2026 New Car Launches in India: వచ్చే ఏడాది రాబోయే కార్ మోడళ్లివే.. నయా ఫీచర్లతో కార్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్న కంపెనీలు
ఈ ఏడాది జీఎస్టీ తగ్గింపు ఇచ్చిన మజాతో రాబోయే ఏడాది చాలా కార్లు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. అందులోకొన్ని నూతన మోడళ్లు కాగా, మరికొన్ని ఫేస్ లిఫ్టులు ఉన్నాయి. వాటి వివరాలు..

2026 New Car Models Latest News: ఈ సంవత్సరం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌కు కొత్త ఉత్తేజాన్ని తీసుకురానుంది, ఇందులో సరికొత్త మోడళ్లు, అలాగే ప్రముఖ మోడళ్లకు కొత్త ఫేస్‌లిఫ్ట్‌లు విడుదల కానున్నాయి. 2026లో రాబోతున్న టాప్ 5 కార్ల వివరాలు, ప్రధానంగా సరికొత్త జనరేషన్ మోడల్స్ (New Generation Models) ఈ విధంగా ఉన్నాయి.
కియో సెల్టోస్..
మొదటగా, కియా సెల్టోస్ (Kia Seltos - New Generation) కొత్త తరం మోడల్ వచ్చే ఏడాది జూలై నుండి సెప్టెంబర్ మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త జనరేషన్ కారు ప్రస్తుత మోడల్ కంటే కొంచెం పెద్దదిగా , మరింత ఆధునిక డిజైన్‌తో రానుంది, ఇది పరిమాణంలో హ్యారియర్ , ప్రస్తుత సెల్టోస్ మధ్య ఉండవచ్చు. ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్ నాన్-టర్బో పెట్రోల్ ఇంజిన్‌లతో వస్తుంది, అయితే iMT (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఈసారి నిలిపివేయబడే అవకాశం ఉంది. ఫీచర్ల పరంగా, 17 నుండి 18-అంగుళాల వీల్స్, దాదాపు 200 mm గ్రౌండ్ క్లియరెన్స్, 360-డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 12-అంగుళాల టచ్‌స్క్రీన్, బోస్ కాకుండా హార్మన్ కార్డాన్ స్పీకర్లు, కస్టమైజబుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు (ముందు, వెనుక), రియర్ ఏసీ వెంట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, మసాజ్ ఫీచర్ (అంచనా), డాష్ కెమెరా, డిజిటల్ మిర్రర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. దీని ఆన్-రోడ్ ధర సుమారు ₹13-14 లక్షల నుండి ప్రారంభమై, టాప్-ఎండ్ మోడల్ ₹25-27 లక్షల వరకు ఉండవచ్చు.
హ్యుందాయ్ బయోన్ (Hyundai Bayon), మారుతి సుజుకి ఫ్రాంక్స్‌కు పోటీగా ఆగస్టు-సెప్టెంబర్‌లో రావొచ్చు. ఇది i20 వెన్యూ మధ్య స్థానంలో ఉండే సబ్-4-మీటర్ కారు. ఇది 1.2-లీటర్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లతో వస్తుంది. ఫీచర్లలో కనెక్ట్ చేయబడిన రెండు స్క్రీన్‌లు, బోస్ స్పీకర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రియర్ ఏసీ వెంట్స్, లెథరెట్ అప్‌హోల్‌స్ట్రీ ఉంటాయి. హ్యుందాయ్ ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో సిఎన్‌జి (CNG) వేరియెంట్‌ను కూడా అందించే అవకాశం ఉంది, దీని వల్ల బూట్ స్పేస్ బాగుంటుంది. దీని ధర సుమారు ₹9-15 లక్షల మధ్య ఉండవచ్చు.
డస్టర్, టెర్నానో మోడల్స్..
రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రానో కొత్త జనరేషన్ మోడళ్లు 2026 మార్చి నుండి అక్టోబర్-నవంబర్ మధ్యలో విడుదల కానున్నాయి. మ్యాగ్నైట్ ,కైగర్‌ల తరహాలో, తక్కువ ధరలో పెద్ద కారును అందించాలనేది ఈ బ్రాండ్ల వ్యూహం. రెనాల్ట్ డస్టర్ ,నిస్సాన్ టెర్రానో 5-సీటర్ ,7-సీటర్ మోడళ్లు కూడా రానున్నాయి. ఇంజిన్ పరంగా, ప్రస్తుతానికి పెట్రోల్ , టర్బో పెట్రోల్ ఇంజిన్‌లు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఫీచర్లలో 360-డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, బ్రాండెడ్ మ్యూజిక్ స్పీకర్లు (అంచనా), టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రియర్ ఏసీ వెంట్స్, హెడ్స్-అప్ డిస్‌ప్లే (గరిష్టంగా), లెథరెట్ అప్‌హోల్‌స్ట్రీ, LED లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ (అంచనా) ఉంటాయని తెలుస్తోంది. దీని ఆన్-రోడ్ ధర ₹18-18.5 లక్షల వరకు ఉంటుందని అంచనా.
మహీంద్రా నుంచి..
మహీంద్రా XUV e7 అనేది 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది 59 kWh బ్యాటరీ (400 కి.మీ. రేంజ్) 79 kWh బ్యాటరీ (500-550 కి.మీ. రేంజ్) తో రానుంది. ఫీచర్లలో దాదాపు 12.5 అంగుళాల మూడు కనెక్ట్ చేయబడిన స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, హార్మన్ కార్డాన్ 16 స్పీకర్లు, LED లైట్లతో కూడిన గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, స్లైడింగ్ చేయదగిన 2వ వరుస సీట్లు, సన్ బ్లైండ్స్, 5G కనెక్టివిటీ వంటివి ఉండొచ్చుని తెలుస్తోంది.. దీని ధర ₹20 లక్షల నుండి ₹34 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. అలాగే టయోటా ఫార్చ్యూనర్ కొత్త జనరేషన్ 2026 రెండవ భాగంలో, అంటే జూలై-ఆగస్టు తర్వాత, ఇండియాలో విడుదల కావచ్చు. ఇది హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 2 లేదా 2.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 4x4 తో లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై రానుంది. 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కూడా కొనసాగించవచ్చు, పెట్రోల్ హైబ్రిడ్‌లో 15-16 కి.మీ/లీ మైలేజీని ఆశించవచ్చు. ఫీచర్లలో హ్యైక్రాస్ ఫీచర్లన్నీ, 10-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ కనెక్టివిటీ, JBL స్పీకర్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 2వ వరుసలో ఒట్టోమాన్ సీట్లు (అంచనా), విశాలమైన 3వ వరుస ఉంటాయి. దీని ఆన్-రోడ్ ధర సుమారు ₹48 లక్షల నుండి ప్రారంభమై, ₹65-67 లక్షల వరకు ఉండవచ్చు.




















