అన్వేషించండి

బైక్‌ మోడిఫికేషన్స్‌.. మన దేశంలో ఏవి చట్టబద్ధం? ఏవి నిషేధం? ఇలా చేస్తే ఫైన్ తప్పదు!

భారత్‌లో బైక్ మోడిఫికేషన్లకు ఏవి లీగల్‌? ఏవి ఇల్లీగల్‌? క్రాష్ గార్డ్స్ నుంచి ఎగ్జాస్ట్ వరకు లీగల్ మార్పులు, పాటించాల్సిన నిబంధనలు ఇవే.

Bike Modifications Legal And Illegal In India: బైక్ అంటే కేవలం ప్రయాణ సాధనం కాదు. చాలా మందికి అది ఒక స్టైల్ స్టేట్‌మెంట్. అందుకే తమకు నచ్చినట్లు బైక్‌ను మార్చుకోవాలని చాలామంది కోరుకుంటారు. అయితే, మీ టూవీలర్‌కు చేసే ప్రతి మోడిఫికేషన్ చట్టబద్ధం కాదు. కొన్ని మార్పులు ఎలాంటి సమస్యలను సృష్టించవు. మరికొన్ని మార్పులు మాత్రం ట్రాఫిక్ పోలీసుల ఆగ్రహానికి గురవుతాయి, మీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

భారత్‌లో బైక్ మోడిఫికేషన్లకు ప్రధానంగా మోటార్ వాహనాల చట్టం 1988, కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు 1989 వర్తిస్తాయి. వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో ఉన్న కీలక వివరాలను మార్చే విధంగా మోడిఫికేషన్ చేస్తే సమస్యలు వస్తాయి. వాహనం నిర్మాణంలో మార్పులు చేసినా నిబంధనలు వర్తిస్తాయి.

అయితే కొన్ని రక్షణ, సౌకర్యం & అలంకరణకు సంబంధించిన యాక్సెసరీస్‌ను చట్టబద్ధంగానే ఉపయోగించవచ్చు.

1. క్రాష్ గార్డ్స్

క్రాష్ గార్డ్స్, ఇంజిన్ గార్డ్స్, లెగ్ గార్డ్స్‌ను బైక్‌కు అమర్చుకోవచ్చు, బండి కింద పడినప్పుడు ఇంజిన్ & ఇతర భాగాలకు ఇవి రక్షణ ఇస్తాయి. అయితే ఇవి బ్రేక్ పెడల్, గేర్ లివర్ లేదా ఎగ్జాస్ట్‌కు అడ్డంకిగా ఉండకూడదు.

2. మొబైల్ హోల్డర్

నావిగేషన్ కోసం హ్యాండిల్‌బార్‌కు మొబైల్ హోల్డర్ పెట్టుకోవడం సాధారణంగా చట్టబద్ధమే. అయితే వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్‌ను చేతిలో పట్టుకుని మాట్లాడటం లేదా ఉపయోగించడం మాత్రం నిబంధనలకు విరుద్ధం.

3. USB ఛార్జర్

బైక్‌కు USB ఛార్జింగ్ సాకెట్‌ను అమర్చుకోవచ్చు. సరైన ఫ్యూజ్‌తో నిపుణుల చేత వైరింగ్ చేయించడం మంచిది. తప్పుగా కనెక్షన్ ఇస్తే బ్యాటరీ లేదా విద్యుత్ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది.

4. సాడిల్ బ్యాగ్స్ & టాప్ బాక్స్

టూరింగ్ కోసం సాడిల్ బ్యాగ్స్, ప్యానియర్స్, టాప్ బాక్స్‌లను ఉపయోగించవచ్చు. అయితే అవి బైక్ పరిమాణాన్ని అనవసరంగా పెంచకూడదు. తయారీదారు సూచించిన బరువు పరిమితిని కూడా దాటకూడదు.

5. LED హెడ్‌లైట్

అసలు హెడ్‌లైట్ హౌసింగ్‌ను మార్చకుండా సరిపోయే LED బల్బును ఉపయోగించుకోవచ్చు. అయితే వెలుతురు ఎక్కువగా ఉండి ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బంది కలిగించకూడదు. హెడ్‌లైట్‌ను కట్ చేసి కొత్త యూనిట్ అమర్చడం సమస్యలకు దారి తీయవచ్చు.

6. బార్ ఎండ్ మిర్రర్స్

వెనుక వైపు దృశ్యాన్ని స్పష్టంగా చూపేలా ఉంటే బార్ ఎండ్ మిర్రర్స్‌ను ఉపయోగించవచ్చు. కేవలం స్టైల్ కోసం చిన్నగా ఉండే, వెనుక భాగం కనిపించని అద్దాలను మాత్రం ఉపయోగించకపోవడం మంచిది.

7. ట్యాంక్ ప్యాడ్

ట్యాంక్ ప్యాడ్ లేదా ట్యాంక్ ప్రొటెక్టర్‌ను అమర్చుకోవడంలో ఎలాంటి పెద్ద సమస్య ఉండదు. ఇది బైక్ పెయింట్‌ను గీతల నుంచి కాపాడుతుంది. కాబట్టి ఇది సురక్షితమైన యాక్సెసరీగా చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: రూ.3 లక్షల డౌన్‌పేమెంట్‌ చేసి హోండా ఎలివేట్‌ కొనొచ్చా? EMI ఎంత పడుతుంది?

8. కస్టమ్ సీట్

సీట్ కవర్ మార్చడం లేదా మంచి ఫోమ్‌తో సీటును తయారు చేయించుకోవచ్చు. అయితే సీటింగ్ కెపాసిటీని మార్చే విధంగా మార్పులు చేయకూడదు. రిజిస్ట్రేషన్‌లో ఉన్న సీట్ల సంఖ్య మారితే అనుమతి అవసరం కావచ్చు.

9. హ్యాండిల్‌బార్ రైజర్స్

సరైన పరిమితిలో హ్యాండిల్‌బార్ రైజర్స్ ఉపయోగించవచ్చు. అయితే ఎక్కువ ఎత్తు పెంచితే క్లచ్, బ్రేక్ & యాక్సిలరేటర్ కేబుల్స్‌పై ఒత్తిడి పడవచ్చు. అమర్చిన తర్వాత హ్యాండిల్‌బార్ సరిగ్గా పనిచేస్తుందో తప్పనిసరిగా చూడాలి.

10. ఎగ్జాస్ట్ ఎండ్ క్యాన్

అసలు ఎగ్జాస్ట్‌కు బదులుగా మరొక ఎండ్ క్యాన్ అమర్చేటప్పుడు శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలి. dB కిల్లర్‌ను తొలగించడం, సైలెన్సర్‌ను మార్చడం లేదా స్ట్రెయిట్ పైప్ పెట్టడం మాత్రం ప్రమాదకరం. అధిక శబ్దంతో నడిపితే జరిమానా పడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఇండియాలో కార్ మోడిఫికేషన్స్‌పై రూల్స్ ఇవే.. ఏవి చట్టబద్ధం? ఏవి నేరం?

చట్టవిరుద్ధమైన మార్పులు

ఇంజిన్ సామర్థ్యాన్ని మార్చడం, ఇంజిన్‌నే పూర్తిగా మార్చేయడం, చక్రాల సైజు మార్చడం, మడ్‌గార్డ్స్ తొలగించడం, రిజిస్ట్రేషన్‌లో ఉన్న రంగును మార్చి వివరాలను అప్డేట్ చేయకపోవడం, ARAI (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆమోదం లేని LED లైట్ బార్‌లు, ఫాగ్ లైట్లు లేదా సహాయక లైట్లను అమర్చడం వంటివి చట్టవిరుద్ధం.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బైక్‌లో మార్పు చేసే ముందు అది రిజిస్ట్రేషన్ వివరాలను ప్రభావితం చేస్తుందేమో చూడాలి. వాహనం నిర్మాణాన్ని కట్ చేయడం, వెల్డింగ్ చేయడం వంటి శాశ్వత మార్పుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే RTO అనుమతి తీసుకోవాలి.

బైక్‌కు అమర్చిన అదనపు యాక్సెసరీస్‌ గురించి బీమా సంస్థకు తెలియజేయడం మంచిది. యాక్సెసరీస్ కవరేజ్ తీసుకుంటే వాటి విలువకు కూడా బీమా రక్షణ లభించే అవకాశం ఉంటుంది.

బైక్‌ను స్టైలిష్‌గా మార్చుకోవడం తప్పు కాదు. కానీ స్టైల్ కోసం చట్టాన్ని ఉల్లంఘించకూడదు. రక్షణ, సౌకర్యం కోసం చేసే మార్పులైనా నిబంధనలకు లోబడి ఉంటేనే సమస్యలు తగ్గుతాయి. ఏ మోడిఫికేషన్ చేసినా, ముందుగా దాని చట్టబద్ధతను తెలుసుకోవడం ప్రతి బైక్ యజమాని బాధ్యత.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
2027 KTM 200 Dukeలో రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సహా కొత్త ఫీచర్లు.. మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు
KTM 200 Duke మరోసారి అప్‌డేట్.. ఈసారి కొత్తగా వచ్చిన ఫీచర్లు ఏంటి?
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Embed widget