Mahindra Cars Discount: ఎక్స్‌యూవీ400పై రూ.4.2 లక్షలకు పైగా తగ్గింపు - మహీంద్రా బంపర్ ఆఫర్!
Mahindra XUV300 Discount: మహీంద్రా ఎక్స్‌యూవీ300, ఎక్స్‌యూవీ400 కార్లపై ఏకంగా భారీ తగ్గింపు అందించారు.
Discount on Mahindra Cars: మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు ముందు డీలర్లు 2023, 2024 మోడల్ ఎక్స్‌యూవీ300పై భారీ తగ్గింపులు, ప్రయోజనాలను అందించడం ద్వారా పాత మోడల్ స్టాక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ధర తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, అసిస్ట్ ఎక్విప్‌మెంట్, ఎక్స్‌టెండెడ్ వారంటీ రూపంలో ఈ పొడిగింపులు అందుబాటులో ఉన్నాయి. 2023 మోడల్ సంవత్సరంలో ఎక్స్‌యూవీ400 ఈవీలు తక్కువ అమ్ముడయ్యాయని, దీంతో డీలర్లు భారీ స్టాక్‌ను కలిగి ఉన్నారని తెలిసింది. అందుకే ఈ మోడల్‌పై భారీ డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ300పై తగ్గింపు
కియా సోనెట్, టాటా నెక్సాన్‌లకు పోటీగా ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈ నెలలో రూ. 1.82 లక్షల వరకు డిస్కౌంట్, లాభాలతో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ కారు మోడల్ సంవత్సరం, వేరియంట్, ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. టాప్ స్పెక్ డబ్ల్యూ8 2023 ఎక్స్‌యూవీ300 డీజిల్ ఇంజన్ వేరియంట్‌పై అత్యధిక తగ్గింపు అందుబాటులో ఉంది. అదే వేరియంట్ 2024 మోడల్‌పై రూ. 1.57 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది.
డబ్ల్యూ6 వేరియంట్లో ఇంజిన్ ఆధారంగా రూ. 94,000 నుంచి రూ. 1.33 లక్షల వరకు తగ్గింపులను అందిస్తున్నారు. అయితే డబ్ల్యూ4పై రూ.51,935 నుంచి రూ.73,000 వరకు, డబ్ల్యూ2పై రూ.45,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఎక్స్‌యూవీ300 ప్రస్తుతం 110 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 117 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 131 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ యూనిట్‌తో అందుబాటులో ఉంది. దీనిలో మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ టీజీడీఐ ఇంజిన్ కోసం టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్‌ను పొందుతుందని భావిస్తున్నారు.
మహీంద్రా ఎక్స్‌యూవీ300పై తగ్గింపు
ఈ నెల కూడా XUV400పై భారీ తగ్గింపు కింద గతేడాది మోడల్‌పై రూ. 4.2 లక్షల కంటే ఎక్కువ విలువైన ప్రయోజనాలను అందజేస్తున్నారు. ఈఎస్సీతో ఎక్స్‌యూవీ400 ఈఎల్ ట్రిమ్ ఈ నెలలో రూ. 3.4 లక్షల తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే 2024 మోడల్‌పై రూ. 40,000 వరకు మాత్రమే ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తున్నారు.
గత నెలలో, మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీకి అత్యంత ముఖ్యమైన అప్‌డేట్‌ను అందించింది. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 2024 ఎక్స్‌యూవీ400 ఎక్స్ షోరూమ్ ధర రూ. 15.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల మధ్య ఉంది.
మరోవైపు భారత దేశ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి కొత్త మోడల్స్ రేంజ్‌తో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మార్కెట్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ప్రీమియం 7 సీటర్ ఎస్‌యూవీ, మూడు వరుసల ఎలక్ట్రిక్ ఎంపీవీ, మైక్రో ఎంపీవీ వంటివి కంపెనీ త్వరలో తయారు చేయనుంది. రాబోయే మారుతి 7 సీటర్ ఎస్‌యూవీ 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో లాంచ్ కావచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ700, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్‌లతో పోటీపడుతుంది.