New Mahindra XUV300: మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ త్వరలో మార్కెట్లో - ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా!
Mahindra New Car: మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారు త్వరలో లాంచ్ కానుంది.
Mahindra XUV300 Facelift: మహీంద్రా తన ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇది రాబోయే వారాల్లో మార్కెట్లోకి రానుంది. ఈ ప్రధాన అప్‌డేటెడ్ మోడల్‌ను పరిచయం చేయడానికి ముందు, బ్రాండ్ ఇప్పటికే ఉన్న ఎక్స్‌యూవీ300 లైనప్‌ను "ర్యాంప్ డౌన్" చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఎక్స్‌యూవీ300 లైనప్ డిమాండ్‌కు అనుగుణంగా సర్దుబాటు చేయబడుతుంది.
వేరియంట్లు, బుకింగ్
ప్రస్తుతం ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో మొత్తం 16 పెట్రోల్, తొమ్మిది డీజిల్ వేరియంట్‌లు ఉన్నాయి. అయితే ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ వేరియంట్లు, పవర్‌ట్రెయిన్ లైనప్ గురించి సమాచారం ఇంకా అందుబాటులో లేదు. మహీంద్రా ప్రస్తుతం ఉన్న ఎక్స్‌యూవీ300 బుకింగ్ కెపాసిటీ కాస్త తగ్గనుందని ప్రకటించింది. ఇందులో ప్రస్తుతం తక్కువ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌యూవీ300, ఎక్స్‌యూవీ400 ఈవీలు ప్రస్తుతం 9,000 కంటే తక్కువ పెండింగ్ బుకింగ్‌లను కలిగి ఉన్నాయి. ఇవి అప్‌డేట్ చేసిన ఎస్‌యూవీ వచ్చే సమయానికి క్లియర్ అవుతాయని భావిస్తున్నారు.
ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్‌లో కొత్తగా ఏం ఉండనుంది?
ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్‌కి సంబంధించిన అనేక స్పై షాట్‌లు ఈ వాహనానికి అనేక అప్‌గ్రేడ్‌లు జరుగుతాయని చూపించాయి. ఎక్స్‌యూవీ700 లైనప్, రాబోయే బోర్న్ ఈవీ రేంజ్ వంటి కొత్త మహీంద్రా మోడళ్లను పోలి ఉండే కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇంటీరియర్‌కి కూడా కొత్త అప్హోల్స్టరీ, మరిన్ని ఫీచర్లతో కొత్త లుక్ ఇవ్వనున్నారు. క్యాబిన్‌కు సంబంధించిన ప్రధాన అప్‌డేట్‌లో ఒకటి కాదు, రెండు 10.25-అంగుళాల స్క్రీన్‌లు ఉంటాయి. వీటిలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం కాగా, మరొకటి ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం. రాబోయే ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లు గత నెలలో లాంచ్ అయిన అప్‌డేటెడ్ ఎక్స్‌యూవీ400 ఈవీలో ఇప్పటికే కనిపిస్తున్నాయి.
ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు ఏవీ చేసేలా కనిపించలేదు. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లు అలాగే కొనసాగుతాయి. అయితే పెద్ద విషయం ఏంటంటే కొత్త ఎక్స్‌యూవీ300 ఈవీ కూడా ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి వస్తుంది. ఎక్స్‌యూవీ300 ఈవీ సైజు పరంగా ఎక్స్‌యూవీ400 ఈవీ కంటే చిన్నదిగా ఉంటుంది. నెక్సాన్ ఈవీకి మరింత గట్టి పోటీనిస్తుంది. ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్, ఎక్స్‌యూవీ300 ఈవీ లాంచ్ టైమ్‌లైన్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
మరోవైపు 2022 జనవరి 1వ తేదీ నుంచి 2024 జనవరి 4వ తేదీ మధ్య తయారు చేసిన రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్లకు సంబంధించిన సుమారు 3,00,000 యూనిట్లను వెంటనే రీకాల్ చేస్తున్నట్లు యమహా మోటార్ ఇండియా ప్రకటించింది. రెండు 125 సీసీ స్కూటర్లలోని కొన్ని యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్ సమస్యను పరిష్కరించడం కోసమే వీటిని రీకాల్ చేశామని యమహా తెలిపింది. ఈ సమస్యతో బాధపడుతున్న వినియోగదారులకు రీప్లేస్‌మెంట్ పార్ట్స్‌ను కూడా ఉచితంగా అందించనున్నారు. రీకాల్ కోసం అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ యమహా స్కూటర్‌ల యజమానులు ఇండియా కంపెనీ వెబ్‌సైట్‌లోని సర్వీస్ విభాగానికి లాగిన్ చేసి, ఆపై 'ఎస్సీ 125 వాలంటరీ రీకాల్'కి నావిగేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడానికి వారి ఛాసిస్ నంబర్, మరిన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు సహాయం కోసం వారి సమీప యమహా సేవా కేంద్రాన్ని కూడా సందర్శించవచ్చు లేదా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు.