అన్వేషించండి

ఇండియాలో కార్ మోడిఫికేషన్స్‌పై రూల్స్ ఇవే.. ఏవి చట్టబద్ధం? ఏవి నేరం?

కారుకు మోడిఫికేషన్స్ చేయించే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నిబంధనలు ఇవే. టైర్లు, కలర్, CNG, లైట్లు, హారన్, ఎగ్జాస్ట్‌పై కీలక రూల్స్ తెలుసుకోండి.

Car Modification Rules in India: కారు కొనుకున్న తర్వాత దాన్ని మరింత స్టైలిష్‌గా మార్చుకోవాలని చాలామందికి ఉంటుంది. కొందరు కారు లుక్ కోసం మార్పులు చేస్తారు. మరికొందరు డ్రైవింగ్ పనితీరు కోసం మోడిఫికేషన్స్ చేయిస్తారు. అయితే ప్రతి మార్పూ చట్టబద్ధం కాదు. కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది.

భారత్‌లో కార్ మోడిఫికేషన్స్‌కు సంబంధించి కొన్ని కీలక నిబంధనలు ఉన్నాయి. 2019లో, సుప్రీంకోర్టు కూడా వాహనాల మార్పులకు సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలను స్పష్టం చేసింది. అందుకే కారుకు ఏదైనా మార్పు చేసే ముందు అది చట్టబద్ధమైనదేనా కాదా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

చట్టబద్ధమైన మోడిఫికేషన్స్ ఏవి?

కారు టైర్లను మార్చుకోవచ్చు. అయితే కొత్త టైర్లు కంపెనీ సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. టైర్ సైజు పెంచితే లోడ్ ఇండెక్స్ & స్పీడ్ రేటింగ్ పాత టైర్లతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఎక్కువ వెడల్పు ఉన్న టైర్లను పెట్టుకుంటే, తక్కువ సైడ్‌వాల్ ఎత్తు ఉన్న టైర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

కారు రంగును కూడా మార్చుకోవచ్చు. అయితే ఇందుకోసం RTO అనుమతి తీసుకోవాలి. రంగు మార్పు గురించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో కూడా నమోదు చేయించాలి. ముఖ్యంగా ఆర్మీ గ్రీన్ రంగును మాత్రం ఉపయోగించకూడదు. ఈ రంగు సైనిక వాహనాలకు కేటాయించారు.

సస్పెన్షన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అయితే దీనివల్ల కారు గ్రౌండ్ క్లియరెన్స్‌లో భారీ మార్పు రాకూడదు. కారు బాడీకి వినైల్ లేదా బాడీ ర్యాప్ చేయడం కూడా చట్టబద్ధమే. సాధారణంగా దీనికి RTO అనుమతి అవసరం లేదు.

ఫ్రంట్ స్ప్లిటర్, బాడీ క్లాడింగ్, సైడ్ ప్యానెల్స్ వంటి బాడీ కిట్‌లను కూడా అమర్చుకోవచ్చు. అయితే ఇవి కారు నిర్మాణాన్ని మార్చకూడదు.

ఆఫ్టర్‌మార్కెట్ CNG కిట్‌ను కూడా అమర్చుకోవచ్చు. కానీ దీనిని RTOలో నమోదు చేయించాలి. అనంతరం కొత్త వివరాలతో అప్డేట్ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలి.

కారులో LED DRLs అమర్చుకోవచ్చు. వర్షం, పొగమంచు వంటి పరిస్థితుల్లో ఇవి సహాయపడతాయి. దివ్యాంగుల కోసం ఆటోమేటిక్ క్లచ్, బ్రేక్ లేదా యాక్సిలరేటర్ వంటి మార్పులు చేయడాన్ని కూడా అనుమతిస్తారు.

ఇంజిన్‌లో కొన్ని మార్పులు చేయవచ్చు. అయితే, దీనికి RTO అనుమతి అవసరం. కొత్త ఇంజిన్ సామర్థ్యం కారు కంపెనీ నిర్దేశించిన పరిమితిని మించకూడదు.

ఇది కూడా చదవండి: 2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ vs పాత మోడల్‌.. మైలేజ్, పవర్‌లో వచ్చిన మార్పులేంటి?

ఈ మోడిఫికేషన్స్ చేస్తే మాత్రం నేరం!

కారు కిటికీలకు ఎక్కువగా టింట్ ఫిల్మ్ వేయడం చట్టవిరుద్ధం. వాహనాల వెనుక కిటికీలు & విండ్‌స్క్రీన్‌కు కనీసం 70 శాతం కనిపించే సామర్థ్యం ఉండాలి. పక్క కిటికీలకు కనీసం 50 శాతం విజిబిలిటీ ఉండాలి. ఈ పరిమితికి తగ్గితే నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. కిటికీలకు సన్‌షేడ్స్ ఉపయోగించడంపైనా నిబంధనలు ఉన్నాయి.

ఎక్కువ శబ్దం చేసే హారన్‌లను అమర్చకూడదు. 100 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం చేసే హారన్‌లకు అనుమతి లేదు. ప్రెజర్ హారన్‌లు, సైరన్‌లు వంటి ఫ్యాన్సీ హారన్‌లను ఉపయోగిస్తే జరిమానా పడుతుంది.

డిజైనర్ నంబర్ ప్లేట్లు కూడా చట్టవిరుద్ధమే. కొత్త వాహనాలకు IND గుర్తుతో కూడిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు మాత్రమే ఉండాలి. పాత కార్ల నంబర్ ప్లేట్లపై అక్షరాలు స్పష్టంగా కనిపించేలా ఉండాలి.

కారు ఎగ్జాస్ట్‌ను మార్చి ఎక్కువ శబ్దం వచ్చేలా చేయడం కూడా నిబంధనలకు విరుద్ధం. దీనివల్ల శబ్ద కాలుష్యం & వాయు కాలుష్యం పెరుగుతుంది. అంతేకాదు ఇలాంటి మార్పులు PUC పరీక్షలో సమస్యలకు దారితీయవచ్చు.

హెడ్‌ల్యాంప్స్‌లో హాలోజన్ స్థానంలో తెల్లటి LED లైట్లు పెట్టుకోవచ్చు. కానీ నీలం, ఆకుపచ్చ, ఎరుపు వంటి రంగుల లైట్లను ఉపయోగించకూడదు. 

కారు పరిమాణానికి మించిన భారీ అల్లాయ్ వీల్స్ అమర్చడం కూడా సమస్యలకు దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: Hyundai Creta Electric లాంగ్‌టర్మ్‌ రిపోర్ట్‌.. 11,000 km తిరిగిన ఈ కారులో లోపాలు ఏవైనా కనిపించాయా?

మోడిఫికేషన్‌కు ముందు ఇవి గుర్తుంచుకోండి

కారుకు మార్పులు చేసే ముందు ఖర్చును లెక్కించుకోవాలి. అవసరం లేని మోడిఫికేషన్స్‌పై డబ్బు ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా, కారు భద్రత విషయంలో రాజీ పడకూడదు.

మోడిఫికేషన్స్ వల్ల కారు వారంటీపై ప్రభావం పడొచ్చు. మార్చిన భాగం వల్ల సమస్య వచ్చిందని తయారీదారు భావిస్తే, వారంటీ క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంటుంది.

మార్పులు చేసిన కారుకు రీసేల్ విలువ కూడా తగ్గే అవకాశం ఉంది. కొన్ని ఇంజిన్ మోడిఫికేషన్స్ వల్ల కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరగొచ్చు. పాత కార్లకు విడిభాగాలు దొరకడం కూడా కష్టం అవుతుంది.

కారు లుక్ లేదా పనితీరు కోసం మోడిఫికేషన్ చేయించుకునే ముందు RTO నిబంధనలు తెలుసుకోవాలి. చట్టబద్ధమైన మార్పులకే పరిమితం కావాలి. లేకపోతే జరిమానాతో పాటు ఇతర చట్టపరమైన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honda Elevate: రూ.3 లక్షల డౌన్‌పేమెంట్‌ చేసి హోండా ఎలివేట్‌ కొనొచ్చా? EMI ఎంత పడుతుంది?
నెలకు రూ.20 వేల కంటే తక్కువ EMI తోనే కొత్త Honda Elevateను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు!
116km రేంజ్‌ ఇచ్చే కైనెటిక్ DXను రూ.10,000తో సొంతం చేసుకోండి.. బ్యాంక్ వడ్డీ రేట్లు, EMI ఆప్షన్లు ఇవే!
రూ.10,000తో Kinetic DX కొనేయొచ్చు - హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర, EMI ప్లాన్‌ వివరాలు మీ కోసం
కైనెటిక్ స్కూటర్లకు బిగ్ అప్‌గ్రేడ్.. కొత్త బ్యాటరీతో ఇప్పుడు ఏకంగా 132 కి.మీ. రేంజ్!
కైనెటిక్‌ స్కూటర్ల కెపాసిటీ పెరిగింది, ఇప్పుడు సింగిల్‌ ఛార్జ్‌తో 132km రేంజ్‌!
టాటా కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌.. ఈ నెలలో రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌!
టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలలో కొంటే రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌!
Advertisement

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన
Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
BRS MLAs: మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
Lust Stories 3 Trailer : బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కైనెటిక్ స్కూటర్లకు బిగ్ అప్‌గ్రేడ్.. కొత్త బ్యాటరీతో ఇప్పుడు ఏకంగా 132 కి.మీ. రేంజ్!
కైనెటిక్‌ స్కూటర్ల కెపాసిటీ పెరిగింది, ఇప్పుడు సింగిల్‌ ఛార్జ్‌తో 132km రేంజ్‌!
Deepika Padukone Baby Bump: కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
Embed widget