అన్వేషించండి

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి

Auto News In Telugu | హైవేలపై వేగాన్ని ఇష్టపడేవారికి రూ. 15 నుంచి 20 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి బలమైన టార్క్, టర్బో ఇంజిన్‌తో కనురెప్పపాటులో టాప్ స్పీడ్ అందుకుంటాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైవే వేగం కోసం 15-20 లక్షల్లో ఉత్తమ కార్లు.
  • వర్టస్, స్లావియా వేగవంతమైన సెడాన్లు; క్రెటా, సెల్టోస్ పెర్ఫార్మెన్స్ SUVలు.
  • XUV700, హారియర్ శక్తివంతమైన ఇంజిన్లు, అధిక నియంత్రణ అందిస్తాయి.

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీలు, సెడాన్ కార్ల క్రేజ్ బాగా పెరిగింది. ఇటీవల కార్లు కొనుగోలు చేసేవారు కేవలం మైలేజ్, ఫీచర్లు మాత్రమే కాదు, పవర్‌ఫుల్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్, హైవేపై అద్భుతమైన డ్రైవింగ్ వివరాలు చెక్ చేస్తున్నారు. 

మీ బడ్జెట్ కనుక రూ. 15 నుంచి 20 లక్షల మధ్య ఉండి, హైవేపై వేగంతో దూసుకెళ్లే కారు కోసం మీరు చూస్తున్నట్లయితే, మార్కెట్‌లో కొన్ని అత్యుత్తమ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లలో లభించే బలమైన టర్బో-పెట్రోల్ ఇంజిన్, అద్భుతమైన టార్క్ జర్నీలో మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

వోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా 
మీకు సెడాన్ కార్లంటే ఇష్టమైతే, ఒకవేళ వేగం కూడా కావాలంటే.. వోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus), స్కోడా స్లావియా (Skoda Slavia)లోని 1.5 లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ మీకు సరిపోతుంది. ఈ ఇంజిన్ 150 PS పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ కార్ హైవేపై వెళ్తున్నప్పుడు, దీని యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ, DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కాంబో మీకు బెస్ట్ స్పీడ్ ఇస్తుంది. దీని హై-స్పీడ్ స్టెబిలిటీ, కార్నరింగ్ ఎంత అద్భుతం అంటే.. 100 నుంచి 120 కిమీ/గంట వేగంలో కూడా కారు రోడ్డుకు అతుక్కుని వెళ్తున్నట్లు అనిపించి  డ్రైవర్‌కు ఏ ఇబ్బంది ఉండదు. 

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్  
మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్‌ (Kia Seltos)లోని కొత్త 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ పరంగా గేమ్ ఛేంజర్‌గా మారుతోంది. ఈ ఇంజిన్ 160 PS గరిష్ట పవర్, 253 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్‌తో వచ్చే 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్ గేర్లను ఎలా పనిచేస్తుందంటే.. ఓవర్‌టేక్ చేసే సమయంలో మీకు ఎలాంటి ల్యాగ్ అనిపించదు. హైవేపై మీరు అలా క్లచ్ నొక్కగానే, ఈ ఎస్‌యూవీ రెప్పపాటులో దాదాపు 100+ km/h వేగాన్ని టచ్ చేస్తుంది. లాంగ్ జర్నీలకు వీటి రైడ్ క్వాలిటీ, పవర్ డెలివరీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.

మహీంద్రా XUV700

మహీంద్రా XUV700 (Mahindra XUV700) ఎంట్రీ, మిడ్ లెవెల్ వేరియంట్లు రూ. 15 నుంచి రూ. 20 లక్షల ఎక్స్‌షోరూమ్ రేంజ్‌లో లభిస్తాయి. ఈ కారులో లభించే 2.0 లీటర్ mStallion టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఈ విభాగంలోనే అతి పెద్దది, అత్యంత పవర్‌ఫుల్ ఇంజిన్. ఈ ఇంజిన్ 200 PS భారీ పవర్, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారీ ఎస్‌యూవీ అయినప్పటికీ, హైవేపై దీని వేగం ఎక్కువగానే ఉంటుంది. దీని సస్పెన్షన్ సెటప్, బరువైన బాడీ హై-స్పీడ్‌లో కారును పూర్తిగా కంట్రోల్ లో ఉంచుతాయి.

టాటా హారియర్ 
వేగంతో పాటు హైవేపై భారీ టార్క్, రఫ్ లుక్ ఇష్టపడే వారికి టాటా హారియర్ (Tata Harrier) బేస్, మిడ్ వేరియంట్లు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇందులో 2.0 లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ వస్తుంది. ఈ ఇంజిన్ 170 PS పవర్, 350 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది.

ల్యాండ్ రోవర్ ఒమేగా ఆర్క్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన ఈ కారు హైవేలో జర్నీకి సరిగ్గా సరిపోతుంది. దీని పెర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందంటే.. ఎలాంటి హైవేపై అయినా అలసట లేకుండా గంటల తరబడి 100+ వేగంతో డ్రైవ్ చేయవచ్చు. బరువైన స్టీరింగ్ వీల్ హై-స్పీడ్‌లో డ్రైవర్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Frequently Asked Questions

రూ. 15-20 లక్షల బడ్జెట్‌లో హైవేపై వేగంగా వెళ్లే కార్లు ఏవి అందుబాటులో ఉన్నాయి?

ఈ బడ్జెట్‌లో వోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా వంటి సెడాన్‌లు, అలాగే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మహీంద్రా XUV700, టాటా హారియర్ వంటి ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. వీటి బలమైన టర్బో-పెట్రోల్/డీజిల్ ఇంజిన్‌లు అద్భుతమైన టార్క్ అందిస్తాయి.

హైవేపై వేగంగా దూసుకెళ్లే సెడాన్ కార్లు ఏవి, వాటి ఇంజిన్ సామర్థ్యం ఎంత?

వోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియాలోని 1.5 లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ 150 PS పవర్, 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ, DSG గేర్‌బాక్స్ కాంబో బెస్ట్ స్పీడ్ అందిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ హైవేపై ఎలా పని చేస్తాయి?

ఈ కార్లలోని 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 160 PS పవర్, 253 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్ కారణంగా ఓవర్‌టేకింగ్‌లో ఎలాంటి ల్యాగ్ ఉండదు, లాంగ్ జర్నీలకు ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి.

ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన ఇంజిన్ గల ఎస్‌యూవీ ఏది?

మహీంద్రా XUV700లోని 2.0 లీటర్ mStallion టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఈ విభాగంలోనే అతి పెద్దది, అత్యంత శక్తివంతమైనది. ఇది 200 PS పవర్, 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, హై-స్పీడ్‌లో కూడా పూర్తి నియంత్రణను అందిస్తుంది.

టాటా హారియర్ హైవేలకు ఎందుకు బెస్ట్ ఛాయిస్?

టాటా హారియర్ ల్యాండ్ రోవర్ ఒమేగా ఆర్క్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. దీని 2.0 లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ 170 PS పవర్, 350 Nm టార్క్ అందిస్తుంది. దీని క్రూజింగ్ పెర్ఫార్మెన్స్ అద్భుతం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?
E20 Petrol Dispute: E20 పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం.. ఎక్కువ ఇథనాల్‌ కలుపుతున్నారని, రిపేర్లు పెరిగాయని ఆరోపణ
E20 పెట్రోల్‌లో 31.2% వరకు ఇథనాల్? అనుమతించినదాని కంటే ఎక్కువే! అసలు వివాదం ఏమిటి?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Embed widget