Old vs New Kinetic Scooter: పాత కైనెటిక్ హోండా DX - కొత్త కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్ మధ్య తేడాలేంటి?, ఫీచర్లు, డిజైన్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయి?
Kinetic DX Electric Scooter: పాత Kinetic Honda DX స్కూటర్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించిన కొత్త Kinetic DX Electric వర్షన్ ఎలా మారింది?, డిజైన్, ఫీచర్లు & ఫీల్‌లో ఎంత తేడాలు ఉన్నాయి?.

Old Kinetic Honda DX vs New Kinetic DX Electric Comparison: 1980వ దశకం చివర నుంచి 1990ల వరకు, భారతీయ రహదారులను ఏలిన స్కూటర్ Kinetic Honda DX. ఇప్పుటి స్కూటర్లలో కనిపిస్తున్న డిజైన్ & కొన్ని ఫీచర్లను అప్పట్లోనే ఈ స్కూటర్‌లో ఇచ్చారు, కస్టమర్లను &ఆటో ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు. అప్పుడు, సామాన్య ప్రజల "ఫ్యామిలీ స్కూటర్"గా గుర్తింపు తెచ్చుకున్న కైనెటిక్ హోండా, ఇప్పుడు, 40 సంవత్సరాల తర్వాత, కొత్త రూపంలో మళ్లీ వచ్చింది. ఈసారి దీనిని ఎలక్ట్రిక్ స్కూటర్‌గా లాంచ్ చేశారు, Kinetic DX Electric అని పేరు పెట్టారు & లెజెండ్ ఈజ్ రీబోర్న్ అని క్యాప్షన్ కూడా తగిలించారు.
కొత్త Kinetic DX ఎలక్ట్రిక్ వాహనంగా, రెట్రో శైలిని కలుపుకుంటూనే పూర్తిగా కొత్త టెక్నాలజీతో వచ్చింది. పాత స్కూటర్‌తో పోలిస్తే ఇందులో డిజైన్, బాడీ స్ట్రక్చర్, టెక్నాలజీ, ఫీచర్లు ఎలా మారాయో తెలుసుకుందాం.
డిజైన్ పోలికలు – పాత స్కూటర్‌ను గుర్తు చేస్తుందా?
పాత కైనెటిక్ హోండా DX లో.. ముందు పైపున కవర్‌లా ఉండే ఫ్లాట్ డిజైన్, దాని కవర్ చేసిన హ్యాండిల్ బార్, చిన్న బజ్జింగ్ లైట్లు ఉంటే.. కొత్త DX వర్షన్ వాటిని నేరుగా అనుకరించలేదు. కొత్త Kinetic DX లో ట్రెండీ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ ఫెండర్లు, అగ్రెసివ్ కలర్స్ ఉన్నాయి. అయితే, పాత బాడీపై కనిపించే మూడు వర్టికల్ వెంచ్‌లను కొత్త బాడీలో తిరిగి అందించారు. అలాగే, కొత్త స్కూటర్ బాడీలోని ముదురు వెండి & నీలం రంగుల కాంబినేషన్లు పాత స్కూటర్‌ను గుర్తు చేసేలా ఉన్నాయి.
ఫీచర్లలో తేడాలు – 40 ఏళ్ల జంప్
పాత కైనెటిక్‌లో కిక్ స్టార్టర్, మెకానికల్ మీటర్లు, ఫ్యాన్ కూల్డ్ ఇంజిన్ ఉండేది. కానీ, కొత్త Kinetic DX లో:
ఫుల్ డిజిటల్ కన్సోల్
బ్లూటూత్ కనెక్టివిటీ
రివర్స్ మోడ్
క్రూజ్ కంట్రోల్
3 రైడ్ మోడ్స్ ఎంపికలు (Range, Power, Turbo)
3.0 kWh LFP బ్యాటరీ, హబ్ మౌంటెడ్ మోటార్
ఇవన్నీ పాత స్కూటర్‌తో అసలు పోలిక లేనివి.
టెక్నాలజీ అప్‌డేట్స్
కైనెటిక్ పాత వర్షన్‌లో 100cc హోండా ఇంజిన్ ఉండేదని మీకు గుర్తుండి ఉండాలి. కానీ కొత్త Kinetic DX లో మైక్రో కంట్రోలర్ ఆధారిత బ్యాటరీ మేనేజ్‌మెంట్, IP67 మోటార్ ప్రొటెక్షన్, 3 గంటల్లో 80% ఛార్జింగ్, OTA అప్‌డేట్స్ వంటి శక్తిమంతమైన ఫీచర్లు ఉన్నాయి. కాలానికి అనుగుణంగా వచ్చిన సాంకేతికత మార్పులను అందిపుచ్చుకున్నట్లు ఇది వెల్లడిస్తుంది.
బాడీ, ఫీల్ – మెటల్ టచ్ కొనసాగుతుందా?
కొత్త స్కూటర్ మోనోకాక్ మెటల్ బాడీతో వస్తోంది, పాత కైనెటిక్‌కు లభించిన గుర్తింపును ఇది మరోమారు గుర్తు చేస్తుంది. స్టెప్‌థ్రూ బాడీ, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్ వంటి రీజనల్ ప్రాక్టికాలిటీ ఇంకా కొనసాగుతున్నాయి. అయితే కొత్తది మరింత నాజూకుగా, కాంపాక్ట్‌గా కనిపిస్తుంది.
ధర
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల్లో, కొత్త కైనెటిక్ DX ధరను (Kinetic DX Electric Price in Hyderabad) ₹1.11 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. RTO, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలను కలుపుకుంటే ఆన్-రోడ్ ధర వస్తుంది.
ఎవరి కోసం?
రోజువారీ ప్రయాణికులకే కాకుండా, పాత కైనెటిక్ మిస్ అయిన ఇప్పటి తరానికి దానిని గుర్తు చేసేందుకు కొత్త కైనెటిక్ ఎలక్ట్రిక్‌ను తీసుకువచ్చారు. హై రేంజ్ కోరేవాళ్లకు ఇది సూట్ కానప్పటికీ... స్టైలిష్‌గా & నోస్టాల్జిక్‌గా ఉండే స్కూటర్ కోసం చూస్తున్నవాళ్లకు ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది!.





















