కైనెటిక్ స్కూటర్లకు బిగ్ అప్‌గ్రేడ్.. కొత్త బ్యాటరీతో ఇప్పుడు ఏకంగా 132 కి.మీ. రేంజ్!
కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త బ్యాటరీ వేరియంట్లతో వచ్చింది. DX 3kWh, DX+ 3.1kWh మోడళ్లలో 132 కి.మీ. వరకు IDC రేంజ్ అందిస్తోంది.

Kinetic DX Electric Scooter Price, Range And Features Telugu: కైనెటిక్ కంపెనీ, తన DX ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌ను మరింత విస్తరించింది & పెద్ద బ్యాటరీ ఆప్షన్లను తీసుకొచ్చింది. కొత్త DX ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3kWh బ్యాటరీని యాడ్ చేసింది. DX+ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.1kWh బ్యాటరీని అందించింది. వీటిలో ముఖ్యంగా DX+ కొత్త వేరియంట్ ఆకట్టుకుంటోంది. ఈ స్కూటర్‌ను ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 132 కి.మీ. వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
ఈ కొత్త బ్యాటరీ వేరియంట్లు పాత మోడళ్లకు ప్రత్యామ్నాయంగా రావడం లేదు. పాత బ్యాటరీ ఆప్షన్లూ ఉంటాయి & కొత్తవాటినీ విక్రయిస్తారు. అంటే 2.6kWh బ్యాటరీతో ఉన్న DX & DX+ మోడళ్లు కూడా కొనసాగుతాయి. దీనివల్ల, కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవాళ్లకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి.
DX+కి 132 కి.మీ. రేంజ్
కొత్త కైనెటిక్ DX+ 3.1kWh వేరియంట్‌లో 3.1kWh బ్యాటరీ ఉంది. దీనికి 132 కి.మీ. IDC రేంజ్ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. వాస్తవ వినియోగంలో 105 నుంచి 110 కి.మీ. వరకు రేంజ్ రావచ్చని కైనెటిక్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న DX+ 2.6kWh మోడల్ 105 కి.మీ. IDC రేంజ్ ఇస్తుంది. దీంతో కొత్త వెర్షన్‌లో రేంజ్ గణనీయంగా పెరిగింది.
DX+ 3.1kWh లో బ్యాటరీ సామర్థ్యం పెరిగినప్పటికీ మోటార్ పవర్ తగ్గింది. ఈ కొత్త మోడల్‌లో 3.8kW హబ్ మోటార్‌ను ఉపయోగించారు. ప్రస్తుతం ఉన్న 2.6kWh DX+లో 4.78kW మోటార్ ఉంది. కొత్త మోడల్‌లో Turbo రైడింగ్ మోడ్‌ను తీసేశారు. Range & Power మోడ్‌లు మాత్రం కొనసాగాయి.
ఇది కూడా చదవండి: కొత్త ఇంజిన్‌తో సరికొత్తగా మారిన 2026 Maruti Baleno.. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రోడ్డుపై ఎలా ఉంది?
DX 3kWh ధర ఎంత?
కొత్త DX 3kWh వేరియంట్ ధర రూ.1.19 లక్షలు. ప్రస్తుతం ఉన్న DX 2.6kWh ధర రూ.1.11 లక్షలు. అంటే పెద్ద బ్యాటరీ కోసం అదనంగా రూ.8,000 చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త DX 3kWh మోడల్‌కు సంబంధించి రేంజ్ & మోటార్ పవర్ వివరాలను కైనెటిక్ ఇంకా వెల్లడించలేదు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం 2.6kWhతో పాటు కొత్త పెద్ద బ్యాటరీ వేరియంట్లు కూడా కనిపిస్తున్నాయి.
DX+ 3.1kWh ధర రూ.1.28 లక్షలు. ఈ మోడల్‌లో ప్రధాన ఆకర్షణ ఎక్కువ రేంజ్. రోజువారీ నగర ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి ఇది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: నెలకు రూ.2500 EMI కడితే చాలు, 243km రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ మీ సొంతమవుతుంది!
విదేశీ మార్కెట్లపైనా కన్ను
DX మోడల్‌ను ఇతర దేశాల్లో విక్రయించే అవకాశాలను కూడా కైనెటిక్ పరిశీలిస్తోంది. టర్కీ, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, కెన్యా, నైజీరియా & ఈజిప్ట్ వంటి దేశాలను తన లిస్ట్‌లో పెట్టుకున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. దీంతో.. DX ఎలక్ట్రిక్ స్కూటర్‌కు దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ మార్కెట్లలోనూ అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఎక్కువ రేంజ్ ఉన్న వేరియంట్లను జోడించడం ద్వారా మరింత విస్తృతమైన వినియోగదారులను చేరుకోవాలని కైనెటిక్ చూస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















