అన్వేషించండి

Honda Elevate: రూ.3 లక్షల డౌన్‌పేమెంట్‌ చేసి హోండా ఎలివేట్‌ కొనొచ్చా? EMI ఎంత పడుతుంది?

హైదరాబాద్‌లో హోండా ఎలివేట్‌ ధర రూ. 11.69 లక్షల నుంచి ప్రారంభం. అధునాతన ఫీచర్లు, పది శాతం వడ్డీతో కనీస డౌన్‌పేమెంట్ & EMI వివరాలు ఇక్కడ చూడండి.

Honda Elevate Price, Down Payment, Loan and EMI Details: మిడ్-సైజ్ SUV విభాగంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది Honda Elevate SUV. జపనీస్ ఇంజనీరింగ్ విశ్వసనీయతకు తోడు మోడర్న్ డిజైన్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ వాహనం నేటి Gen-Z & Alpha జనరేషన్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. బిజీ ట్రాఫిక్‌లో రోజూవారీ కమ్యూట్ & వీకెండ్ లాంగ్ డ్రైవ్‌లకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా ఈ కారు నిలుస్తోంది.

హైదరాబాద్‌లో ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధర

భాగ్యనగరంలో Honda Elevate బేస్‌ వేరియంట్‌ SV Petrol Manual ఎక్స్-షోరూమ్ ధర రూ. 11,80,700. రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ & ఇతర చార్జీలు కలిపి హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర సుమారు రూ. 14,71,009 అవుతుంది. టాప్-ఎండ్ మోడల్  ZX Petrol Automatic Dual Tone ADV Edition ఆన్-రోడ్ ధర రూ. 21,09,143 వరకు ఉంటుంది.

విజయవాడలో ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధర

విజయవాడలో Honda Elevate బేస్‌ వేరియంట్‌ SV Petrol Manual ఎక్స్-షోరూమ్ ధర రూ. 11,80,700. రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ & ఇతర చార్జీలు కలిపి బెజవాడలో ఆన్-రోడ్ ధర సుమారు రూ. 14,57,984 అవుతుంది. టాప్-ఎండ్ మోడల్  ZX Petrol Automatic Dual Tone ADV Edition ఆన్-రోడ్ ధర రూ. 20,90,416 వరకు ఉంటుంది.

అద్భుత ఇంజన్, ఫీచర్లు & సేఫ్టీ స్పెసిఫికేషన్లు

ఈ ఎస్‌యూవీలో 1.5-litre i-VTEC Petrol Engine అందించారు. ఇది 121 PS పవర్‌ & 145 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-Speed Manual & 7-Speed CVT Automatic ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. కేవలం లగ్జరీ మాత్రమే కాకుండా, హోండా సెన్సింగ్‌ ADAS టెక్నాలజీ, 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు & 220 mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ వంటి అత్యుత్తమ ఫీచర్లు ఉన్నాయి.

కనీస డౌన్‌పేమెంట్‌ & ఫైనాన్స్‌ ప్లానింగ్

తెలుగు రాష్ట్రాల్లో.. ప్రముఖ బ్యాంకులు & ఫైనాన్స్ కంపెనీలు ఈ మోడల్‌పై లోన్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. మీరు, హైదరాబాద్‌లో బేస్‌ వేరియంట్‌ను లోన్‌పై కొనాలంటే, కనీస డౌన్‌పేమెంట్ రూ.3 లక్షలు చెల్లించాలి. మిగిలిన మొత్తం రూ. 11,71,009ను రుణం రూపంలో పొందవచ్చు. ఈ రుణాన్ని మీరు 10% వార్షిక వడ్డీ చొప్పున పొందారు అని భావిస్తే...

ఇది కూడా చదవండి: టాటా కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌.. ఈ నెలలో రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌!

రూ. 11,71,009 లోన్‌పై 10% వడ్డీ రేటుతో 5, 6 & 7 ఏళ్లకు EMI లెక్కలు:

5 ఏళ్ల (60 నెలలు) టెన్యూర్: నెలకు చెల్లించాల్సిన EMI సుమారు రూ. 24,880 గా ఉంటుంది.

6 ఏళ్ల (72 నెలలు) టెన్యూర్: నెలకు చెల్లించాల్సిన EMI సుమారు రూ. 21,693 గా ఉంటుంది.

7 ఏళ్ల (84 నెలలు) టెన్యూర్: సుదీర్ఘ కాలపరిమితి ఎంచుకుంటే నెలకు కనీసం రూ. 19,440 చెల్లిస్తే సరిపోతుంది.

మీరు 7 ఏళ్ల కాల వ్యవధిని ఎంచుకుంటే, నెలకు రూ.20,000 కంటే తక్కువ మొత్తంతోనే Honda Elevate ను మీ సొంతం చేసుకోవచ్చు.

కారు కొనుగోలు చేసే ముందు విభిన్న బ్యాంకులు అందించే ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్లు & ప్రిపేమెంట్ నిబంధనలను పరిశీలించండి. మీ CIBIL స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే 10% కంటే తక్కువ వడ్డీకే రుణం పొందే వెసులుబాటు ఉంటుంది. ఆన్-రోడ్ ధరపై డీలర్‌షిప్ వారంటీ ఆఫర్లను సరిచూసుకోవడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి: కొత్త ఇంజిన్‌తో సరికొత్తగా మారిన 2026 Maruti Baleno.. ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ రోడ్డుపై ఎలా ఉంది?

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

116km రేంజ్‌ ఇచ్చే కైనెటిక్ DXను రూ.10,000తో సొంతం చేసుకోండి.. బ్యాంక్ వడ్డీ రేట్లు, EMI ఆప్షన్లు ఇవే!
రూ.10,000తో Kinetic DX కొనేయొచ్చు - హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర, EMI ప్లాన్‌ వివరాలు మీ కోసం
కైనెటిక్ స్కూటర్లకు బిగ్ అప్‌గ్రేడ్.. కొత్త బ్యాటరీతో ఇప్పుడు ఏకంగా 132 కి.మీ. రేంజ్!
కైనెటిక్‌ స్కూటర్ల కెపాసిటీ పెరిగింది, ఇప్పుడు సింగిల్‌ ఛార్జ్‌తో 132km రేంజ్‌!
టాటా కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌.. ఈ నెలలో రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌!
టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలలో కొంటే రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌!
కొత్త ఇంజిన్‌తో సరికొత్తగా మారిన 2026 Maruti Baleno.. ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ రోడ్డుపై ఎలా ఉంది?
2026 మారుతి బలెనో రోడ్‌ టెస్ట్‌.. కొత్త ఇంజిన్‌, ఫీచర్లు మనస్సులు గెలుచుకున్నాయా?
Advertisement

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
BRS MLAs: మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
Lust Stories 3 Trailer : బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కైనెటిక్ స్కూటర్లకు బిగ్ అప్‌గ్రేడ్.. కొత్త బ్యాటరీతో ఇప్పుడు ఏకంగా 132 కి.మీ. రేంజ్!
కైనెటిక్‌ స్కూటర్ల కెపాసిటీ పెరిగింది, ఇప్పుడు సింగిల్‌ ఛార్జ్‌తో 132km రేంజ్‌!
Deepika Padukone Baby Bump: కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
Hartalika Teej 2026: గణేష్ చతుర్థి రోజు అరుదైన సంయోగం, ఈ 4 రాశుల మహిళలకు అదృష్టం!
గణేష్ చతుర్థి రోజు అరుదైన సంయోగం, ఈ 4 రాశుల మహిళలకు అదృష్టం!
Embed widget