అన్వేషించండి

Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?

Dharani Land Scam Probe 2026: తెలంగాణ ధరణి పోర్టల్‌లో 22-ఏ నిషేధిత భూముల బదిలీపై సీఐడీ తనిఖీలు, అరెస్టులు ప్రారంభించింది. బీఆర్ఎస్ అగ్రనేతల ప్రమేయం బయటకు వస్తుందా?

Revanth Reddy Government Dharani Investigation:  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ విప్లవంగా ప్రచారం చేసుకుని తీసుకొచ్చిన ధరణి  భూముల పోర్టల్‌లో జరిగిన సంచలన అక్రమాలపై తెలంగాణ సీఐడీ   ఉక్కుపాదం మోపడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా  వేడెక్కింది. సీఐడీ విభాగంతో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందాలు   రంగంలోకి దిగి హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డిలతో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో రహస్య దాడులు, ఆపరేషన్లు నిర్వహించాయి. ఈ క్రమంలో పోర్టల్ డెవలపర్లు, రెవెన్యూ ఆపరేటర్లు, డాక్యుమెంట్ రైటర్లతో పాటు పలువురు నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.

ధరణి పోర్టల్ ద్వారా భూములు  కబ్జా చేశారని ఆరోపణలు

ఫోరెన్సిక్ ఆడిట్‌లో లభించిన ఆధారాల ప్రకారం.. నాటి ప్రభుత్వంలోని కీలక పెద్దలు, నిబంధనలకు విరుద్ధంగా  సెక్షన్ 22-ఏ  కింద ఉన్న నిషేధిత జాబితా భూములు  , కోట్లాది రూపాయల విలువైన అసైన్డ్ ,  సీలింగ్ మిగులు భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులు, రియల్ ఎస్టేట్ దిగ్గజాల పేరిట మార్చివేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వ్యవస్థీకృతంగా డిజిటల్ రికార్డులను ట్యాంపర్ చేస్తూ, అధికారులపై ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రే నిషేధిత జాబితా నుంచి వేలాది ఎకరాలను తొలగించడం వెనుక కొందరు బీఆర్ఎస్ అగ్రనేతల ఆశీస్సులు ఉన్నాయని విచారణలో ప్రాథమికంగా వెల్లడవుతోంది.

గోప్యంగా పూర్తిస్థాయిలో విచారణ

ఈ దర్యాప్తు పురోగతితో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ధరణి అనేది కేసీఆర్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కావడంతో, ఇందులో జరిగిన అవకతవకలు నేరుగా నాటి మంత్రివర్గం ,  ఐఏఎస్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాయి. సీఐడీ దర్యాప్తు కేవలం క్రింది స్థాయి ఆపరేటర్లకే పరిమితం కాకుండా, పొలిటికల్ మాస్టర్‌మైండ్స్ ,  బిజినెస్ నెట్‌వర్క్‌లను టార్గెట్ చేసుకుని సాగుతుండటంతో.. రాబోయే రోజుల్లో నాటి కీలక నేతలకు నోటీసులు జారీ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

విచారణ వెనుక పొలిటికల్ ఎజెండా ఉందా? 

మరోవైపు, ఈ సీఐడీ విచారణ వేగం వెనుక స్పష్టమైన రాజకీయ అజెండా ఉందనే ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ పాలనా లోపాలు, గ్యారెంటీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే  కక్షసాధింపు రాజకీయాల్లో  భాగంలో ధరణి దర్యాప్తును రాజకీయాస్త్రంగా ఉపయోగిస్తోందని విమర్శిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం— బాధితులైన వేలాది మంది రైతులకు న్యాయం చేయడానికే, దోచుకున్న ప్రజా భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకే ఈ న్యాయపరమైన దర్యాప్తు జరుపుతున్నామని గట్టిగా సమర్థించుకుంటోంది.

ముందు ముందు రాజకీయ కలకలం ఖాయం 

 రికార్డుల డిజిటైజేషన్ పేరుతో భూ రికార్డుల అధికారాలను కేంద్రీకరించి, కొందరు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా మార్పులు చేశారన్నది ప్రధాన నిరూపిత అంశంగా మారబోతోంది. డిజిటల్ ఫుట్‌ప్రింట్స్, లాగ్ ఫైల్స్, ఐపీ అడ్రస్‌లు ఆధారంగా దర్యాప్తు సాగుతుండటంతో ఆడిట్ ట్రయల్‌ను తప్పించుకోవడం నేతలకు దాదాపు అసాధ్యం. దర్యాప్తు సంస్థల వద్ద ఉన్న పక్కా సాంకేతిక ఆధారాలు బయటకు వస్తే, అక్రమ మార్గంలో సంపాదించిన ఆస్తుల జప్తుతో పాటు పెద్ద తలకాయల అరెస్టులు తప్పవని భావిస్తున్నారు.  తెలంగాణలో  ధరణి  కుంభకోణం దర్యాప్తు కేవలం రెవెన్యూ వివాదం మాత్రమే కాదు, కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య సుదీర్ఘకాలం సాగే ప్రధాన రాజకీయ పోరాటంగా రూపాంతరం చెందింది. ఈ అక్రమాల మనీ ట్రయల్స్,  భూ బదిలీల వెనుక ఉన్న నిజాన్ని సీఐడీ పూర్తిస్థాయిలో వెలుగులోకి తెస్తే.. అది బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బ కావడమే కాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని కీలక రాజకీయ పరిణామాలకు బాటలు వేస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
Botsa Anusha: బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
Telangana Graduates MLC Election : కాంగ్రెస్ సర్కార్‌కి లిట్మస్ టెస్ట్- పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుపై విద్యావంతుల తీర్పు ఏంటి?
కాంగ్రెస్ సర్కార్‌కి లిట్మస్ టెస్ట్- పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుపై విద్యావంతుల తీర్పు ఏంటి?
Nara Lokesh: మృత్యుంజయురాలు గోపిక - రాప్తాడు బాధితురాలి కోసం స్వయంగా లోకేశ్ వైద్య పర్యవేక్షణ !
మృత్యుంజయురాలు గోపిక - రాప్తాడు బాధితురాలి కోసం స్వయంగా లోకేశ్ వైద్య పర్యవేక్షణ !
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget