుక్ ఇస్తుంది.
కలర్ ఆప్షన్లు
అన్ని వేరియంట్లలో బ్లాక్, బ్లూ, బేజ్ కలర్స్ లభిస్తున్నాయి. స్పెషల్, రైడ్ కనెక్ట్, రైడ్ కనెక్ట్ TFTలో గ్రీన్ కలర్ కూడా లభిస్తుంది. రైడ్ కనెక్ట్ TFT వేరియంట్‌కి ప్రత్యేకంగా కొత్త బ్లూ షేడ్ అందుబాటులో ఉంది.
ఇంజిన్
124cc, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో ఇది పని చేస్తుంది. 6500 rpm వద్ద సుమారు 8.4 PS పవర్, 5000 rpm వద్ద 10.2 Nm టార్క్ ఇస్తుంది. గత జెనరేషన్‌తో పోలిస్తే టార్క్ మెరుగుపడింది, ఇది సిటీ ట్రాఫిక్‌లోనే రైడ్‌ను సాఫీగా మారుస్తుంది.
E20 ఫ్యూయల్
2025 Suzuki Access, E20 ఫ్యూయల్‌కు అనుకూలమైన ఇంజిన్‌తో వచ్చింది. అంటే ఇది ఎకో-ఫ్రెండ్లీగా ఉండే ఎథనాల్ మిశ్రమ పెట్రోల్‌ని కూడా హ్యాండిల్ చేయగలదు.
మైలేజ్
రైడర్ల అనుభవవాలను బట్టి, సుజుకి యాక్సెస్ 125 సిటీ ట్రాఫిక్‌లో లీటరుకు 52 km, హైవే మీద లీటరుకు 58 km మైలేజ్ ఇచ్చింది. అదనంగా, ఆటో స్టార్ట్/స్టాప్ ఫీచర్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీని మరింత మెరుగుపరుస్తుంది. రోజువారీ ప్రయాణాలకు ఈ మైలేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది, డబ్బును సేవ్ చేస్తుంది.
ధర
2025 Suzuki Access 125 ధర రూ. 86,592 నుంచి మొదలై, రూ. 1,04,693 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్). వేరియంట్, ఫీచర్ల ఆధారంగా ధరల్లో మార్పు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బేస్ వేరియంట్‌ను దాదాపు రూ. 1.08 లక్షల ఆన్-రోడ్ ధరకు కొనవచ్చు.
Suzuki Access 2025 అనేది స్టైల్, ఫీచర్లు, మైలేజ్ కలిపిన పర్ఫెక్ట్ స్కూటర్. కొత్త వేరియంట్లు, కలర్ ఆప్షన్లు, కనెక్టివిటీ ఫీచర్లతో యువతకు మోడ్రన్ టచ్ ఇస్తోంది. అదే సమయంలో E20 కంప్లైంట్ ఇంజిన్, బెటర్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీతో ఫ్యామిలీ యూజర్లకు కూడా బెటర్ ఆప్షన్‌గా నిలుస్తోంది.





















