అన్వేషించండి

కొత్త ఇంజిన్‌తో సరికొత్తగా మారిన 2026 Maruti Baleno.. ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ రోడ్డుపై ఎలా ఉంది?

కొత్త ఇంజిన్, ADAS, అదనపు ఫీచర్లతో మారుతి సుజుకి బలెనో ఫేస్‌లిఫ్ట్ వచ్చింది. కొత్త బలెనో డిజైన్, పనితీరు, మైలేజీ, సేఫ్టీపై పూర్తి సమీక్ష.

2026 Maruti Baleno Facelift Price, Mileage And Features Telugu: మారుతి సుజుకి బలెనో.. భారత కార్ మార్కెట్లో ఈ పేరుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 2015లో మార్కెట్లోకి వచ్చిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇప్పటివరకు ఏకంగా 19 లక్షల మంది కొనుగోలుదారులను సొంతం చేసుకుంది. కాంపాక్ట్ SUVల హవా పెరిగినా బలెనో ఆదరణ తగ్గలేదు. ఇప్పుడు, మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు మారుతి సుజుకి బలెనోకు ఫేస్‌లిఫ్ట్ ఇచ్చింది. కొత్త డిజైన్, కొత్త ఫీచర్లు, ముఖ్యంగా కొత్త పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు వచ్చింది. 2026 బలెనోను ఆటో ఎక్స్‌పర్ట్‌లు రోడ్‌ టెస్ట్‌ చేశారు, ఆ వివరాలు మీ కోసం:

డిజైన్‌
2026 బలెనో ముందు భాగంలోనే ప్రధాన మార్పులు కనిపిస్తాయి. కొత్త బలెనోలో పెద్ద గ్రిల్ ఇచ్చారు. ఇందులో మూడు క్రోమ్ పట్టీలు ఉన్నాయి. గ్లోస్ బ్లాక్ డిజైన్ కూడా కనిపిస్తుంది. గ్రిల్ మధ్యలో రాడార్ మాడ్యూల్ ఉంది. ఇది కొత్త ADAS సాంకేతికత కోసం ఉపయోగపడుతుంది. కొత్త బంపర్‌తో పాటు కొత్త LED ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చాయి. సుజుకి లోగోను గ్రిల్ పైనకు మార్చారు.

పక్క భాగంలో పెద్దగా మార్పులు లేవు. ముందు ఫెండర్‌పై క్రోమ్ అలంకరణ ఇచ్చారు. పైభాగంలో షార్క్ ఫిన్ యాంటెన్నా ఉంటుంది. 16 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కొనసాగాయి. వెనుక డిజైన్ దాదాపు పాత మోడల్‌గానే ఉంది. కొత్త ఆకుపచ్చ రంగు మాత్రం ఆకట్టుకుంటుంది. మొత్తంగా డిజైన్‌లో చేసిన మార్పులు స్వల్పంగానే ఉన్నాయి. అయితే కొత్త గ్రిల్‌పై మాత్రం భిన్నాభిప్రాయాలు రావచ్చు.

కారు లోపల కూడా పెద్ద మార్పులు లేవు. లేయర్డ్ డ్యాష్‌బోర్డ్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ కొనసాగాయి. నలుపు & నీలం రంగుల కలయికతో క్యాబిన్ ఉంటుంది. స్టీరింగ్‌పై కొత్త ADAS నియంత్రణలు వచ్చాయి. సీట్లకు లెదరెట్ అంచులు ఇవ్వడంతో ప్రీమియం భావన పెరిగింది.

ముందు సీట్లు సౌకర్యంగా ఉన్నాయి. డ్రైవింగ్ పొజిషన్‌ను సులభంగా సర్దుకోవచ్చు. వెనుక సీట్లలో స్థలం బలెనోకు మరో బలం. పొడవైన ప్రయాణికులు కూడా సౌకర్యంగా కూర్చోవచ్చు. వెనుక సీటులోని మధ్య ప్రయాణికుడికి అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ & మూడు పాయింట్ల సీట్‌బెల్ట్ ఇచ్చారు. వెనుక భాగంలో AC వెంట్స్ & USB ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి. బూట్ సామర్థ్యం 318 లీటర్లు. స్పేర్ టైర్‌ను కూడా కొనసాగించారు.

ఫీచర్లు
ఫీచర్ల విషయంలో బలెనో మరింత మెరుగైంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కూల్డ్ వైర్‌లెస్ ఛార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు వచ్చాయి. 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, హెడ్ అప్ డిస్‌ప్లే, కలర్ MID, ఆటో హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త బలెనోలో అతి పెద్ద ఆకర్షణ.. ADAS. ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. రోడ్‌ టెస్ట్‌లో ఇవి బాగా పనిచేశాయి. పెద్దగా ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించలేదు.

ఇది కూడా చదవండి: రూ.1.35 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్న మారుతి సుజుకీ విక్టోరిస్.. ఆ మోడల్ ప్రత్యేకం

ఇంజిన్‌
ఇంజిన్ విషయంలో మాత్రం పెద్ద మార్పు జరిగింది. పాత 1.2 లీటర్ నాలుగు సిలిండర్ ఇంజిన్ స్థానంలో కొత్త 1.2 లీటర్ మూడు సిలిండర్ Z సిరీస్ ఇంజిన్ వచ్చింది. ఇది 83 hp శక్తి & 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత ఇంజిన్‌తో పోలిస్తే పవర్‌ కొద్దిగా తగ్గింది. అయితే తక్కువ వేగంలో కూడా స్పందన బాగుంది. ఇంజిన్ సున్నితంగా పనిచేస్తుంది. అధిక వేగంలో మాత్రం పాత ఇంజిన్ ఇచ్చినంత ఉత్సాహం కనిపించదు.

5 స్పీడ్ మాన్యువల్ & 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. మాన్యువల్ గేర్‌బాక్స్ సులభంగా పనిచేస్తుంది. AMT నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే వేగంగా ఓవర్‌టేక్ చేయాల్సిన సమయంలో కొంత ఆలస్యం కనిపిస్తుంది. అందుకే మాన్యువల్ వెర్షన్‌నే మెరుగైన ఎంపికగా చెప్పొచ్చు.

మైలేజీ 
మైలేజీ విషయంలో కొత్త ఇంజిన్ స్పష్టమైన ప్రయోజనం ఇస్తుంది. మాన్యువల్ వెర్షన్ 23.80 kmpl మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. AMT వెర్షన్ 24.77 kmpl వరకు ఇస్తుందని & CNG వెర్షన్ 33.61 km/kg వరకు ఇస్తుందని వెల్లడించింది. ఇవి కంపెనీ పరీక్షల్లో నమోదైన గణాంకాలు. వాస్తవ పరిస్థితుల్లో మైలేజీ కొంత తక్కువగా ఉండొచ్చు.

రైడ్ కంఫర్ట్ కూడా బలెనోకు బలమే. గుంతలు & రోడ్డు లోపాలను సస్పెన్షన్ చక్కగా మ్యానేజ్‌ చేసింది. అధిక వేగంలో కూడా కారు స్థిరంగా ఉంటుంది. తక్కువ వేగంలో ఉన్నప్పుడు స్టీరింగ్ తేలికగా ఉంటుంది. వేగం పెరిగే కొద్దీ బరువు పెరుగుతుంది. దీంతో డ్రైవింగ్‌లో నమ్మకం కలుగుతుంది.

ఇది కూడా చదవండి: 2026 మారుతి బలెనో కొనేందుకు కనీసం ఎంత డబ్బు కావాలి? తెలంగాణ, ఏపీ ధరలు & లోన్ వివరాలు ఇవే!

బలెనో ఫేస్‌లిఫ్ట్ ధర రూ.6.10 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కొత్త ఇంజిన్ వల్ల పనితీరు కొంత తగ్గినా మైలేజీ పెరిగింది. ADASతో భద్రత మెరుగైంది. అదనపు ఫీచర్లు వచ్చాయి. విశాలమైన క్యాబిన్, మంచి రైడ్ కంఫర్ట్ & సులభమైన డ్రైవింగ్ బలెనోకు ఇప్పటికీ ప్రధాన బలాలు. అందుకే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బలెనో తన స్థానాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shivam Dube New Car: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!
Mahindra XEV 9S ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కొన్న శివమ్‌ దూబే.. ఏంటి ఆ కారు స్పెషాలిటీ?
Hyundai Verna Safety Rating: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు
హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిన పాపులర్‌ సెడాన్!
పుష్కరం పాటు సాగిన ప్రయాణం.. ఇక అమ్మకాలకు గుడ్‌బై చెప్పిన TVS Star City Plus
మార్కెట్ నుంచి TVS Star City Plus అవుట్.. ఈ బైక్‌ ఇక కనిపించదు బాస్‌!
Tata Cars: టాటా కార్లపై హోండా, హ్యుందాయ్ ఆసక్తి.. కొత్త భాగస్వామ్యం కోసం కీలక చర్చలు
కారు టాటాది.. కారు పైన బ్యాడ్జ్‌ మాత్రం హోండా, హ్యుందాయ్‌ది! టెక్నాలజీ షేరింగ్‌ గురూ
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget