అన్వేషించండి

KTM 390 అడ్వెంచర్‌, ఎండ్యూరో బైక్‌లకు గ్లోబల్‌ రీకాల్‌ - భారత్‌ మోడళ్ల పరిస్థితేంటి?

KTM 390 అడ్వెంచర్ X, ఎండ్యూరో R బైక్‌లకు సైడ్‌ స్టాండ్‌ సమస్యను కంపెనీ గుర్తించింది, ఉచితంగా రీప్లేస్‌ చేసేందుకు గ్లోబల్‌ రీకాల్‌ చేసింది.

KTM Side Stand Issue: ప్రపంచవ్యాప్తంగా అడ్వెంచర్‌ బైక్‌ ప్రేమికుల్లో మంచి క్రేజ్‌ ఉన్న KTM బైకుల గురించి తాజాగా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ వచ్చింది. ఈ కంపెనీ, తన 390 అడ్వెంచర్ X, 390 అడ్వెంచర్ R, 390 ఎండ్యూరో R, 390 SMC-R మోడళ్లకు సంబంధించి గ్లోబల్‌ రీకాల్‌ ప్రకటించింది. అయితే, ఈ వార్త వినగానే భారత వినియోగదారులు టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదని KTM స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే, భారత్‌లో తయారైన, భారత్‌లో అమ్మిన KTM 390 మోడళ్లకు ఈ రీకాల్‌ వర్తించదు.

రీకాల్‌కు కారణం ఏంటి?
ఈ రీకాల్‌కు కారణం... సైడ్‌ స్టాండ్‌కు సంబంధించిన ఒక టెక్నికల్‌ లోపం. కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో (భారత్‌లో కాదు) విక్రయించిన బైక్‌లలో, సైడ్‌ స్టాండ్‌ స్ప్రింగ్‌ దెబ్బతినడం వల్ల బైక్‌ అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా స్టార్ట్‌ కాకపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని కంపెనీ గుర్తించింది. ఈ సమస్య ప్రధానంగా USA, కెనడా సహా మరికొన్ని విదేశీ మార్కెట్లలో అమ్మిన బైక్‌లలో మాత్రమే కనిపించిందని KTM తెలిపింది.

KTM చెప్పిన వివరాల ప్రకారం, ఇంజిన్‌ నుంచి వచ్చే వైబ్రేషన్స్‌ కారణంగా ఈ లోపం ఉత్పన్నమవుతోంది. ప్రత్యేకంగా, అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేసిన కొన్ని మోడళ్లలో వాడిన ఫోర్జ్డ్‌ సైడ్‌ స్టాండ్‌ కారణంగా ఈ సమస్య ఏర్పడింది. అదే సమయంలో, భారత మార్కెట్‌కు ఉద్దేశించిన బైక్‌లలో ఫాబ్రికేటెడ్‌ సైడ్‌ స్టాండ్‌ వాడుతుండటంతో, ఇక్కడ అమ్మిన మోడళ్లపై ఎలాంటి ప్రభావం లేదని కంపెనీ స్పష్టం చేసింది.

కస్టమర్లు ఏం చేయాలి?
రీకాల్‌లో భాగంగా, ప్రభావిత బైక్‌లకు KTM కొన్ని మార్పులు చేయనుంది. కస్టమర్లు తమ సమీప KTM సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లి, సైడ్‌ స్టాండ్‌ స్ప్రింగ్‌ను కొత్తదిగా మార్చించుకోవాలి. అదనంగా, సైడ్‌ స్టాండ్‌కు ఒక రబ్బర్‌ ప్రొటెక్టర్‌ను అమర్చడం, అలాగే కొన్ని వాహనాల్లో సైడ్‌ స్టాండ్‌ సెన్సార్‌ రిటైనింగ్‌ ప్లేట్‌ను కొత్తగా ఫిట్‌ చేయడం వంటివి చేయనుంది. దీనివల్ల సైడ్‌ స్టాండ్‌ స్విచ్‌ ట్రిగర్‌ రేంజ్‌ సరిగా పనిచేస్తుందని KTM చెబుతోంది.

భారతీయుల సంగతేంటి?
భారత్‌ విషయానికి వస్తే, ఇక్కడ అమ్మిన KTM 390 అడ్వెంచర్‌, ఎండ్యూరో మోడళ్లలో వాడే సైడ్‌ స్టాండ్‌ స్ప్రింగ్‌ను ఈ ఏడాది ప్రారంభంలోనే ముందస్తుగా అప్‌గ్రేడ్‌ చేశామని కంపెనీ వెల్లడించింది. అందుకే భారత వినియోగదారులకు ఈ సమస్య అసలు రావడం లేదని KTM పేర్కొంది.

మొత్తానికి, సోషల్‌ మీడియాలో రీకాల్‌ వార్తలు చూసి భారత KTM యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రీకాల్‌ కేవలం అంతర్జాతీయ మోడళ్లకే పరిమితం. భారత్‌లో అమ్మిన KTM 390 అడ్వెంచర్‌, ఎండ్యూరో బైక్‌లు పూర్తిగా సేఫ్‌ అని కంపెనీ మరోసారి భరోసా ఇచ్చింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Car Diwali Offers: మారుతి కార్లపై నవంబర్ ఆఫర్లు.. Wagon R, Alto K10 సహా చాలా మోడళ్లపై రూ.1.51 లక్షల వరకు డిస్కౌంట్లు!
మారుతి కార్లపై భారీగా పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.51 లక్షల వరకు ప్రయోజనాలు!
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Embed widget